Nellore Politics: నెల్లూరు నగర మేయర్ స్థానం ఎవరిని వరించనుంది? మేయర్ పై అవిశ్వాసం పెట్టిన టీడీపీకి నెల్లూరు మున్నిపల్ కార్పొరేషన్‌లో టీడీపీకి ఓనర్‌గా ఉన్న ప్రయోజనం ఏంటి? నెల్లూరులో నాలుగేళ్ల పదవీ పూర్తి చేసుకున్న మేయర్ సీటు వదలక తప్పదా? నెల్లూరు రాజకీయాల్లో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది. మేయర్ పొట్లూరి స్రవంతి అటు టీడీపీకి ఇటు వైసీపీకి దూరమై.. రెంటికి చెడ్డ రేవడిలా తయారైనట్లేనా?
నెల్లూరు మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మనం
రాష్ట్రంలో అతిపెద్ద కార్పొరేషన్లలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఒకటి. అటువంటి కార్పొరేషన్ స్థానాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఉన్న నగర మేయర్ పొట్లూరి స్రవంతిపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దీంతో నాలుగేళ్ల తర్వాత వైసీపీ మేయర్ పొట్లూరి స్రవంతి పదవిని మరో ఏడాది ఉండగా పదవికి గండం ఏర్పడింది. వైసీపీ నుంచి గెలిచిన మెజార్టీ కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకోవడంతో వైసీపీకి కార్పొరేషన్లో మేయర్ పదవిని నిలబెట్టుకునే బలం లేకపోకుండా పోయింది.
ఒంటరిగా మిగిలిపోయిన మేయర్ పొట్లూరు స్రవంతి
దాంతో తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానం వీగిపోయే అవకాశం లేదు. వైసీపీ తరఫున మేయర్ అయిన ఆమె తర్వాత టీడీపీ నేతలకు దగ్గర అయ్యే ప్రయత్నం చేశారు. అయితే టీడీపీ నాయకులు మేయర్‌ను ఆ పదవిని కొనసాగించేందుకు సుముఖత చూపటం లేదు. దీంతో మేయర్ ఒంటరిగా మిగిలిపోయారు. మేయర్ స్థానం నుంచి స్రవంతిని దింపేందుకు తెలుగుదేశం పార్టీ రెండు రోజులుగా పావులు కదిపింది. నేటికి దాదాపు ఈ అంశంపై సక్సెస్ సాధించడానికి అవిశ్వాస తీర్మానం పెట్టింది.
డిప్యూటి మేయర్లుగా రూప్ కుమార్ యాదవ్, ఖలీల్ అహ్మద్..
2021 నవంబర్ 24న వైసీపీ కార్పొరేటర్లు బలపరిచిన గిరిజన మేయర్‌గా సునీత బాధ్యతలు చేపట్టారు. అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న శ్రీధర్ రెడ్డి అనుచరురాలిగా ఉండటం స్రవంతికి పదవి దక్కడానికి ప్రధాన కారణమైంది. అప్పట్లో 54 డివిజన్లు వైసీపీ కార్పొరేటర్లు విజయం సాధించడంతో మేయర్ పదవి పొందడం సునాయాసమైంది. డిప్యూటీ మేయర్లుగా రూప్ కుమార్ యాదవ్, ఖలీల్ అహ్మద్ కొనసాగారు. 2024 ఎన్నికలకు ఏడాది ముందు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీని వదిలి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అదే సమయంలో తనకు మేయర్ పదవి రావడానికి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కారణమని మేయర్ పేర్కొన్నారు. కొందరు వైసీపీ కార్పొరేటర్లు కూడా శ్రీధర్ రెడ్డి వెంట నడిచారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మేయర్ వైసీపీలోనే కొనసాగుతానని శ్రీధర్ రెడ్డిని కాదని వైసీపీలోనే ఉండిపోయింది. అప్పటి వైసిపి నేతలు, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కొంతమంది కార్పొరేటర్లు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెంట నడిచారు. దీంతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మేయర్ పూర్తిగా దూరమయ్యారు. మేయర్‌పై అవిశ్వాసం నేపధ్యంలో వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు.
వైసీపీ ఓటమి తర్వాత కూడా ఆ పార్టీలోనే ఉండిపోయిన స్రవంతి..
