E-Paper
Advertisement

కోట్ల ఆస్తులపై క్లారిటీ ఇచ్చిన టాలీవుడ్ నటి.. ఏమన్నారంటే?

కోట్ల ఆస్తులపై క్లారిటీ ఇచ్చిన టాలీవుడ్ నటి.. ఏమన్నారంటే?
Advertisement

Baby Varalakshmi: సినిమాలు సీరియల్స్ లో అవకాశాలు ఉన్నప్పుడే కచ్చితంగా ఆదాయాన్ని పెంపొందించుకోవాలని ప్రతి ఒక్కరూ పరితపిస్తూ ఉంటారు. అయితే మరికొంతమంది సినిమాల ద్వారా వచ్చిన డబ్బును వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. మీకు అవకాశాలు లేనప్పుడు ఇబ్బందులు పరిపాటే. అయితే అవకాశాలు అనేవి ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు ఉండవో తెలియని పరిస్థితి. ఒక్కొక్కసారి అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమైన సెలబ్రిటీలు కూడా ఉంటారు. అయితే సినిమాలే నమ్ముకున్న ఎంతోమందికి అవకాశాలు లేకపోతే ఏంటి పరిస్థితి? వారి ఆర్థిక స్థితిగతులు ఏంటి? ఇలా ఎన్నో విషయాలు అభిమానులను కూడా కలవర పెడుతూ ఉంటాయి. ఇక అకస్మాత్తుగా మళ్లీ మీడియా ముందుకు వచ్చి తమ కెరియర్ విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో ఒకప్పుడు వరుస సినిమాలలో నటించి బిజీ ఆర్టిస్ట్ గా మంచి పేరు సొంతం చేసుకొని.. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైన వారు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో బేబీ వరలక్ష్మి కూడా ఒకరు. చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన ఈమె.. 30 ఏళ్ల వరకు టాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వచ్చింది.

అలా పిలిస్తే తట్టుకోలేను..

గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె.. తన ఆస్తుల గురించి కొన్ని విషయాలు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. సాధారణంగా మీడియా ముందుకు రావాలి అంటే సెలబ్రిటీలు కాస్త ఆసక్తి చూపించరనే వార్తలు వినిపిస్తూ ఉంటాయి. అలా చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చి ఎన్నో విషయాలను తెలిపింది వరలక్ష్మి. ఈమె మాట్లాడుతూ..” నన్ను సిస్టర్ వరలక్ష్మి లేదా బేబీ వరలక్ష్మి అని పిలిస్తే పలుకుతాను. ఇక నా సినిమాలలోని పాత్రల ద్వారా రే*పుల వరలక్ష్మి అని పిలిస్తే మాత్రం తట్టుకోలేను. ముఖ్యంగా నాతోటి నటీనటులు నన్ను అలాగే పిలిచేవారు. అది నాకు అస్సలు నచ్చేది కాదు. నిజానికి నా ఫేస్ అమాయకంగా కనిపించడం వల్ల ఎక్కువగా దర్శకులు కూడా మోసపోయి, రే*ప్ చేయబడ్డ అమ్మాయి పాత్రలే ఎక్కువగా ఇచ్చే వాళ్ళు.

Advertisement

ALSO READ:స్మగ్లింగ్ కేసులో అరెస్ట్.. నటి రన్యారావుకి భారీ ఊరట!

ఆస్తుల వివరాలపై క్లారిటీ ఇచ్చిన వరలక్ష్మి..

ముఖ్యంగా నాకు హీరోయిన్ రేంజిలో రెమ్యూనరేషన్ ఇచ్చే వాళ్ళు అని చెన్నైలో కోట్ల రూపాయల ఆస్తులు పోగు చేశానని చెప్పుకునే వాళ్ళు. అందులో ఏమాత్రం నిజం లేదు. ముఖ్యంగా నేను చైల్డ్ ఆర్టిస్ట్ గా నా కెరియర్ను మొదలు పెట్టినప్పుడు చాలా తక్కువ పారితోషికం ఇచ్చే వాళ్ళు. అందరికంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంది మాత్రం శాలినీనే. నా పారితోషకాలు స్కూల్ ఫీజులు కట్టడానికి కూడా సరిపోయేవి కాదు. ఇక ఆ తర్వాత సినిమాలలో చెల్లెలు పాత్రలు చేయడం మొదలుపెట్టాను. అప్పుడు బాగా పారితోషకం లభించింది . అయితే కోట్ల విలువ చేసే ఆస్తులు అయితే లేవు కానీ మాకు కలిగిన దాంట్లోనే మేము సంతోషంగా ఉన్నాము అంటూ గతంలో వరలక్ష్మి చెప్పుకొచ్చింది. ఏది ఏమైనా వరలక్ష్మి ఆస్తుల వివరాలు ఇప్పుడు మరొకసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

Related News

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

Big Stories

Advertisement
×