E-Paper
Advertisement

స్మగ్లింగ్ కేసులో అరెస్ట్.. నటి రన్యారావుకి భారీ ఊరట!

స్మగ్లింగ్ కేసులో అరెస్ట్.. నటి రన్యారావుకి భారీ ఊరట!
Advertisement

Ranyarao:కన్నడ నటి రన్యా రావు గత ఏడాదికాలంగా బంగారం స్మగ్లింగ్ కేసులో ఇరుక్కున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈమెకు ఎట్టకేలకు బెయిల్ మంజూరు అయింది..ఏడాది నుంచి బెయిల్ కోసం చేస్తున్న ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. ఇక ప్రస్తుతం పరప్పన అగ్రహారం సెంట్రల్ జైల్లో ఖైదీగా ఉన్న ఈమె నేడు బెయిల్ మీద బయటకు వచ్చారు. దీంతో ఈమెకు ఈ కేసులో భారీ ఊరట లభించిందని చెప్పాలి.

14.8 కిలోల బంగారం స్మగ్లింగ్..

దుబాయ్ నుంచి బెంగళూరుకి 14.8 కిలోల బంగారాన్ని అక్రమంగా బంగారాన్ని రవాణా చేస్తున్న రన్యా రావు గత ఏడాది మార్చి మూడవ తేదీన కెంపెగౌడ విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులకు ఆమె రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది . ఇంత పెద్ద మొత్తంలో స్మగ్లింగ్ చేయడం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ముఖ్యంగా కర్ణాటక సీనియర్ పోలీస్ అధికారి కే రామచంద్రరావుకు ఈమె సవతి కూతురు. ఈ కేసులో ఆయన పాత్ర పై కూడా అప్పట్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆయన ప్రమేయం లేకపోయినా ఆయనను, ఆయన అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఈమె ఈ రేంజ్ లో స్మగ్లింగ్ చేసింది అనే వార్తలు కూడా వినిపించాయి.

ఏడాది తర్వాత భారీ ఊరట..

Advertisement

అలా ఈ కేసులో గత ఏడాదికాలంగా బెంగళూరులోని పరప్పన అగ్రహారం సెంట్రల్ జైల్లోనే నటి రన్యా రావు ఉంది. బెయిల్ కోసం ఎన్నోసార్లు ప్రతిపాదనలు కోర్టుకు వినిపించింది. కానీ కోర్టు తిరస్కరించింది. ముఖ్యంగా కేసు తీవ్రత దృష్ట్యా హైకోర్టు ఈమెను బెయిల్ పిటిషన్ కొట్టి వేసింది. అలాగే విదేశీ మారకద్రవ్య రక్షణ , స్మగ్లింగ్ కార్యకలాపాల నివారణ చట్టం కింద కేసు కూడా నమోదు చేసింది. ఈ కేసులో ఇరుక్కున్న వారు ఎవరైనా సరే తప్పనిసరిగా ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించాల్సిందే. బెయిల్ కోసం ఆమె చేస్తున్న ప్రయత్నాలు సఫలం కాలేదు.. ఇక ఏడాది తర్వాత ఈమెకు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది కోర్టు.

కమిషన్ కోసం కక్కుర్తి..

ఇకపోతే ఈ గుట్టు ఎలా బయటపడింది అనే విషయానికొస్తే.. తాను సీనియర్ ఐపీఎస్ అధికారికి సవతి కుమార్తె కావడంతో ఎవరు తనిఖీ చేయరు అనే ధైర్యంతో బంగారం స్మగ్లింగ్ చేసింది. కేవలం 15 రోజుల్లోనే రన్యారావ్ నాలుగు సార్లు దుబాయ్ పర్యటనకు వెళ్లి రావడంతో అనుమానాలు వచ్చాయి. దీంతో 2025 మార్చి 3న ఆమె దుబాయ్ నుంచి తిరిగి వస్తుండగా విమానాశ్రయం ఎగ్జిట్ గేట్ వద్ద రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు అడ్డుకొని తనిఖీలు చేయడంతో గుట్టు రట్టు అయింది . ఏకంగా 14.2 కిలోల బంగారం ఆమె వద్ద నుండి బయటపడింది. కమిషన్ కోసం కక్కుర్తి పడే గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఈమె భాగమైనట్లు తేలింది. కేజీ బంగారానికి ఐదు లక్షల కమిషన్ వచ్చేదని ఈడీ విచారణలో స్పష్టం చేసింది .ఏది ఏమైనా ఆమె కక్కుర్తి ఆమెను జైలు పాలు చేసింది అనడంలో సందేహం లేదు.

Advertisement

 

also read:8 వారాల ఓటీటీ రిలీజ్ ఒప్పందంపై సౌత్ నిర్మాతలు కీలక నిర్ణయం.. అసలేం జరిగిందంటే?

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×