2024లో రాజకీయ పరిణామాలు ఒకసారిగా మారిపోయాయి. అప్పటివరకు పూర్తిగా మైనస్లో ఉన్న తెలుగుదేశం పార్టీ అధికారాన్ని చేపట్టింది. ప్లస్ లో ఉన్న వైసీపీ అధికారాన్ని కోల్పోయి ప్రతిపక్షంతో మిన్న కుండిపోయింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు కూడా వైసీపీని కాదని తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మేయర్ మాత్రం అలానే ఉండిపోయారు. ఈ పరిణామాలతో మేయర్ అటు తెలుగుదేశం పార్టీకి ఇటు వైసీపీకి దూరమయ్యారు. ఆమె నాలుగేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. మరో ఏడాది ఆమె పదవిలో కొనసాగే అవకాశం ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ నేతలు ఆమెపై అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమయ్యారు. మేయర్ తీరుపై మంత్రి నారాయణకు 40 మంది కార్పొరేటర్లు ఫిర్యాదు చేశారు. మేయర్ దంపతులు అభివృద్ధికి అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. వారి అవినీతి వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మేయర్ దంపతుల చేతివాటంతో దస్త్రాలు కదలడం లేదని వాపోయారు.
జాయింట్ కలెక్టర్‌కు అవిశ్వాస తీర్మానాన్ని అందజేసిన కార్పొరేటర్లు
పార్టీ మారిన వైసీపీ కార్పొరేటర్లు కొత్త మేయర్ కావాలని డిమాండ్ చేశారు. కార్పొరేటర్లతో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏకీభవించారు. ఫోర్జరీ సంతకాల కేసులో ఇటీవల మేయర్ భర్త జయవర్ధన్ జైలుకెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా నాలుగేళ్లు పూర్తి అవడంతో మేయర్ పై అవిశ్వాస తీర్మానం చేస్తూ నవంబరు 24న జాయింట్ కలెక్టర్ ను కలిసి 40 మంది కార్పొరేటర్ల సంతకాలతో కూడిన అవిశ్వాస తీర్మానాన్ని జాయింట్ కలెక్టర్‌కు అందించారు. మరో 14 రోజుల్లో కార్పొరేటర్ల సమావేశం ఏర్పాటు చేసి ఆమెపై అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టనున్నారు. దాంతో ఎస్టీ కేటగిరిలో మరో ఇద్దరు కార్పొరేటర్లు మాత్రమే తిరిగి ఆ పదవుల్లో కొనసాగేందుకు అవకాశం ఉంది. అవిశ్వాసం హడావిడి మూడు నెలలు ముందే ప్రారంభమైతే గట్టిగా ఎనిమిది నెలలు మాత్రమే వైసీపీలో ఉండే అవకాశం ఉంది. ఈ కొద్ది నెలల వ్యవధికే ఓ గిరిజన మహిళను పదవి నుంచి దించడం ఎంతవరకు సమంజసమని పలువురు బాహాటంగా ప్రశ్నిస్తున్నారు. ఈ నేపధ్యంలో వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు
అన్ని డివిజన్లలో విజయం సాధించిన వైసీపీ
ఇవన్నీ పక్కన పెడితే గత కార్పొరేషన్ ఎన్నికల్లో నెల్లూరు నగరంలోనీ అన్ని డివిజన్ లలో వైసీపీ కార్పొరేటర్ లు గెలిచారు, వీటిలో అత్యధిక శాతం ఏకగ్రీవం కాగా, మరికొందరు అతి తక్కువ డివిజన్ లలో పోటీ చేసి గెలిచారు. అప్పట్లో వైసీపీ తరపున నెల్లూరు నగర, రూరల్ ఎమ్మెల్యేలు గా ఉన్న అనిల్ కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లు నగరం లోని అన్ని డివిజన్లు గెలవడంలో కీలకంగా వ్యవహరించారు..అనంతరం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ పార్టీ లో చేరిపోవడం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అనేక మంది కార్పొరేటర్లు టీడీపీ గూటికి వచ్చేయడంతో మేయర్ కూడా మొదట శ్రీధర్ రెడ్డి వెంట నడవడం. ఆ తర్వాత ఆమె వైసీపీలోనే కొనసాగడం, కూటమి అధికారంలోకి వచ్చాక మళ్ళీ టీడీపీ వైపు జరగడం ఇలా మేయర్ గా వున్నా ఈ నాలుగు ఏళ్లలో మొదట కొన్ని రోజులు తప్ప మిగతా ఎక్కువ కాలం రాజకీయ క్రీడలో పెద్దల మధ్య పోరులో నలిగి పోతూ వచ్చారు.
