E-Paper
Advertisement

కరెంట్ లేకపోయినా పర్లేదు..ఐరన్ లేకుండానే మీ డ్రెస్ ముడతలు మాయం!

కరెంట్ లేకపోయినా పర్లేదు..ఐరన్ లేకుండానే మీ డ్రెస్ ముడతలు మాయం!
Advertisement

Ironing hacks for clothes: మనం ఎక్కడికైనా వెళ్లేటప్పుడు వేసుకోవాల్సిన డ్రెస్ ముడతలు పడి ఉంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. తీరా ఇస్త్రీ చేద్దామంటే కొన్ని సార్లు టైమ్ ఉండదు. లేదా ఒక్కోసారి కరెంట్ ఉండదు. మరి ఇలాంటి సమయంలో ఐరన్ బాక్స్ లేకుండానే బట్టలను నీట్‌గా మార్చుకోవడం ఎలా? దీని కోసం కొన్ని అద్భుతమైన చిట్కాలు ఉన్నాయి. సాధారణంగా ఇంట్లో ఉండే వస్తువులతోనే బట్టల ముడతలను సులువుగా తొలగించవచ్చు. ఆ స్మార్ట్ ట్రిక్స్ ఏంటో, వాటిని ఎలా ఉపయోగించాలో వివరంగా తెలుసుకుందాం.

ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడటం సహజం. ముఖ్యంగా ఆఫీసుకో లేదా ఫంక్షన్‌కో వెళ్లాల్సి వచ్చినప్పుడు మనకి ఇష్టమైన డ్రెస్ నిండా ముడతలు ఉంటే మూడ్ మొత్తం పాడైపోతుంది. అయితే.. ఐరన్ బాక్స్ మాత్రమే ముడతలు తొలగిస్తుందనుకోవడం పొరపాటే! సైన్స్ , కామన్ సెన్స్ ఉపయోగిస్తే నిమిషాల్లో ముడతలను మాయం చేయవచ్చు. అదెలాగో చూద్దాం.

ఐరన్ లేకుండానే బట్టల ముడతలు పోగొట్టే టిప్స్: 

Advertisement

1. హెయిర్ డ్రైయర్ మ్యాజిక్:
చాలామంది ఇళ్లలో హెయిర్ డ్రైయర్ ఉంటుంది. ముడతలు పడిన బట్టలపై కొంచెం నీళ్లు చల్లి (తేమగా ఉండేలా).. ఆ తర్వాత హెయిర్ డ్రైయర్‌ను వేడి గాలి (సెట్టింగ్‌లో ఉంచి ముడతలు ఉన్న చోట ఊదండి. క్లాత్ కు డ్రైయర్‌కు మధ్య కనీసం 2 అంగుళాల దూరం ఉండేలా చూసుకోండి. వేడి గాలి తగలగానే బట్ట సాగి, ముడతలు మాయమవుతాయి.

2. వేడి నీటి ఆవిరి:
మీరు స్నానం చేయడానికి వేడి నీటిని ఉపయోగిస్తుంటే.. ఈ ట్రిక్ బాగా పని చేస్తుంది. బాత్రూమ్‌లో వేడి నీళ్ల వల్ల వచ్చే ఆవిరి ముడతలను వదులు చేస్తుంది. ముడతలు పడిన బట్టను హ్యాంగర్‌కు తగిలించి, షవర్ పక్కన లేదా ఆవిరి తగిలే చోట ఉంచండి. కిటికీలు.. తలుపులు మూసేయండి. 10-15 నిమిషాల తర్వాత చూస్తే ఆవిరి వల్ల ముడతలు తగ్గి డ్రెస్ స్మూత్‌గా మారుతుంది.

Advertisement

3. ఐస్ క్యూబ్స్, డ్రైయర్ :
మీ ఇంట్లో బట్టలు ఆరవేసే ‘డ్రైయర్’ మెషిన్ ఉంటే.. ముడతలు పడిన బట్టతో పాటు రెండు మూడు ఐస్ ముక్కలను లోపల వేయండి. ఒక 5 నిమిషాల పాటు హై హీట్‌లో రన్ చేయండి. ఐస్ ముక్కలు కరిగి ఆవిరిగా మారి బట్టల ముడతలను తొలగిస్తాయి. ఇది విదేశాల్లో బాగా పాపులర్ అయిన ట్రిక్.

