HBD Divi Vadthya: బిగ్ బాస్ బ్యూటీ దివి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా బిగ్ బాస్ రియాలిటీ షోతో ఒక్కసారిగా పాపులారిటీ అందుకున్న ఈమె ఆ తర్వాత సినిమాలు, వెబ్ సిరీస్ లు, వీడియో సాంగ్స్ తో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇక ఈ మధ్యకాలంలో నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ వలకబోస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె.. మంచి హైట్, ఆకర్షణీయమైన ఫిజిక్, గ్లామర్ ఉన్నప్పటికీ అనుకున్న స్థాయిలో అవకాశాలు మాత్రం రావడం లేదు.
తొలిసారి సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన మహర్షి సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన దివి చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా, అలాగే అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాలో మెరిసింది. ఇటీవల వచ్చిన లంబసింగి సినిమాలో కూడా నటించింది. అయినా సరే ఈమె కెరియర్ కు పెద్ద బ్రేక్ పడలేదని చెప్పాలి. ఇక ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు గ్లామర్ వలకబోస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న దివి పుట్టినరోజు ఈరోజు.. ఈ సందర్భంగా ఒక గ్రాండ్ పార్టీని నిర్వహించారు. అయితే ఈ పార్టీ ఎక్కడ జరిగిందో తెలిస్తే మాత్రం ఆశ్చర్య పోవాల్సిందే.
దివి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో టయర్ 3 హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఒక హీరో ఇంట్లో ఘనంగా జరుపుకుంది. ఆయనకి దివికి మధ్య మంచి స్నేహబంధం ఉందని.. ఈ నేపథ్యంలోనే ఆమె మిత్రుడు ఈ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరిపినట్లు సమాచారం. ఇకపోతే బంధువులు, సన్నిహితులు సమక్షంలో దివి తన పుట్టినరోజు వేడుకలను చాలా ఘనంగా జరుపుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు, నెటిజన్స్ దివికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ALSO READ:నేడే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఎన్నికలు!
దివి కెరియర్ విషయానికి వస్తే.. పదవ తరగతి వరకు జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో చదివిన ఈమె జి నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఎంబీఏ పూర్తి చేసింది. 2018లో లెట్స్ గో అనే షార్ట్ ఫిలిమ్ ద్వారా కెరియర్ను ప్రారంభించిన దివి.. 2019లో వచ్చిన మహర్షి సినిమా ద్వారా సినిమా రంగంలోకి అడుగు పెట్టింది. 2019లో ఏ వన్ ఎక్స్ప్రెస్, 2021 లో క్యాబ్ స్టోరీస్ చిత్రాల లో నటించిన దివి.. సిలక ముక్కు దానా అనే మ్యూజిక్ వీడియోతో ఊహించని పాపులారిటీని అందించింది. అంతే కాదు 2020లో సెప్టెంబర్ 6న ప్రారంభమైన బిగ్బాస్ తెలుగు సీజన్ ఫోర్ లో పాల్గొని 49 రోజులపాటు హౌస్ లో ఉండి బయటకు వచ్చింది దివి. ఇక ప్రస్తుతం క్యాస్ట్ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. కనీసం ఈ సినిమా నైనా ఈమెకు మంచి గుర్తింపును అందిస్తుందేమో చూడాలి.