E-Paper
Advertisement

కుప్పలు తెప్పలుగా వచ్చి పడే భారీ అనకొండలు… ప్రాణాల కోసం పరుగులు… ఊపిరి బిగపట్టించే మాన్స్టర్ థ్రిల్లర్

కుప్పలు తెప్పలుగా వచ్చి పడే భారీ అనకొండలు… ప్రాణాల కోసం పరుగులు… ఊపిరి బిగపట్టించే మాన్స్టర్ థ్రిల్లర్
Advertisement

Monster Action Thriller on OTT : ఒక దట్టమైన అడవిలోకి వెళ్లిన వాళ్లకు ఒక్కసారిగా భారీ అనకొండలు కనిపిస్తే ? ఒకటి కాదు, రెండు కాదు… గుంపులు గుంపులుగా కొండచిలువలు చుట్టుముడితే ? తప్పించుకునేందుకు ఎంత ప్రయత్నించినా అవి వెంటాడుతూనే ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది ? ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీయాల్సిన ఆ భయంకరమైన పరిస్థితులను చూపించే మాన్స్టర్ యాక్షన్ థ్రిల్లర్ ‘Anaconda 3: Offspring’. మరి ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? అనే వివరాలపై ఓ లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

కథలో ఓ ప్రమాదకరమైన ప్రయోగం కారణంగా భారీ అనకొండలు క్రియేట్ అవుతాయి. దీంతో అసలు సమస్య మొదలవుతుంది. సాధారణ పాములతో పోలిస్తే ఇవి మరింత భారీగా, ప్రమాదకరంగా ఉంటాయి. వాటి సంఖ్య పెరుగుతున్న కొద్దీ, అదుపులో పెట్టడం అసాధ్యంగా మారుతుంది. అడవిలో ఉన్న ప్రతి మనిషికి ఈ జీవులు ప్రాణాంతకమైన ముప్పుగా మారతాయి. వాటిని పట్టుకోవడానికి, ఆపడానికి ప్రయత్నించే కొద్దీ పరిస్థితులు మరింత దారుణంగా మారతాయి. ఒకవైపు భారీ పాముల దాడులు, మరోవైపు వాటి నుంచి తప్పించుకోవడానికి మార్గం లేకపోవడం… దీంతో ప్రతి అడుగు ప్రమాదకరంగా మారుతుంది.

Advertisement

ఎక్కడి నుంచి అనకొండ దాడి చేస్తుందో తెలియని పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడుకోవడమే కష్టం అవుతుంది. అసలు ఈ భారీ అనకొండల వెనుక ఉన్న ప్రయోగం ఏంటి ? వాటిని ఎందుకు సృష్టించారు ? అవి ఎందుకు అదుపు తప్పాయి ? వాటి వేట నుంచి మనుషులు ఎలా బయట పడతారు ? చివరికి ఈ భయంకరమైన జీవులను ఆపడం సాధ్యమైందా ? అనేదే సినిమాలో చూడాల్సిన ఆసక్తికరమైన అంశం. భారీ కొండచిలువల కారణంగా మొదలయ్యే భయంకరమైన వేట, వాటి నుంచి తప్పించుకోవడానికి మనుషులు చేసే పోరాటం చుట్టూ కథ సాగుతుంది.

సాధారణంగా ఒక అనకొండ కనిపిస్తేనే భయపడిపోతాం, అలాంటిది ఒకేసారి భారీ సంఖ్యలో అనకొండలు ఎదురైతే ? అడవిలో అడుగడుగునా ప్రమాదం పొంచి ఉండటంతో ప్రతి క్షణం టెన్షన్ పెరుగుతుంది. ఈ క్రమంలో మనుషులు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాలు సినిమాను సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా మారుస్తాయి. మరి ఈ అనకొండలు ఇంత భారీగా ఎలా వచ్చాయి ? వాటి లక్ష్యం ఏంటి ? వాటి నుంచి ఎవరైనా ప్రాణాలతో బయటపడగలిగారా ? అనేది తెలియాలంటే సినిమాను చూడాల్సిందే.

Advertisement

Also Read : నగరం నడిబొడ్డున రగిలిన ప్రజా విప్లవం… టాక్సీ డ్రైవర్ సాహసానికి గూస్‌బంప్స్ గ్యారెంటీ… వరల్డ్ క్లాస్ కల్ట్ హిట్

తెలుగులో స్ట్రీమింగ్ అవుతుందా ?

‘అనకొండ 3’ ఇంగ్లీష్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. భారీ మాన్స్టర్స్, అడ్వెంచర్, సర్వైవల్, ఊపిరి బిగపట్టించే ఛేజింగ్ సన్నివేశాలు ఇష్టపడేవారికి ఈ మూవీ ఒకసారి ట్రై చేయొచ్చు. ప్రస్తుతం Netflixలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ అనకొండ థ్రిల్లర్‌లో ముఖ్యంగా గుంపులు గుంపులుగా దాడి చేసే కొండచిలువల సన్నివేశాలు హారర్, మాన్స్టర్ మూవీ ఫ్యాన్స్‌కు థ్రిల్ ఇవ్వొచ్చు. కాబట్టి ‘అనకొండ’ ఫ్రాంచైజీకి ఫ్యాన్స్ అయితే ఈ మూవీని మాత్రం మిస్ అవ్వొద్దు.

Tags

Related News

ప్రేమికులపై కన్నేసిన మాస్క్‌డ్ కిల్లర్… వీడి కంట్లో పడ్డారా డైరెక్ట్ నరకానికే… భయపెడుతూనే నవ్వించే రొమాంటిక్ స్లాషర్ ఫిల్మ్

భార్యాభర్తల మధ్య రగిలిన గొడవలు… కడుపుబ్బా నవ్వించే ఫ్యామిలీ డ్రామా

కిడ్నాప్ తర్వాత గతం మర్చిపోయే అమ్మాయి… షాకింగ్ ట్విస్టులతో అదిరిపోయే రొమాంటిక్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ తెలుగులో

బహుమతుల బాక్సుల్లో నరికేసిన మనుషుల చేతులు… కళ్లు తిప్పుకోనివ్వని సైకో కిల్లర్ వేట

ఓటీటీలోకి సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. అఫీషియల్ అనౌన్స్మెంట్ వైరల్!

నగరం నడిబొడ్డున రగిలిన ప్రజా విప్లవం… టాక్సీ డ్రైవర్ సాహసానికి గూస్‌బంప్స్ గ్యారెంటీ… వరల్డ్ క్లాస్ కల్ట్ హిట్

అర్ధరాత్రి గుట్టుచప్పుడు కాకుండా జరిగిన దారుణం… నరనరాల్లో భయం పుట్టించే మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×