Actress Hari Teja: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం ఐకాన్ స్టార్ గా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇలాంటి స్టార్ డం ఉన్న హీరో సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించినా, పాన్ ఇండియా స్థాయిలో ఆదరణ లభిస్తుందని సెలబ్రిటీలు భావిస్తూ ఉంటారు అతని సినిమాలో చిన్న అవకాశం వచ్చినా వదులుకోవడానికి ఇష్టపడరు. అలాగే ఆ సినిమా కోసం ఎన్ని నియమాలు పాటించాలన్న తప్పనిసరిగా పాటిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే నటి హరితేజ (Hariteja)అల్లు అర్జున్(Allu Arjun) సినిమా కోసం ఏకంగా 15 రోజులపాటు భోజనం కూడా తినకుండా ఉన్నారని తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న హరితేజ ఈ విషయం గురించి మాట్లాడుతూ. దువ్వాడ జగన్నాథం సినిమా(DJ Film)లో అవకాశం వచ్చినప్పుడు నా సంతోషానికి అవధులు లేకుండా పోయాయని తెలిపారు. అయితే అల్లు అర్జున్ గారి సినిమాలో ఛాన్స్ అంటే ఆయన పక్కన స్లిమ్ గా కనిపించాలని నిర్ణయం తీసుకున్నాను అందుకే 15 రోజులపాటు ఫుడ్ తినకుండా కేవలం లిక్విడ్ డైట్ తీసుకుంటూ చాలా స్లిమ్ గా అయ్యానని తెలిపారు. ఇలా షూటింగ్ రేపనగా ముందు రోజు రాత్రి నిద్ర పట్టలేదని మొదటి రోజు షూటింగ్ లొకేషన్లోకి అడుగుపెట్టగానే బన్నీ నేరుగా నా వద్దకు వచ్చారని తెలిపారు.
నన్ను చూడగానే బన్నీ బిగ్ బాస్ లో నీ పర్ఫామెన్స్ చూశాను నాకు చాలా బాగా నచ్చింది అంటూ ఆయన నన్ను గుర్తు పెట్టుకొని మరి నా దగ్గరకు వచ్చి చెప్పడంతో నేను ఈ భూమి మీద నిలబడలేదని ఆకాశంలో విహరించాను అంటూ అల్లు అర్జున్ గురించి హరితేజ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో అప్పటికే క్రేజీ హీరోగా సక్సెస్ అందుకున్న బన్నీ ఇలా ఒక యాక్టర్ గురించి గొప్పగా చెప్పడం అంటే మామూలు విషయం కాదు. ఇక అల్లు అర్జున్ ప్రతి ఈవెంట్ లో కూడా యాంకర్ గురించి గొప్పగా మాట్లాడుతూ వారిపై కూడా ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు.
బిగ్ బాస్ కంటెస్టెంట్ గా హరితేజ గుర్తింపు..
ఇలా ఇతరుల పనితీరును మెచ్చుకోవడంలో బన్నీ ముందుంటారనే చెప్పాలి. ప్రస్తుతం హరితేజ పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు మరోవైపు బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేస్తున్నారు. ఇక ఈమె బిగ్ బాస్ సీజన్ వన్ కంటెస్టెంట్ గా వెళ్లిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ తర్వాత హరితేజ స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.
Also Read: SambaralaYeti Gattu: సంబరాల ఏటిగట్టు ఒక్క ఎపిసోడ్ కోసంరూ. 20 కోట్లు.. రిస్క్ చేస్తున్న నిర్మాతలు?