E-Paper
Advertisement

Pradeep Ranganathan : బ్లాక్ బాస్టర్ సీక్వెల్ మూవీలో ప్రదీప్.. ఈసారి 300 కోట్లు పక్కా..!

Pradeep Ranganathan : బ్లాక్ బాస్టర్ సీక్వెల్ మూవీలో ప్రదీప్.. ఈసారి 300 కోట్లు పక్కా..!
Advertisement

Pradeep Ranganathan : కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. మొదట డైరెక్టర్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన ఆ తర్వాత హీరోగా వరుసగా చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పటివరకు ఈయన నటించిన సినిమాలు అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్గా నిలిచాయి.. ఈ క్రమంలో ప్రదీప్ నెక్స్ట్ మూవీపై అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. అయితే ఆయన రీసెంట్ గా నటించిన డ్యూడ్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ హిట్ ని సొంతం చేసుకుంది.. ఇప్పుడు మరో మూవీతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈయన గతంలో నడిచిన సూపర్ హిట్ మూవీ సీక్వెల్ గా రాబోతుందని ఓ వార్త ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతుంది. మరి ఆ మూవీ ఏది? హీరోయిన్ ఎవరు? సినిమా గురించి పూర్తి వివరాలను ఒకసారి తెలుసుకుందాం..

డ్రాగన్ మూవీకి సీక్వెల్ ఉంటుందా..? 

కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్, బ్యూటిఫుల్ హీరోయిన్ కాయదులోహర్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం డ్రాగన్.. బాక్స్ ఆఫీస్ వద్ద 150 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అంతే కాదు ఈ చిత్రం తర్వాత ప్రదీప్ రంగనాథన్ తమిళనాడు యూత్ కి ఐకాన్ లాగా మారిపోయాడు. అయితే ఈ మూవీ ఒక్క పార్ట్ తో ఆగిపోకుండా ఫ్రాంచైజ్ లాగా రావాలని కోరుకునే వారు ఉన్నారట. దాంతో ఈ చిత్ర డైరెక్టర్ అస్వత్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని క్లారిటీ ఇచ్చాడు.. ఈ సినిమాకు సీక్వెల్ ని తీసే ఆలోచన ఉందని చెప్పాడు. మరి ఆ మూవీ గురించి త్వరలోనే ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.. స్క్రిప్ట్ వర్క్ మొత్తం దాదాపుగా పూర్తి అయ్యింది. ఇక హీరో కి వినిపించడమే బ్యాలన్స్ అంటూ చెప్పుకొచ్చాడు డైరెక్టర్.. ప్రస్తుతం ఈ న్యూస్ కోలీవుడ్ మీడియా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది..

Advertisement

Also Read :బ్యాక్ లెస్ లుక్ లో ప్రియాంక.. డ్రెస్ ధర తెలిస్తే అవాక్కే..!

300 కోట్లు రాబట్టడం ఖాయం..!

హీరో ప్రదీప్ రంగనాథన్ ‘కోమలి’ అనే చిత్రంతో డైరెక్టర్గా కోలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.. మొదటి సినిమాతోనే భారీ హిట్ ని అందుకున్నాడు. ఆ తర్వాత ఈయన దర్శకత్వంలో వచ్చిన మరో మూవీ లవ్ టుడే.. ఈ చిత్రంలో హీరోగా నటించాడు. ఆ తర్వాత డ్రాగన్ మూవీ వచ్చింది. ఈ సినిమా కూడా కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి బాక్స్ ఆఫీస్ వద్ద 150 కోట్లు రాబట్టింది. రీసెంట్ గా డ్యూడ్ అనే చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. ఇప్పుడు డ్రాగన్ సీక్వెల్ మూవీలో నటించబోతున్నాడు. ఈసారి పవర్ ఫుల్ స్టోరీ తో ఈ సినిమా ఉండబోతుందని సమాచారం. గతంలో రిలీజ్ అయిన ఈ మూవీ 150 కోట్లు వసూలు చేస్తే.. ప్రస్తుతం సీక్వెల్ గా రాబోతున్న సినిమా 300 కోట్లకు పైగా వసూళ్లను అందుకుంటుంది అని డైరెక్టర్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు.. ఈ చిత్రం తర్వాత తెలుగులో సినిమా చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

Related News

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

Big Stories

Advertisement
×