Chilli Farmers: స్వేచ్ఛ బ్యూరో: మిరప రైతుకు తెగుళ్ల ఘాటు తగులుతోంది. తెగుళ్ల వల్ల దిగుబడులు తగ్గడంతోపాటు పెట్టుబడులు పెరగడంతో రైతులు నష్టాలను మూట కట్టుకుంటున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో 25 వేల ఎకరాలలో వాణిజ్య పంట అయిన మిరప పంటను సాగు చేస్తున్నారు. వేసవిలోనే వివిధ రకాల మిరప విత్తనాలను రైతులు కొనుగోలు చేస్తారు. జూలై మాసంలో నారు పెంచి 50 రోజుల తర్వాత పొలంలో నాటు పెడతారు. అప్పటినుంచి రైతుకు వివిధ రకాల అవసరాలకు పెట్టుబడులు మొదలవుతాయి.ఎరువులు, రసాయన మందులు కూలీలకు ఇతర ఖర్చులకు ఎకరానికి 80 వేల దాకా ఖర్చు అవుతోంది. ప్రతి ఏడాది మాదిరే ఈ ఏడాది సైతం తెగుళ్ల బెడద పెరగడంతో ఖర్చు కూడా పెరిగింది.
ప్రస్తుతం మిరప పండు తీసే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. సాధారణంగా ఎకరానికి 20 నుంచి 25 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చేది. కానీ ఈ ఏడాది సైతం అధిక వర్షాలు, తెగుళ్ల వల్ల 8 నుంచి 10 క్వింటాలు దాటడం లేదు. ప్రధానంగా పంటకు తెల్ల, పచ్చ దోమ, నల్లి, తామర పురుగు, కింది పై ముడతలు ఆశించడంతోపాటు ఫంగస్ వ్యాప్తి, పురుగులు, ఇతర కారణాల వల్ల దిగుబడిలో గణనీయంగా తగ్గిపోతున్నాయి. ప్రస్తుతం మార్కెట్ లో క్వింటాల్ ధర ఆశాజనకంగా ఉన్న దిగుబడి అంతంత మాత్రమే ఉండడంతో రైతుకు పెట్టుబడులు వెళ్లలేని పరిస్థితి ఉంది. కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఎకరానికి 20 నుంచి 30 వేలు కౌలు చెల్లించి మిరప పంటను సాగు చేస్తున్నారు. వారికి ఈ ఏడాది సైతం నిరాశే ఎదురైంది. దిగుబడి తగ్గడంతో సాగుకు చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక దిక్కుతోచని స్థితిలో కౌలు రైతులు ఉన్నారు.
ప్రతి ఏటా మిర్చి సాగుకు అలవాటు పడ్డ రైతులు పంట సాగులో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారు. వాతావరణ ప్రతికూల పరిస్థితుల వల్ల మిరప పంటకు క్రమంగా తెగులు, వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రతి మూడు రోజులకు ఒకసారి పంటలో ఆశించిన తెగులకు రసాయన మందులను పిచికారి చేయాల్సి వస్తోంది. ప్రతి ఏడాది బ్రాండెడ్ కంపెనీలకు చెందిన పెస్టిసైడ్స్ మార్కెట్ లోకి రావడంతో పంటకు వాటిని కొట్టడం ద్వారానే మొక్క ఆరోగ్యంగా ఉంటుందనే ఉద్దేశంతో ఎక్కువ ధరను వెచ్చించి పిచికారి చేస్తున్నారు. దీంతో పంట కాలవ్యవధి ఆరు నుంచి ఏడు నెలలు ఉండడంతో విరివిగా తెగుళ్ల నివారణకు రసాయనాలను పిచికారి చేయాల్సి వస్తోంది. దీంతో పెట్టుబడి రూపంలో అధిక మొత్తంలో మందులకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి దాపురిస్తోంది.
Also Read: Mega 158: మెగాస్టార్‌కు కలిసివస్తున్న మ్యాజిక్ నంబర్ ఇదేనా?.. అందుకే రిలీజ్ డేట్..
సస్యరక్షణ చర్యలో భాగంగా వర్షాకాలంలో కూలీల కొరత కారణంగా 500 దాకా ఒక రోజుకి ఉండడంతో రైతులు ఆర్థికంగా కుదేలవుతున్నారు. చలికాలంలో బూడిద తెగులు ఫంగస్ ల కారణంగా మొక్క ఆకులు బూడిద రంగులోకి మారే కళావిహీనంగా తయారవుతుంది. దీంతో మొక్కను కాపాడుకునేందుకు రైతులు ఫర్టిలైజర్ తో పాటు అనేక పెస్టిసైడ్స్ ను వాడాల్సిన పరిస్థితి నెలకొంది. చివరకు పంటపై నల్ల తామర పురుగు పూతలలో వ్యాప్తి చెందడం ద్వారా మొక్క ఆకులు పసుపు రంగులోకి మారి దిగుబడులు గణనీయంగా తగ్గిపోతున్నాయి. ప్రస్తుతం ధరలు ఆశాజనకంగా ఉండడంతో మొక్క గిరస భారీ పోయిన కాస్త పూసుకో పూత వచ్చి గాయపడుతుందని ఉద్దేశంతో అనేక బయో మందులను పిచికారి చేస్తున్నారు. అయినా ఆశించిన స్థాయిలో మొక్క ఆరోగ్యంగా మారకపోవడంతో రైతులు నిరాశకు గురవుతున్నారు.
ఒకవైపు మిరప పంటలు వైరస్ వ్యాప్తి వల్ల పంటలో దెబ్బతింటుంటే ధరలు మాత్రం క్రమంగా పెరుగుతున్నాయి. తేజ, సూపర్ టెన్ 16 నుంచి18 వేలు ఉండగా బ్యాడిగా రకాలు 35 వేల నుంచి 40 వేల వరకు ధర పలుకుతోంది. బంగారం , ఆర్మూర్ 19 వేలు పలుకుతోంది. పసుపు రకం మిర్చికి 26 వేల ధర రైతుకు లభిస్తోంది. కుబేర రకాలకు 24 వేలు హైదరాబాద్ గుంటూరు మార్కెట్లలో ధర వస్తోంది. అదేవిధంగా కొందరు దళారులు రైతుల పంట పొలం దగ్గరే కల్లాల దగ్గర మార్కెట్ల రేట్లకు అనుగుణంగా కొనుగోలు చేస్తున్నారు. బయటి రేట్లు ట్రాన్స్పోర్ట్ ,కమిషన్ వగైరా కలుపుకొని ధరలను అంచనా వేస్తూ రైతులు స్థానికంగానే అమ్ముకునేందుకు మొగ్గు చూపుతున్నారు.
తాను మూడు ఎకరాలలో మిరప సాగు చేశాను.అధిక వర్షాలు, తెగుళ్ల వల్ల ఎకరాకు 8 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వచ్చింది. ప్రస్తుతం ధర క్వింటాలుకు 15 నుంచి 20 వేలు పలుకుతున్న పెట్టుబడులకు మాత్రమే సరిపోయే పరిస్థితి ఉంది. ప్రస్తుతం పంటలు చివరి దశలో ఉండడంతో మొక్కకు కొత్త ఇగురు వస్తుందేమోనని ఉద్దేశంతో మందులను పిచికారి చేస్తున్న ప్రయోజనం లేకుండా పోతోంది.