iQOO Z11xa 5G: ఐకూ (iQOO) కంపెనీ మార్కెట్లోకి మరో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈసారి ఏకంగా 7,200mAh భారీ బ్యాటరీతో iQOO Z11xa 5G పేరుతో మార్కెట్‌ను షేక్ చేయడానికి సిద్ధమైంది. కేవలం బ్యాటరీ మాత్రమే కాదు.. పవర్‌ఫుల్ ఫీచర్లు, అదిరే డిజైన్‌తో యువతను, టెక్ ప్రియులను ఆకట్టుకునేలా ఈ ఫోన్‌ను డిజైన్ చేశారు. సామాన్యులు కూడా ఇబ్బంది లేకుండా కొనగలిగేలా ఈ ఫోన్ ధరను ఫిక్స్ చేశారు. సెప్టెంబర్ 14 నుంచి ఈ ఫోన్ అమ్మకాలకు రానుంది.
ఈ iQOO Z11xa 5G ముందుభాగంలో 6.76 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్ప్లే ఇచ్చారు. 120Hz రిఫ్రెష్ రేట్ ఉండటంతో వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్ స్క్రోలింగ్ చాలా స్మూత్‌గా సాగిపోతుంది. ఎండలో తిరిగే వాళ్ల కోసం 1,200 నిట్స్ బ్రైట్‌నెస్ ఉంది. ఇక హుడ్ కింద మీడియాటెక్ డైమెన్సిటీ 7400 టర్బో ప్రాసెసర్‌ను వాడారు. దీనికి 8GB ర్యామ్ తోడుగా ఉంది. అవసరమైతే ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ద్వారా మరో 8GB పెంచుకోవచ్చు. మొత్తానికి గేమింగ్ అయినా, డైలీ టాస్క్స్ అయినా ఫోన్ అస్సలు లాగ్ అవ్వకుండా దూసుకెళ్తుంది.
Also Read: ఎక్కువగా ప్రయాణాలు చేసేవారికి ఈ 5 గ్యాడ్జెట్స్ పక్కా ఉండాలి.. బ్యాగ్‌లో ఇట్టే పట్టేస్తాయి!
iQOO Z11xa 5Gలో అసలు హైలైట్ ఏమిటంటే.. దీని 7,200mAh బ్యాటరీ. ఒక్కసారి ఛార్జ్ చేస్తే మామూలు వాడకానికి దాదాపు రెండు రోజుల వరకు బ్యాటరీ టెన్షన్ ఉండదు. దీనికి తోడు 44W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ ఉంది కాబట్టి.. ఫోన్ త్వరగానే ఛార్జ్ అవుతుంది. రాత్రిపూట ఫోన్ ఛార్జింగ్ పెట్టి మర్చిపోయే వారి కోసం ఓవర్‌నైట్ ఛార్జింగ్ ప్రొటెక్షన్ కూడా ఇచ్చారు. గేమర్స్ కోసం బైపాస్ ఛార్జింగ్ ఫీచర్ ఉండటం విశేషం.
ఫొటోల కోసం iQOO Z11xa 5G వెనుక వైపు 50 మెగాపిక్సెల్ సోనీ కెమెరా ఇచ్చారు. సెల్ఫీల కోసం ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఈ రెండు కెమెరాలతోనూ 4K వీడియోలు తీసుకోవచ్చు. ఇక అన్నింటికంటే ముఖ్యంగా ఈ ఫోన్‌కు IP68, IP69 రేటింగ్‌లు ఉన్నాయి. అంటే నీళ్లలో పడినా, వర్షంలో తడిచినా ఫోన్‌కు ఏం కాదు. మన చేతులు తడిగా లేదా జిడ్డుగా ఉన్నా టచ్ పనిచేస్తుంది.
8GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.28,999గా ఉంది. అయితే హెచ్‌డీఎఫ్‌సీ లేదా ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులతో కొంటే రూ.1,500 తగ్గింపు వస్తుంది. దీంతో ఇది రూ.27,499కే మన సొంతం అవుతుంది. టైటాన్ బ్లాక్, ప్రిస్మాటిక్ గ్రీన్ కలర్స్‌లో లభించే ఈ iQOO Z11xa 5G ఫోన్.. సెప్టెంబర్ 14 మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్, ఐకూ అధికారిక వెబ్‌సైట్‌లో అమ్మకానికి వస్తుంది.
Also Read: మడతపెడితే క్రీజు కూడా కనిపించదు.. టెక్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న హువావే కొత్త ఫోన్!