E-Paper
Advertisement

AP Politics: వెంటాడుతున్న దేవుడి స్క్రిప్ట్.. ఎటు చూసినా 11 నెంబర్, వైసీపీ కొత్త నినాదమా?

AP Politics: వెంటాడుతున్న దేవుడి స్క్రిప్ట్.. ఎటు చూసినా 11 నెంబర్, వైసీపీ కొత్త నినాదమా?
Advertisement

AP Politics: వైసీపీని పాత గుర్తులు వెంటాడుతున్నాయా? పార్టీకే కాదు, నేతలను వదల్లేదా? ఎటుచూసినా నెంబర్ 11 గుర్తుకు వస్తోందా? ఇది ముమ్మాటికీ దేవుడి రాసిన స్క్రిప్టా? అవుననే అంటున్నారు ఆ పార్టీలోని కొందరు నేతలు. ఇంతకీ నెంబర్ 11 ఏంటని అనుకుంటున్నారా? అక్కడికే వచ్చేద్దాం.

వైసీపీని వెంటాడుతున్న దేవుడి స్క్రిప్ట్

Advertisement

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ గురించి చెప్పనక్కర్లేదు. రేపటి రోజున ఏం జరుగుతుందో ముందే ఊహించి చెబుతారాయన. దేశంలో జగన్ లాంటి నాయకులు ఎవరూలేరని, తాము ఏది చేసినా ట్రెండ్ సెట్ చేస్తామంటూ పదేపదే ఆ పార్టీ నేతలు సమయం, సందర్భం వచ్చినట్టు చెబుతుంటారు. దాని వెనుక కారణాలు చాలానే ఉంటాయి.

తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత 13 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడింది. తొలుత అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు జిల్లాల విభజన ప్రస్తావన జోలికి వెళ్లలేదు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ రెట్టింపు జిల్లాలు చేసింది. తాజాగా కూటమి సర్కార్ ఆ సంఖ్యను 29 జిల్లాలకు పెంచింది . వాటిలో పోలవరం, మార్కాపురం, మదనపల్లె జిల్లాలు ఆవిర్భవించాయి.

Advertisement

కొత్త జిల్లాలను కలిపితే వచ్చేది 11 సంఖ్య

రేపో మాపో వీటికి సంబంధించి గెజిట్ విడుదల కానుంది. రెవిన్యూ డివిజన్లను 77 నుంచి 82కి చేరాయి. కొత్తగా ఐదు జిల్లాలను ఏర్పాటు చేస్తారంటూ వార్తలొచ్చాయి. ఆ తర్వాత సీఎం చంద్రబాబు జోక్యం చేసుకోవడంతో చివరకు మంత్రివర్గం ఉపసంఘం నివేదిక ఇచ్చింది. చివరకు మూడు జిల్లాలను గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

గతంలో 26 జిల్లాలు ఉండగా కొత్తగా మరో మూడు వచ్చి చేరాయి. దీంతో ఏపీలోని జిల్లాల సంఖ్య 29కి చేరింది. 29ని కలిపితే వచ్చేది ‘11’ సంఖ్య. సరిగ్గా ఇక్కడే వైసీపీ అధినేత జగన్  కనెక్ట్ అయ్యారని అంటున్నారు. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలిచిన సీట్లు 11 అని అంటున్నారు.  ఎటు చూసినా 11 సంఖ్యకి వైసీపీ కనెక్ట్ అయిపోతోందని అంటున్నారు నెటిజన్లు.

ALSO READ: అధ్యక్షా అంటూ సీఎం చంద్రబాబు ముందు అదరగొట్టిన చిన్నారులు

ప్రభుత్వం ఏ పని చేసినా 11 సంఖ్యకి కనెక్ట్ అయిపోతుందని ఆఫ్ ద రికార్డులో కొందరు నేతలు చెబుతున్నారు. దేవుడి రాసిన స్క్రిప్ట్‌ అంటే ఇదేనేమోనని సెటైర్లు వేస్తున్నారు.  దీనిపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్‌ అవుతున్నాయి.  ఎన్నికల్లో వైసీపీ గెలుపొందిన సీట్లు 11. కూటమి అభ్యర్థులు గెలిసిన స్థానాలు 164. అవన్నీ కలిపితే ఓవరాల్‌గా వచ్చేది 11 అవుతుంది.

కూటమి ప్రభుత్వం తొలి బడ్జెట్ సమావేశాలు సరిగ్గా 11న మొదలయ్యాయని గుర్తు చేస్తున్నారు.  రేపటి రోజున వైసీపీ స్లోగన్ 11 అయినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు.  మొత్తానికి జగన్ నోటి వెంట వచ్చిన మాటలు మళ్లీ మళ్లీ రిపీట్ అవుతున్నాయని అంటున్నారు.  ఈ లెక్కన జగన్ కు ముందు చూపు ఎక్కవని అంటున్నారు.

Related News

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

మహిళను రోడ్డుపై వివస్త్రను చేస్తారా! గుంటూరు ఘటనపై చంద్రబాబు సీరియస్

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

Big Stories

Advertisement
×