Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కెరీర్‌లో ప్రస్తుతం ఒక సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. వరుస వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను పలకరిస్తున్న ఆయన, రాబోయే ప్రాజెక్టుల విషయంలో చాలా పక్కా ప్లానింగ్‌తో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే కొరియన్ కనకరాజ్ సినిమా పూర్తి చేసుకున్న వరణ్ తేజ్ మరో రెండ్ ప్రాజెక్టులను రెడీ గా ఉంచారు. తాజాగా ఈ లైన్లోకి కోలీవుడ్ స్టార్ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
Read also-Ayashere Song Promo: నాని ‘ప్యారడైజ్’ నుంచి ‘ఆయాషేర్’ సాంగ్ ప్రోమో వచ్చేసింది.. ఇది అరాచకమే..
మెర్లపాక గాంధీ దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటిస్తున్న చిత్రం ‘కొరియన్ కనకరాజు’. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. ఇప్పటికే ఈ సినిమా కు సంబంధించిన ప్రమోషన్లు మొదలు పెట్టేశారు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇండో-కొరియన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఒక వినూత్నమైన హర్రర్ కామెడీ జానర్ లో ఈ సినిమా ప్రక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో వరుణ్ సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది.
వరుణ్ తేజ్ తన తదుపరి చిత్రాన్ని ఒక నూతన దర్శకుడు బాలాజీతో చేయనున్నారు. బాలాజీ మరెవరో కాదు, స్టార్ డైరెక్టర్ అట్లీ వద్ద శిష్యరికం చేసిన ప్రతిభావంతుడు. ప్రముఖ తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు తన ‘స్టోన్ బెంచ్ క్రియేషన్స్’ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించడమే కాకుండా, సినిమాను సమర్పిస్తున్నారు. ఇది ఒక పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. స్క్రిప్ట్ నచ్చడంతో వరుణ్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.
Read also-AA22 Movie: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. అట్లీ సినిమా అప్టేట్ ఎప్పుడంటే?
వరుణ్ తేజ్ తన సోదరి నిహారిక కొణిదెల నిర్మాణ సంస్థ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్లో ఒక సినిమా చేసేందుకు అంగీకరించారు. ఇటీవల ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న వంశీ నందిపాటి (వంశీ ఎదు) ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ ప్రాజెక్టు కూడా ఈ ఏడాదిలోనే ప్రారంభం కానుంది. ఈ రెండు కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన అధికారిక ప్రకటనలు త్వరలోనే వెలువడనున్నాయి. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూనే, బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాలని వరుణ్ తేజ్ ఈసారి పక్కాగా సిద్ధమవుతున్నారు. ఇప్పటికే యదు వంశీకి ఫిల్మి ఫేర్ అవర్డు కూడా వరించింది. దీంతో వరుణ్ తో రాబో యే సినిమా మరింత జోష్ తో చేయనున్నారు. హిట్ కోసం ఎదురు చూస్తున్న వరుణ్ తేజ్ కి ఈ లైనప్ మంచి ఊరట ఇవ్వనుంది. అయితే ఈ సినిమాలకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.