Manchu Vishnu : సినిమా ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్(Pawan Kalyan) చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ విపరీతమైన ఫాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.. ఇలా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకోవడంతోనే ఈయన రాజకీయాలలో (Politics)కి వచ్చి కూడా ఇక్కడ తన స్టామినా ఏంటో నిరూపించుకున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఇకపోతే సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక నటుడు రాజకీయాలలో ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్న నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎంతోమంది సెలబ్రిటీలు పవన్ కళ్యాణ్ కు పూర్తిస్థాయిలో వారి మద్దతు తెలియజేయడమే కాకుండా పవన్ కళ్యాణ్ మంచి విజయం అందుకోవడంతో శుభాకాంక్షలు కూడా తెలియజేశారు.
పవన్ విషయంలో విష్ణు మౌనం..
ఇకపోతే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయినప్పటికీ కూడా ఆయనకు విష్ చేయని కొంతమంది సెలబ్రిటీలు ఉన్నారు. అలాంటి వారిలో మంచు విష్ణు(Manchu Vishnu) కూడా ఒకరు. పవన్ కళ్యాణ్ గెలిచినప్పుడు కానీ ఆయన ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు కానీ మంచు విష్ణు కనీసం సోషల్ మీడియా వేదికగా కూడా విష్ చేయలేదు. ఈయన మా ప్రెసిడెంట్గా ఎంతో కీలకమైన బాధ్యతలు తీసుకున్నారు, అయినప్పటికీ కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయాల గురించి ఒక్కసారి కూడా అధికారికంగా పవన్ కళ్యాణ్ ని కలిసిన సందర్భాలు కూడా లేవు.
పవన్ కళ్యాణ్ తో సమస్యలా…
ఇలా మా ప్రెసిడెంట్ గా ,సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి కోసం, సినిమా సమస్యలను ప్రభుత్వానికి చేరవేయటంలో మంచు విష్ణు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? పవన్ కళ్యాణ్ తో ఈయనకు ఏదైనా విభేదాలు ఉన్నాయా? అందుకే ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ను కలవలేదా? అనే సందేహాలు ప్రతి ఒక్కరికి కలిగాయి. అయితే కన్నప్ప(Kannappa) సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూకి హాజరైన విష్ణుకి ఇదే ప్రశ్న ఎదురయింది. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా సినిమా ఇండస్ట్రీని అభివృద్ధి చేస్తామని చెప్పారు కదా దానిపై మీ అభిప్రాయం ఏంటని ప్రశ్నించారు.
బిజీ షెడ్యూల్..
సినిమా ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్లో కూడా అభివృద్ధి చేయాలనుకోవడం చాలా గొప్ప నిర్ణయం. అయితే అభివృద్ధి అనేది ఒక రాత్రికి రాత్రిలోనే జరిగిపోదని, ఇప్పుడు హైదరాబాదులో గత 40 సంవత్సరాల నుంచి కష్టపడుతుంటే ఫిలిం ఇండస్ట్రీ డెవలప్ అయ్యింది, ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పటినుంచి అభివృద్ధి చేస్తే మరో 30 సంవత్సరాలకు డెవలప్ అవుతుందని తెలిపారు. అయితే పవన్ కళ్యాణ్ ను డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇప్పటివరకు కలవక పోవడానికి కారణం ఏంటనే ప్రశ్న కూడా ఎదురైంది. పవన్ కళ్యాణ్ గారిని తాను ఎన్నో సందర్భాలలో కలవాలి అనుకున్నాను. నేను అపాయింట్మెంట్ అడిగినప్పుడు అతను బిజీగా ఉంటున్నారు, అతను ఫ్రీగా ఉన్న సమయంలో నేను బిజీగా ఉంటున్నానని అందుకే కలవలేకపోయానని కారణం చెప్పారు. ఇలా బిజీ షెడ్యూల్ కారణంగానే పవన్ కళ్యాణ్ ను కలవలేదని, మా మధ్య ఎలాంటి విభేదాలు లేవని విష్ణు క్లారిటీ ఇచ్చారు.
Also Read: హైపర్ ఆది పై బాడీ షేమింగ్… ఇలా రివేంజ్ తీర్చుకున్న యాంకర్?