E-Paper
Advertisement

Thalaivar 173: రజినీకాంత్ కంటే ముందు ఆ హీరో రిజెక్ట్ చేశాడు, సుందర్ మార్చుకోవాల్సిందేనా?

Thalaivar 173: రజినీకాంత్ కంటే ముందు ఆ హీరో రిజెక్ట్ చేశాడు, సుందర్ మార్చుకోవాల్సిందేనా?
Advertisement

Thalaivar 173: ప్రతి ఒక్కరికి ఒక పర్టికులర్ టైం నడుస్తుంది ఆ టైంలో వాళ్ల కెరియర్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. అయితే జీవితంలో ఏదీ శాశ్వతం కాదు అని చెప్పినట్లు సక్సెస్ ఫెయిల్యూర్స్ కూడా శాశ్వతం కాదు. కానీ మనం సక్సెస్ లో ఉన్నప్పుడే 10 మంది మన చుట్టూ చేరుతారు ఇంకొక పది అవకాశాలు వస్తాయి. అదే ఫెయిల్యూర్ లో ఉంటే వచ్చిన అవకాశాలు కూడా వెనక్కి వెళ్ళిపోతాయి.

Advertisement

తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్స్ లో సుందర్ సి ఒకరు. దర్శకుడుగా సుందర్ కి విపరీతమైన క్రేజ్ ఉంది. సుందర్ కెరియర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలకు దర్శకత్వం వహించారు. రజనీకాంత్ నటించిన అరుణాచలం సినిమా గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ కూడా ఆ సినిమా చూస్తుంటే ఒక హైప్ వస్తుంది. ఆ సినిమాకు దర్శకత్వం వహించింది సుందర్ సినే. అలానే మాధవన్, కమల్ హాసన్ నటించిన ‘అన్బే శివన్’ సినిమాకు కూడా దర్శకత్వం వహించాడు సుందర్. ఇదే సినిమా తెలుగులో సత్యం సుందరం పేరుతో డబ్ అయ్యి ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే.

రజనీకాంత్ కంటే ముందు ఆ హీరోకి

సుందర్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తన 173 వ సినిమాను చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. దానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా అయిపోయాయి. ఆ సినిమాను కమల్ హాసన్ నిర్మిస్తున్నట్లు తెలిసిన విషయమే. అయితే ఆ సినిమా పూజ అయిపోయిన తర్వాత ప్రాజెక్టు నుంచి సుందర్ తప్పుకున్నట్లు పలు రకాల వార్తలు వచ్చాయి. వార్తలు వస్తున్న తరుణంలోని తప్పుకున్నట్లు ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేసేశారు. కమల్ హాసన్ కు చెప్పక ముందే ఆ ప్రెస్ నోట్ విడుదల చేశారు అనే ఒక వాదన కూడా ఉంది. ఈ సినిమా కథను రజినీకాంత్ కి చెప్పడానికంటే ముందు విజయ్ సేతుపతికి చెప్పారట సుందర్. దానికి సంబంధించిన పూజ కూడా జరిగింది. కానీ ఎందుకో ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. అదే కథను రజనీకాంత్ కి లైన్ చెప్పినప్పుడు ఇంప్రెస్ అయ్యారు. కానీ పూర్తి కథ వర్కౌట్ కాలేదు.

Advertisement

Also Read: Anchor Vishnu Priya: వివాదంలో చిక్కుకున్న యాంకర్ విష్ణు ప్రియ… బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ ఫైర్

సుందర్ మార్చుకుంటాడా

ఒక కథ ఒక హీరో దగ్గర వర్కౌట్ కాలేదు అంటే దాని గురించి కొంచెం ఆలోచించొచ్చు. కానీ ఇంకొక హీరో కూడా నచ్చలేదు అంటే కథలో ఏదో మార్పు జరగాలి అని దర్శకుడు తనకు తానుగా రియలైజ్ అవ్వాలి. అయితే మామూలుగా ఒక కథ చాలామంది దగ్గరికి మారడం అనేది సహజంగా జరుగుతుంది. కానీ ఇద్దరు స్టార్డం ఉన్న నటులు ఆ కథలో మార్పులు చెప్పారంటే ఖచ్చితంగా దర్శకుడు ఆలోచించుకోవాలి. ఆ లైన్ సుందర్ మార్చుతాడా లేకుంటే, ఎవరు ముందుకు వస్తే వాళ్లతో ఆ సినిమాని పూర్తి చేస్తాడు అనేది ఒక క్యూరియాసిటీగా మారింది. ప్రస్తుతం అతనికి కూడా డేట్స్ ఇచ్చే హీరోలు తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో ఉన్నారు. అతని చేతిలో కూడా మంచి ప్రాజెక్ట్ ఉన్నాయి. అయితే ఈ ప్రాజెక్టు ఏం చేస్తాడు అనేది త్వరలో అనౌన్స్ చేసే అవకాశం కూడా ఉంది. రజనీకాంత్ 173 వ సినిమాను ఈ దర్శకుడు చేస్తాడు అంటూ రోజుకు ఒక పేరు బయటకు వస్తుంది.

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×