E-Paper
Advertisement

Actress Divi: ఫస్ట్ లుక్ ఓకే.. ఈసారైనా సక్సెస్ అవుతుందా?

Actress Divi: ఫస్ట్ లుక్ ఓకే.. ఈసారైనా సక్సెస్ అవుతుందా?
Advertisement

Actress Divi:ప్రముఖ నటి దివి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. మోడల్ గా తన కెరీర్ మొదలుపెట్టిన ఈమె.. ఆ తర్వాత పలు ఫ్యాషన్ సంస్థలకు మోడలింగ్ కూడా చేసి అందరి దృష్టిని ఆకట్టుకుంది. అలా తన అందంతో మంచి ఫిజిక్ తో దర్శక నిర్మాతల కంట్లో పడిన ఈమె తొలిసారి లెట్స్ గో అనే షార్ట్ ఫిలిమ్ చేసి మెప్పించింది. మహర్షి సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన దివి ఏ వన్ ఎక్స్ప్రెస్, క్యాబ్ స్టోరీస్, పుష్ప 2, రుద్రంగి, లంబసింగి , సింబ, డాకు మహారాజ్ ఇలా పలు చిత్రాలలో కీలకపాత్రలు పోషించిన ఈమె.. తాజాగా క్యాస్ట్ అనే మూవీలో నటిస్తోంది. ఇకపోతే నిన్న దివి పుట్టినరోజు కావడంతో ఈ సందర్భంగా క్యాస్ట్ మూవీ ఈమెకు స్పెషల్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సినిమా నుండి ఈమె పాత్రను రివీ ల్ చేయడమే కాకుండా ఆ పాత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ని కూడా అభిమానులతో ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఇక పోస్టర్ చూసిన అభిమానులు ఫస్ట్లుక్ ఓకే మరి ఈసారైనా సక్సెస్ లభిస్తుందా అనే కామెంట్లు చేస్తున్నారు..

వణుకు పుట్టిస్తున్న దివి ఫస్ట్ లుక్ పోస్టర్..

ఇందులో దివి గుర్తుపట్టలేనంతగా మారిపోయింది . కుల వ్యవస్థ.. సమాజంలో కులం పేరుతో జరుగుతున్న దారుణాలను కళ్ళకు కట్టే విధంగా రూపొందుతున్న చిత్రమే క్యాస్ట్. ఇందులో ఓ హీరోయిన్గా నటిస్తోంది దివి. ఈమె బర్త్డే స్పెషల్ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో నుదిటిన పెద్ద బొట్టు.. మెడలో పులి గోర్లతో.. జుట్టు విరబోసుకుని భయంకరమైన రౌద్రం.. రూపం భయపెట్టేలా అనిపిస్తోంది. టాలెంటెడ్ నటి దివి ఇందులో ధూమవతి అనే క్యారెక్టర్ లో నటిస్తున్నట్లు అధికారికంగా అనౌన్స్ చేశారు. మేకర్స్ ఈ పోస్టర్ను రిలీజ్ చేస్తూ..” టాలెంటెడ్ నటి దివికి క్యాస్ట్ మూవీ టీం తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు. క్యాస్ట్ మూవీలో ధూమవతిగా భయంకరమైన అవతారాన్ని చూసేందుకు మీరు కూడా సిద్ధం అయిపోండి. ఈ లుక్ చాలా కాలం గుర్తుండిపోతుంది” అంటూ మేకర్స్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు . మొత్తానికైతే దివి కి ఒక పవర్ఫుల్ పాత్ర దొరికింది మరి ఇందులో తన నటన విశ్వరూపాన్ని చూపించాలని అభిమానులు కోరుతున్నారు.

Advertisement

ALSO READ:HBD Divi Vadthya: దివి బర్తడే సెలబ్రేషన్స్ ఎవరి ఇంట్లో తెలుసా?

ఈ సినిమాతో నైనా బ్రేక్ పడుతుందా?

ఇకపోతే కులం ఆధారంగా వస్తున్న ఈ సినిమాలో ఏకంగా నలుగురు హీరోలుగా నటిస్తున్నారు. సత్యం రాజేష్, వరుణ్ సందేశ్ ,యాంకర్ రవి, గగన్ లీడ్ రోల్స్ చేస్తుండగా.. ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ వీడియోని కూడా ఇటీవల విడుదల చేశారు. ఇది కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది . ముఖ్యంగా ఇందులో ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అనే కులాలను ప్రధమంగా చూపించారు. ఏకే జంపన్న దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మెగా బ్రదర్ నాగబాబు కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా నాగబాబు ఈ సినిమాలో రంగరాజన్ అనే పాత్ర పోషిస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. గోల్డెన్ ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. త్వరలోనే రిలీజ్ డేట్ ని కూడా మేకర్స్ అనౌన్స్ చేయనున్నారు. మరి ఈ సినిమాతో నైనా దివికి మంచి గుర్తింపు రావాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Advertisement

Related News

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×