BigTV English

Manchu Manoj : కన్నప్ప టీంకి విష్ చేసిన మనోజ్… అన్న పేరు ఎత్తకుండానే

Manchu Manoj : కన్నప్ప టీంకి విష్ చేసిన మనోజ్… అన్న పేరు ఎత్తకుండానే

Manchu Manoj :మంచు విష్ణు (Manchu Vishnu) అత్యంత ప్రతిష్టాత్మకంగా.. భారీ అంజనాల మధ్య పాన్ ఇండియా మూవీగా విడుదల చేస్తున్న చిత్రం కన్నప్ప (Kannappa). జూన్ 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతున్న ఈ సినిమా యూనిట్ కి కొంతమంది ఇప్పటికే ఎక్స్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మంచు మనోజ్ కూడా.. కన్నప్ప టీం కి శుభాకాంక్షలు చెబుతూ చేసిన పోస్ట్ సంచలనంగా మారింది.


‘కన్నప్ప’ బ్లాక్ బస్టర్ హిట్ కావాలి – మంచు మనోజ్..

మంచు మనోజ్ తన ఎక్స్ అధికారిక ఖాతా ద్వారా.. “కన్నప్ప సినిమా యూనిట్ కి ఆల్ ది బెస్ట్. ఈ సినిమా కోసం నాన్న, ఆయన టీం ఎన్నో సంవత్సరాలుగా.. ఎంతో శ్రమను, ప్రేమను పెట్టి పూర్తి చేశారు. ఇది బ్లాక్ బస్టర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. మా లిటిల్ ఛాంప్స్ అరి, వివి, అవ్రామ్ ల అద్భుతమైన జ్ఞాపకాలను ఇప్పుడు బిగ్ స్క్రీన్ పై చూడాలని ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను. ఇక తనికెళ్ల భరణి జీవితకాల కల జీవం పోసుకొని, శుక్రవారం విడుదల కాబోతుండడం మరింత సంతోషంగా ఉంది.


వారి ప్రేమ వెలకట్టలేనిది – మంచు మనోజ్

మంచి మనసున్న ప్రభాస్ (Prabhas), లెజెండ్రీ నటులు మోహన్ లాల్ (Mohan Lal), అక్షయ్ కుమార్(Akshay Kumar), ప్రభుదేవా(Prabhu Deva)ఇలా ప్రతి ఒక్కరికి కూడా పేరుపేరునా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వీళ్లంతా ఈ సినిమా కోసం చేసిన సహాయం, చూపించిన ప్రేమ, నమ్మకం వెలకట్టలేనివి. ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఈ ప్రయాణానికి ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అంటూ మంచు మనోజ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అన్న పేరు ఎత్తకుండానే మంచు మనోజ్ పోస్ట్..

ఇకపోతే మంచు మనోజ్ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు కానీ ఇక్కడ తన అన్న మంచు విష్ణు (Manchu Vishnu) పేరు ఎక్కడ ప్రస్తావించకపోవడంతో గొడవలు ఇంకా చల్లారలేదని నెటిజన్స్ నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా తన తండ్రి మోహన్ బాబుకు దగ్గర అవడం కోసం అలాగే ఇతర సెలబ్రిటీల కోసం ఈ సినిమాను డిజాస్టర్ అవ్వాలని కోరుకోవట్లేదు అంటూ గతంలో చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇలా తన అన్న పేరు ప్రస్తావించకుండా మిగతా అందరి పేర్లు ప్రస్తావిస్తూ సినిమాకి, సినిమా బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక మంచు మనోజ్ షేర్ చేసిన ఈ పోస్ట్ పై ఇప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

also read:Film industry: ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత!

Related News

Kayadu Lohar: కరూర్ తొక్కిసలాట ఘటనలో కయాదు ఫ్రెండ్ మృతి.. ఒక పోస్టుతో క్లారిటీ ఇచ్చిన హీరోయిన్.

OG Piracy: ఓజీని పైరసీ చేసిన ముఠా అరెస్ట్… హార్డ్ డిస్క్‌లన్నీ స్వాధీనం

Samantha: నిజమైన ప్రేమ కోసం సమంత తాపత్రయం.. అంతా అయిపోయిందంటూ!

OG collections: భారీగా పడిపోయిన ఓజీ కలెక్షన్స్… ఆ ఒక్క మిస్టేక్ వల్లే?

Tollywood: హమ్మయ్య టాలీవుడ్ కి మంచి రోజులు.. త్వరలో కమిటీ నియామకం!

Film Industry: ఇండస్ట్రీలో విషాదం…ఎన్టీఆర్ విలన్ భార్య కన్నుమూత!

The Raja saab : ప్రభాస్ ఫ్యాన్స్ కి క్రేజీ అప్డేట్, ఒక్క ట్వీట్ తో రచ్చ లేపిన మారుతి

Kantara Chapter1 pre release: ఎన్టీఆర్ నాకు హీరో కాదు… బ్రదర్ రిషబ్ ఇంట్రెస్టింగ్ స్పీచ్!

Big Stories

×