E-Paper
Advertisement

Prabhas: హీరోయిన్ కు ఊహించని షాక్.. నీ మర్యాద చల్లగుండా.. మరీ ఇంత పిచ్చేంటి..?

Prabhas: హీరోయిన్ కు ఊహించని షాక్.. నీ మర్యాద చల్లగుండా.. మరీ ఇంత పిచ్చేంటి..?
Advertisement

Prabhas: టాలీవుడ్ స్టార్ పాన్ఇండియా హీరో ప్రభాస్ భోజన ప్రియుడు అన్న విషయం తెలిసిందే.. ఆయన ఎప్పుడూ తన ఇంటి భోజనాన్ని మాత్రమే ఇష్టపడుతూ ఉంటాడు. ఆయన తినడం మాత్రమే కాదు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా ఇంటి భోజనాన్ని రుచి చూపిస్తాడు. ఎక్కడ షూటింగ్‌ ఉన్నా సరే ఇంటి నుంచి తెప్పించి మరీ తోటి నటీనటులకు, చిత్రయూనిట్‌కు భోజనం తినిపిస్తాడు. ప్రభాస్ భోజనానికి చాలామంది ఫిదా అవుతుంటారు.. డార్లింగ్ భోజనానికి ఆ సినిమాలలో పనిచేసే హీరోయిన్లు ఫిదా అయిపోతుంటారు. ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లు ప్రభాస్ భోజనం గురించి పలు ఇంటర్వ్యూలలో బయటపెట్టారు.. తాజాగా మరో హీరోయిన్ ప్రభాస్ ఇంటి భోజనం గురించి తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో షేర్ చేసింది. ప్రస్తుతం ఇది మరోసారి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

ప్రభాస్ ఫుడ్ కు ఫౌజీ హీరోయిన్ ఫిదా..

రెబల్ స్టార్ ప్రభాస్ మంచి మనసు గురించి ఎంత చెప్పిన తక్కువే.. ఆయన సినిమాలలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన దగ్గరుండి తన ఇంటి భోజనాన్ని అందిస్తూ ఉంటాడు.. ముఖ్యంగా హీరోయిన్లు అయితే ప్రభాస్ భోజనానికి ఫిదా అయిపోతుంటారు.. తాజాగా ప్రభాస్ నటించిన ఫౌజీ మూవీ హీరోయిన్ కి అలాంటి సర్ప్రైజ్ని ఇచ్చాడు.. స్టార్టర్‌ దగ్గరినుంచి బిర్యానీ, స్వీట్స్‌ వరకు.. అన్నింటినీ పార్శిల్‌ చేసి పంపించాడు. వాటిన్నింటినీ టేబుల్‌ ముందు పెట్టుకున్న ఇమాన్వి వీడియో తీసింది. ఆ వీడియోని తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో పోస్ట్ చేసింది.. అంతే కాదు ఆ వీడియోకి థాంక్స్ అంటూ టాగ్ చేసింది.. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో ప్రభాస్ అభిమానులు డార్లింగ్ అంటే ఆమాత్రం ఉండాలి అంటూ కామెంట్లు పెడుతున్నారు..

Advertisement

Also Read :బ్లాక్ బాస్టర్ సీక్వెల్ మూవీలో ప్రదీప్.. ఈసారి 300 కోట్లు పక్కా..!

ఫౌజీ మూవీ విషయానికొస్తే.. 

పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు.. ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఇమాన్వి కథానాయికగా నటిస్తోంది. సీతారామం ఫేమ్‌ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఈ మూవీని ఈ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. మిథున్‌ చక్రవర్తి, జయప్రద, అనుపమ్‌ ఖేర్‌ తదితరులు ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ మూవీ పాన్ ఇండియా చిత్రంగా తెరికెక్కుతుంది.. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లో 2026 దసరాకి విడుదల కానుంది.. వీటితో పాటుగా మరో రెండు సినిమాలలో నటిస్తున్నాడు. ఆ సినిమాలో వచ్చే ఏడాది థియేటర్లలోకి రాబోతున్నాయి… అలాగే కల్కి 2, సలార్ 2 వంటి సీక్రెట్ సినిమాలలో కూడా నటిస్తూ వస్తున్నాడు.. ఆ సినిమాలో కూడా వచ్చేయడాది ప్రేక్షకులు ముందుకు రానున్నాయి.. ఆ తర్వాత ప్రభాస్ మరో నాలుగు ప్రాజెక్టులకు సైన్ చేసినట్లు సమాచారం.

Advertisement

?igsh=ODBpY3pnMDVqaG5l

Related News

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

Big Stories

Advertisement
×