4. వేడి పాత్రతో ఇస్త్రీ :
పూర్వం ఇస్త్రీ పెట్టెలు లేనప్పుడు ఈ పద్ధతినే వాడేవారు. ఒక స్టీల్ గిన్నెలో నీళ్లు పోసి బాగా మరిగించండి. నీళ్లు పారబోసి, ఆ వేడి గిన్నె అడుగు భాగాన్ని ఐరన్ బాక్స్‌లా ఉపయోగించి బట్టల మీద రుద్దండి. ఇది అచ్చం ఐరన్ చేసినట్టే పనిచేస్తుంది. అయితే గిన్నె అడుగు భాగం శుభ్రంగా ఉండేలా చూసుకోండి.

Also Read: ఫ్రిజ్‌లో స్పూన్ పెడితే.. ఆహారం ఎన్ని రోజులైనా పాడవ్వదు తెలుసా ?

5. ఫ్లాట్ ఐరన్:
కాలర్లు, స్లీవ్స్ లేదా బటన్ల దగ్గర ఉండే చిన్న చిన్న ముడతలను పోగొట్టడానికి హెయిర్ స్ట్రెయిటెనర్ అద్భుతంగా పని చేస్తుంది. ఇది ముఖ్యంగా కాటన్ బట్టలకు చాలా వేగంగా రిజల్ట్ ఇస్తుంది. అయితే సిల్క్ వంటి సున్నితమైన బట్టల మీద వాడేటప్పుడు తక్కువ వేడి ఉండేలా జాగ్రత్త పడాలి.

6. రింకిల్ రిలీజ్ స్ప్రే :
ఒక స్ప్రే బాటిల్‌లో నీళ్లు తీసుకుని, అందులో కొంచెం వెనిగర్ లేదా ఫ్యాబ్రిక్ సాఫ్ట్‌నర్ కలపండి. ముడతలు ఉన్న చోట ఈ మిశ్రమాన్ని లైట్‌గా స్ప్రే చేసి, చేతులతో బట్టను గట్టిగా లాగి ఆరబెట్టండి. ఆరిన తర్వాత ముడతలు కనిపించవు.

బట్టలు ముడతలు పడ్డాయని కంగారు పడాల్సిన అవసరం లేదు. పైన చెప్పిన చిట్కాలు మీ సమయాన్ని ఆదా చేయడమే కాకుండా.. కరెంట్ లేని సమయంలో చాలా ఉపయోగపడతాయి. ట్రావెలింగ్‌లో ఉన్నప్పుడు ఈ హ్యాక్స్ మీకు ఎంతగానో సహకరిస్తాయి. ఇంకెందుకు ఆలస్యం, నెక్స్ట్ టైమ్ ఐరన్ లేనప్పుడు ఈ స్మార్ట్ ట్రిక్స్ ట్రై చేసి చూడండి!

Also Read: ఎండాకాలంలో పాలు తరచుగా విరిగిపోతున్నాయా ? అయితే ఈ టిప్స్ మీ కోసమే

Related News

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

ఐలైనర్ సరిగ్గా రావడం లేదా? పర్ఫెక్ట్ లుక్ కోసం ఈజీ మేకప్ ట్రిక్స్‌ ఇవిగో

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

భోజనం చేసినా, ఏదైనా తాగినా వెంటనే లిప్‌స్టిక్ పాడవుతోందా? రోజంతా పెదాలు కలర్‌ఫుల్‌గా ఉండేందుకు చిట్కాలు

ప్రతిరోజూ హెల్మెట్ ధరిస్తే జుట్టు డ్యామేజ్.. ఈ సులభమైన హెయిర్ కేర్ చిట్కాలు మీ కోసం

పాము, ముంగీస లాంటి స్వభావం వీరిది.. ఈ తేదీల్లో పుట్టినవారు పెళ్లి తరువాత గొడవపడుతూనే ఉంటారు

మద్యం లేదా సిగరెట్.. ఆరోగ్యానికి ఏది ఎక్కువ ప్రమాదకరం.. ఏది ముందుగా మానేయాలి?

ఉద్యోగం చేసే భార్యభర్తల మధ్య ఒత్తిడి, గొడవలు.. దాంపత్య జీవితం కాపాడుకోవడానికి ఇలా చేయడం తప్పనిసరి

Big Stories

Advertisement
×