Vijay Devarakonda: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతున్న ఎంతోమంది సెలబ్రిటీలు ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు ఇతర వ్యాపార రంగాలలో కూడా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇలా కొంతమంది రెస్టారెంట్ క్లాత్ బిజినెస్ రంగంలో కొనసాగుతూ ఉన్నారు అలాగే మరి కొంతమంది ఇండస్ట్రీలోనే నిర్మాతలుగా మారారు అలాగే థియేటర్ల నిర్మాణంలోకి కూడా అడుగుపెడుతూ వారి సినీ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) కూడా తన సినీ సామ్రాజ్యాన్ని విస్తరింప చేసుకునే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.
ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్ బాబు, అల్లు అర్జున్, రవితేజ వంటి స్టార్ హీరోలకు మల్టీప్లెక్స్ లు ఉన్న సంగతి తెలిసింది. అయితే విజయ్ దేవరకొండ కూడా ఇప్పటికే ఏషియన్ గ్రూప్స్ తో కలిసి మహబూబ్ నగర్ లోని AVD అనే పేరుతో ఇప్పటికే ఒక మల్టీప్లెక్స్ నిర్మించిన సంగతి తెలిసిందే. అత్యాధునిక సౌకర్యాలతో ఈ మల్టీప్లెక్స్ నిర్వహిస్తున్నారు. ఇకపోతే తాజాగా మరో మల్టీప్లెక్స్ నిర్మాణానికి విజయ్ దేవరకొండ శ్రీకారం చుట్టారు. హైదరాబాద్లో ఈయన ఏషియన్ గ్రూప్స్ తో కలిసి మరొక మల్టీప్లెక్స్ థియేటర్ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది.
నార్త్ హైదరాబాద్లోని ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకొని మేడ్చల్ లేదా మల్కాజ్గిరి ప్రాంతంలో ఈ కొత్త మల్టీప్లెక్స్ నిర్మించాలని భావిస్తున్నట్టు ఇండస్ట్రీ సమాచారం. త్వరలోనే టీ మల్టీప్లెక్స్ గురించి పూర్తి వివరాలు వెల్లడి కాన్నాయి. ఇలా హీరోగా కొనసాగుతూనే విజయ్ దేవరకొండ థియేటర్ రంగంలో కూడా అడుగుపెట్టారు. అదే విధంగా ఈయన రౌడీ బ్రాండ్ పేరిట క్లోతింగ్ బిజినెస్ లోకి కూడా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇలా సినిమాలతో పాటు ఇతర వ్యాపారాలను చూసుకుంటూ విజయ్ దేవరకొండ బిజీగా ఉన్నారు.
ఇక విజయ్ దేవరకొండ సినిమాల్లో విషయానికి వస్తే ఈయన ప్రస్తుతం రౌడీ జనార్ధన్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటుగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో రణబాలి(Ranabaali) అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా దసరా పండుగను పురస్కరించుకొని అక్టోబర్ 16వ తేదీ రావడానికి సిద్ధమవుతోంది. సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేయబోతున్నట్లు చిత్ర నిర్మాతలు వెల్లడించారు. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ జోడిగా రష్మిక మందన్న(Rashmika Mandanna) నటించడం విశేషం పెళ్లి తర్వాత మొదటిసారి వీరిద్దరూ జంటగా ఈ సినిమాలో నటిస్తున్న నేపథ్యంలో సినిమా పట్ల భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా 1990 బ్రిటిష్ కాలం నాటి నేపథ్యంలో రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది.
Also Read: పోలీస్ స్టేషన్ లో యూట్యూబర్ నందన.. బిగ్ బాస్ కోసమే వచ్చి దొరికిపోయారా?