E-Paper
Advertisement

Holi 2026 Date: హోలీ 2026: మార్చి 3నా లేక 4నా? అసలు తేదీ, ముహూర్తం వివరాలు!

Holi 2026 Date: హోలీ 2026: మార్చి 3నా లేక 4నా? అసలు తేదీ, ముహూర్తం వివరాలు!
Advertisement

Holi 2026 Date: మన దేశంలో రంగుల పండుగ హోలీకి ప్రత్యేక స్థానం ఉంది. వసంత రుతువు రాకను చాటిచెప్పే ఈ పండగను దేశవ్యాప్తంగా అంబరాన్నంటేలా జరుపుకుంటారు. అయితే.. 2026 సంవత్సరానికి సంబంధించి హోలీ మార్చి 3న జరుపుకోవాలా లేక మార్చి 4న జరుపుకోవాలా అనే విషయంలో సామాన్యులతో పాటు పండితులలో కూడా చర్చ నడుస్తోంది. దీనికి ప్రధాన కారణం ఆ రోజున సంభవించబోయే చంద్రగ్రహణం.

హిందూ క్యాలెండర్ ప్రకారం.. ఫాల్గుణ మాసంలోని పౌర్ణమి తిథి నాడు హోలీని జరుపుకుంటారు. ఈ ఏడాది పౌర్ణమి తిథి మార్చి 3వ తేదీ మధ్యాహ్నం ప్రారంభమై మార్చి 4వ తేదీ వరకు కొనసాగుతుంది. అదే సమయంలో చంద్రగ్రహణం కూడా ఏర్పడుతుండటంతో.. సూతక కాలం (గ్రహణ నియమాలు) పండగ జరుపుకునే సమయాన్ని ప్రభావితం చేస్తోంది. ఫలితంగా.. కొన్ని ప్రాంతాల వారు మార్చి 3న హోలికా దహనం నిర్వహించి.. 4న రంగుల పండగ జరుపుకోవాలని భావిస్తుంటే.. మరి కొందరు తిథి ముగింపును బట్టి మార్చి 3నే ప్రధాన పండగగా పరిగణిస్తున్నారు.

Advertisement

హోలీ.. గ్రహణ ప్రభావం:
హోలీ పండగ ప్రధానంగా రెండు భాగాలుగా ఉంటుంది. ఒకటి హోలికా దహనం, రెండవది ధూళివందనం (రంగులతో ఆడుకునే రోజు).

చంద్రగ్రహణం, దాని ప్రభావం:
మార్చి 3న సంభవించే చంద్రగ్రహణం మన దేశంలోని చాలా ప్రాంతాల్లో కనిపిస్తుంది. శాస్త్రాల ప్రకారం.. గ్రహణ సమయానికి కొన్ని గంటల ముందు నుంచే ‘సూతక కాలం’ ప్రారంభమవుతుంది. ఈ సమయంలో పూజలు చేయడం లేదా శుభకార్యాలు నిర్వహించడం నిషిద్ధం.

Advertisement

పౌర్ణమి తిథి ఈ రోజున ప్రబలంగా ఉంటుంది. చాలా చోట్ల ప్రదోష కాలంలో హోలికా దహనం ఈ రోజే నిర్వహించాలని నిర్ణయించారు.

మార్చి 4: ఉదయ తిథి ప్రకారం.. రంగుల హోలీని మార్చి 4న జరుపుకోవడం శాస్త్ర సమ్మతమని చాలా మంది పంచాంగ కర్తలు సూచిస్తున్నారు.

Also Read: ఇంట్లో డబ్బు నిలవాలంటే.. ఈ వాస్తు మార్పులు తప్పనిసరి

ప్రాంతాల వారీగా భిన్నత్వాలు:
సూర్యోదయ సమయాలు, స్థానిక సంప్రదాయాలను బట్టి పండగ తేదీలలో మార్పులు కనిపిస్తాయి.

ఉత్తర భారతదేశం: ఇక్కడ ‘పుష్యా నక్షత్రం’, పౌర్ణమి కలయికను బట్టి మార్చి 4ను ప్రధాన పండుగగా చూస్తున్నారు.

దక్షిణ భారతదేశం: తెలుగు రాష్ట్రాల్లో చంద్రగ్రహణ నియమాలను పాటిస్తూ.. గ్రహణ మోక్షం (ముగింపు) తర్వాతే పండగ వేడుకలను జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు.

హోలికా దహనం-మార్చి 3 సాయంత్రం ప్రదోష కాలంలో జరుపుకోవాలి.
ధూళివందనం (హోలీ)-మార్చి 4 ఉదయం నుంచి హోలీ జరుపుకోవాలి.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×