E-Paper
Advertisement

Aishwrya Sharma: భర్తతో విడాకులు… కర్మ వదిలిపెట్టదు.. నటి ఐశ్వర్య రియాక్షన్

Aishwrya Sharma: భర్తతో విడాకులు… కర్మ వదిలిపెట్టదు.. నటి ఐశ్వర్య రియాక్షన్
Advertisement

Aishwarya Sharma Reacts on Divorce: సినీ పరిశ్రమలో పెళ్లి, విడాకులు కామన్ అయిపోయాయి. మనసు పడగానే డేటింగ్ రిలేషన్.. ఆ తర్వాత పెళ్లి. ఇక చిన్న చిన్న గొడవలు, కారణాలకే టాటా.. బైబై అంటున్నారు. ఈ మధ్య ఇవి మరి ఎక్కువయ్యాయి. అందుకే సినీ ఇండస్ట్రీ నుంచి తరచూ ఎవరోకరి విడాకులు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ప్రముఖ నటి, సీరియల్ ఆర్టిస్టు ఐశ్వర్య శర్మ విడాకులు కూడా బి టౌన్ లో హాట్ టాపిక్ అయ్యాయి. త్వరలోనే ఐశ్వర్య భర్తకు విడాకులు ఇవ్వబోతుందంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

కర్మ ఫలం గురించి ఆలోచించుకోండి..

Advertisement

కొన్ని రోజులుగా ఆమె వార్తలు వస్తున్న ఆమె స్పందించకపోవడంతో ఈ రూమర్స్ మరింతగా వ్యాప్తి చెందాయి. తాజాగా తన విడాకులపై ఐశ్వర్య శర్మ స్పందించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేసింది. తన మౌనాన్ని సమాధానం తీసుకుని రెచ్చిపోతున్నారంటూ అసహనం చూపించింది. అబద్దాలు వ్యాప్తి చేసేవారు కర్మ ఫలం ఫలితం గురించి ఆలోంచుకోండంటూ హెచ్చరించింది. కొంతకాలంగా నేను మౌనంగా ఉంటున్నాను అంటే దాని అర్థం నేను బలహీను రాలిని అని కాదు. నా మెంట్ పీస్ ని కాపాడుకోవడానికే నేను ఈ రూమర్స్ కి దూరంగా ఉంటున్నా. కానీ, కొందను నా సైలెన్స్ ని వారికి బలంగా మార్చుకుని నాపై ఇష్టం వచ్చినట్టుగా వార్తలు రాస్తున్నారు.

ఆధారాలు ఉన్నాయా?

నేనేప్పుడు నా వ్యక్తిగత విషయాలు (విడాకులు) గురించి ఎక్కడ మాట్లాడలేదు. కానీ, నిజనిజాలు తెలుసుకోకుండా వారి స్వలాభం కోసం, పబ్లిసిటీ కోసం నా పేరు ఉపయోగించుకుని నాపై కథలు కథలుగా రాస్తుకుంటున్నారు. అందులో నిజం ఉందా లేదా అని కూడా ఆలోచించడం లేదు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు, కథనాలు చూస్తుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. కానీ, నా డిగ్నిటి కోసం వీటన్నింటికి దూరంగా ఉంటున్నా. అయినా ఈ తప్పుడు ప్రచారాలు మాత్రం ఆగడం లేదు. అందుకే మీ అందరికి ఒక క్లారిటీ ఇవ్వాలని నిర్ణయించుకున్నా. నేను ఎలాంటి ఇంటర్య్వూ ఇవ్వలేదు. ఎలాంటి స్టేట్ మెంట్స్, కానీ,రికార్డ్స్ కానీ పాస్ చేయలేదు. మీ వార్తలకు (విడాకులు రూమర్స్)సంబంధించిన నా నుంచి ఏవైనా నిజమైన ఆధారాలు మెసేజ్ లు, ఆడియో.. వీడియో రికార్డ్స్ ఉంటే చూపించండి. ఒకవేళ లేవంటే ఇకనైనా నా గురించిన తప్పుడు వార్తలను ప్రచారం చేయడం మానుకోండి.

Advertisement

Also Read: Thalaivar 173: రజినీకాంత్ కంటే ముందు ఆ హీరో రిజెక్ట్ చేశాడు, సుందర్ మార్చుకోవాల్సిందేనా?

నా మౌనం మీ సమాధానం కాదు..

నా జీవితమేం మీ కంటెంట్ కాదు. నా మౌనం మీకు అనుమతి ఇచ్చినట్టు కాదు. తప్పుడు వార్తలు రాసేవారంత ఒకటి గుర్తుపెట్టుకోండి. మౌనంగా ఉంటున్నారంటే మీకు ఏం చెప్పలేకపోవడం కాదు. నెగిటివిటీ కంటే డిగ్నిటీ ముఖ్యం. అందుకే ఈ మౌనం‘ అంటూ తన పోస్టులో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒక్క పోస్టుతో ఐశ్వర్య తన విడాకుల వార్తలకు చెక్ పెట్టింది. ఇలా తన విడాకుల వార్తలకు ఎలాంటి ఆధారాలు లేవని, తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని ఆమె స్పష్టం చేసింది. అలాగే తన జీవితంలో ఎప్పుడు ఎవరిని వేధించలేదని, స్వలాభం కోసం అబద్దాలు వ్యాప్తి చేసేవారు తమ కర్మ గురించి ఆలోచించాలని ఆమె హితవు పలికింది. వ్యక్తిగతంగా తెలియని వ్యక్తి గురించి తప్పుడు ప్రచారం చేసేముందు ఒకసారి ఆలోచించాలని ఐశ్వర్య శర్మ కోరింది.

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×