Actress disorder: బాలీవుడ్ లో యంగ్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకుంది ఫాతిమా సనా షేక్ (Fathima Sana Shaikh). ఇప్పుడు తమన్నా (Tamannaah) మాజీ బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ (Vijay Varma) కొత్త రూమర్డ్ లవర్ గా కూడా పేరు సొంతం చేసుకుంది. మరోవైపు కాంట్రవర్సీ బ్యూటీగా కూడా వార్తల్లో నిలుస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్న ఈ ‘దంగల్’ బ్యూటీ అతి దారుణమైన వ్యాధితో బాధపడుతోందని, బ్రతకడం కష్టమే అంటూ ఒక వార్త సంచలనం సృష్టిస్తోంది. ఈ విషయం తెలిసి, అటు అభిమానులు ఇటు ఇండస్ట్రీ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. మరి అసలు ఏం జరిగింది? ఈ విషయంపై ఫాతిమా ఏదైనా స్పందించిందా? అసలు ఈ వార్తలు రావడానికి కారణం ఏంటి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
దారుణమైన వ్యాధితో బాధపడుతున్న విజయ్ వర్మ కొత్త లవర్
ఫాతిమా సనా షేక్ దారుణమైన వ్యాధితో బాధపడుతోంది అంటూ వార్తలు రావడానికి కారణం ఈమె అని తెలుస్తోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె.. తాను బాధపడుతున్న వ్యాధి గురించి బహిరంగంగా చెప్పుకొచ్చింది. అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా హీరో మాధవన్ (Madhavan ) తో కలిసి ‘ఆప్ జైసా కోయీ’ అనే ఓటీటీ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా నెట్ఫ్లిక్స్ వేదికగా జూలై 11వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది.ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె.. తనకున్న వ్యాధి గురించి బయట పెట్టింది. ఫాతిమా సనా షేక్ మాట్లాడుతూ.. మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను.
వ్యాధిపై ఓపెన్ అయిన ఫాతిమా సనా షేక్..
“నాకు చాలా కాలం నుండి మూర్ఛరోగం ఉంది. ఒకసారి అమెరికా వెళ్తున్నప్పుడు విమానంలో ఉండగా ఈ మూర్ఛవ్యాధి రావడంతో ఎయిర్పోర్ట్ సిబ్బంది హాస్పిటల్ కి తీసుకెళ్లి చికిత్స అందించారు. అయినా తగ్గకపోవడంతో మెడిసిన్ ఎక్కువ డోస్ ఇచ్చారు. దాని వల్ల నాకు ఏమవుతుందో తెలియని దారుణమైన పరిస్థితికి చేరిపోయాను. ఆ క్షణం బ్రతకడం కష్టమే అనిపించింది. కానీ వైద్యులు నాకు ధైర్యం చెప్పి భయపడాల్సిన అవసరం లేదు.. కాస్త బెడ్ రెస్ట్ తీసుకుంటే ప్రస్తుతం నయమవుతుంది. వ్యాధి తగ్గించుకోవడానికి మెడిసిన్ వాడాల్సి ఉంటుందని చెప్పారు. అందుకే బెడ్ రెస్ట్ కూడా తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.” అంటూ తెలిపింది.
అందరికీ చెప్పాలని అప్పుడే డిసైడ్ అయ్యా – ఫాతిమా
ఇక ఈ సమయంలో రెండు సినిమాలు చేయాల్సి ఉండగా షూటింగ్ కూడా క్యాన్సిల్ చేశాను. అయితే చిత్రబృందం నన్ను పిలవడంతో బాధ తట్టుకోలేక అప్పుడు నాకున్న వ్యాధి గురించి అందరికీ చెప్పాలని డిసైడ్ అయ్యి చెప్పేశాను అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
అనవసరంగా ఇరుక్కుపోయిన విజయ్ వర్మ..
అయితే ఈ విషయం తెలిసి విజయ్ వర్మ అనవసరంగా కమిట్ అయిపోయాను. ఇక ఈమెతో నాకు సెట్ కాదు అని, మరొక తోడు వెతుక్కోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి అయితే ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ALSO READ:Manchu Manoj : కన్నప్ప టీంకి విష్ చేసిన మనోజ్… అన్న పేరు ఎత్తకుండానే!