తర్యాత మంత్రి నారాయణతో ప్రత్యేకంగా మాట్లాడి కూటమికి అనుకూలంగా ఉంటూ పదవి గడువు పూర్తి అయ్యేదాకా మేయర్ గా ఉండేలా చూడాలని స్రవంతి కోరారని.. అందుకు మంత్రి నారాయణ కూడా సానుకూలంగా స్పందించారని అప్పట్లో గుసగుసలు విపించాయి. కానీ మేయర్ వ్యవహారం లో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పూర్తి వ్యతిరేకత తో ఉన్నారని ఖచ్చితంగా మేయర్ ను మార్చాల్సిందే అని పట్టుబట్టినట్లు తెలుస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు , కార్పొరేషన్ల మేయర్లు, వైస్ చైర్మెన్ లు, మేయర్ లు, జిల్లా పరిషత్ లు, zp చైర్మెన్లపై అవిశ్వాసం పెడుతూ వాటిని కైవసం చేసుకుంటూ వస్తుంది.
కొన్ని చోట్ల ఈ వ్యవహారం సులభంగా జరిగినా తిరుపతి, గుంటూరు, కడప లాంటి చోట్ల యుద్ద వాతావరణంలా సాగింది. ఒక్క వెంకటగిరి మున్సిపాలిటీలో తప్ప రాష్ట్రం లో ప్రయత్నం చేసిన చోటల్లా కూటమి తమ ప్రయత్నం లో విజయం సాధించింది. ఇప్పుడు నెల్లూరు కార్పొరేషన్ వంతు వచ్చింది. తద్వారా నెల్లూరు లో టీడీపీ పార్టీ బలంగా వుంది అనే సంకేతం కూడా పార్టీ పెద్దలకు ఇవ్వొచ్చ ని సింహపురి టీడీపీ నేతలు భావిస్తున్నారు. వాస్తవానికి గత కార్పొరేషన్ ఎన్నికల్లో డివిజన్లలో టిడిపి పార్టీకి కార్పొరేట్ అభ్యర్ధులే కనిపించలేదు. ఎలక్షన్లు జరిగి ఎన్నికల్లో గెలిస్తే బలా బలాలు తెలుస్తాయి కానీ ఏకగ్రీవంగా గెలిచిన వాళ్లు ప్రజా బలంతో గెలిచినట్టు కాదు.. ఇప్పుటు కూటమి అధికారంలో ఉండటంతో గెలిచిన వారు అధికశాతం మంది టీడీపీ పంచన చేరిపోతున్నారు.
Also Read: బ్యాంక్‌లో భారీ అగ్ని ప్రమాదం.. కాలిపోయిన కంప్యూటర్లు, ఫర్నీచర్..
మొత్తానికి నెల్లూరు మేయర్ గా పొట్లూరి స్రవంతి కుర్చీ ఎసరువచ్చింది.. ఇవన్నీ ఓ ఎత్తు అయితే నెల్లూరు మేయర్ సీటు ఎస్టీ కోటా కింద రిజర్వ్ అయితే ఎస్టీ కార్పొరేటర్లు స్రవంతి కాక మరో ఇద్దరు ఉన్నారు. వారిలో దేవరకొండ సుజాతకి మేయర్ పదవి దక్కుతుందని ఒక ప్రచారం జరుగుతోంది. మరోపక్క ఎన్నో ఏళ్లుగా కార్పొరేటర్ గా కొనసాగుతూ గతం లో వైసీపీ లో ఉండి ఎన్నికలకు ముందు టీడీపీ లోకి వచ్చిన డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్‌ని ఎస్టి కాకపోయినా ఇంచార్జి మేయర్ గా పదవిలో కూర్చోపెట్టి పెత్తనం మొత్తం నడిపించబోతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. టీడీపీ లో చక్రం తిప్పుతున్న ఎంపీ, కొందరు ఎమ్మెల్యేలు ఆశీస్సులు ఆయనకు పుష్కలంగా ఉన్నాయని టాక్. మరి చూడాలిమేయర్ సీటుపై నెల్లూరులో రాజకీయం ఎలా ఉండబోతుందా?
Story By Apparao, Bigtv