Actress Karate kalyani : సినీ నటి కరాటే కళ్యాణి పేరు వినగానే అందరికి గుర్తుకు వచ్చేది.. అబ్బ బాబి పిండేసారు.. ఈ ఒక్క డైలాగ్ తో బాగా పాపులర్ అయ్యింది. టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు అందరి సినిమాలలో కీలక పాత్రల్లో నటించి ప్రత్యేక ఇమేజ్ ని సంపాదించుకుంది.. ఈ మధ్య పెద్దగా సినిమాలు గానీ, సీరియల్స్ లలో గానీ నటించలేదు. సమాజంలో జరిగే అన్యాయాలను ఎదిరిస్తూ నిత్యం వార్తలో నిలుస్తూ ఉంటుంది. ఎన్నోసార్లు ఆమె పోలీస్ స్టేషన్ కూడా వెళ్లిన సందర్భాలు ఉన్నాయి.. అనేకచోట్ల కరాటే కళ్యాణి మీద కేసులు కూడా నమోదైన విషయం తెలిసిందే.. కానీ ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా సాయం కోరిన వారికి సాయం అందిస్తూ వస్తుంది. ఇదిలా ఉండగా తాజాగా కరాటే కళ్యాణి ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది.. అందులో మాట్లాడుతూ.. తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకోవడంతో పాటుగా, బిగ్ బాస్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
బుల్లితెర టాప్ రియాలిటీ షో బిగ్ బాస్.. ఈ షో ద్వారా చాలామంది లాభాలు కన్నా నష్టాలను సరి చూశారని పలు ఇంటర్వ్యూలలో బయటపెట్టారు.. సీరియల్స్లలో నటిస్తున్న యాక్టర్స్ తో, బుల్లితెర టీవీ ఛానల్ లో యాంకర్స్, కమెడియన్స్ ఇలా బిగ్ బాస్ లో చాలామంది పాల్గొంటూ తమ ఆట తీరుతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నారు. అయితే బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ చేసే కొన్ని మిస్టేక్స్ వల్ల ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత కెరియర్ శూన్యంగా మారుతుందని ఇంటర్వ్యూలో ఎన్నో సందర్భాలలో బయట పెట్టింది. అలా బిగ్ బాస్ ద్వారా బాగా నష్టపోయిన వారిలో కరాటే కళ్యాణి కూడా ఒకరు.. తాజాగా ఈమె ఓ ఇంటర్వ్యూ పాల్గొన్నారు. ఈ సందర్బంగా బిగ్ బాస్ గురించి ఎన్నో విషయాలను బయటపెట్టింది. ఆమె మాట్లాడుతూ.. బిగ్ బాస్ నుంచి వచ్చిన లాభాల కన్నా నేను రెండింతలు నష్టపోయానని ఆమె అన్నారు.. ఆ షోకు అగ్రిమెంట్ తీసుకున్నారు. దాంతో నాకు ఎటువంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆమె అన్నారు. ఇప్పటికీ సినిమాలు లేకపోవడానికి కారణం అదే అని ఆమె సంచలన నిజాలను బయటపెట్టారు.. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది.
Also Read : అఖండ 2 టికెట్లపై మళ్లీ ధర పెంపు… ఈ సారి ఏం మారిందంటే?
బిగ్ బాస్ తర్వాత కరాటే కళ్యాణి కెమెరాకు దూరమయ్యారు.. బిగ్ బాస్ లోకి వచ్చిన తర్వాత మీకు ఏదైనా సినిమా అవకాశాలు కల్పిస్తామని చెప్తారు. కానీ స్టార్ మా నాకు ఎటువంటి అవకాశాన్ని కల్పించలేదు.. అది నాకు చాలా బాధగా అనిపించింది. ఒక రకంగా చెప్పాలంటే బిగ్ బాస్ నా జీవితాన్ని మార్చేసింది.. అలా నేను ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైపోయానని ఆమె అంటున్నారు. మంచి క్యారెక్టర్ ఉన్న సినిమాలు వస్తే తప్పకుండా చేస్తానని కళ్యాణి అంటున్నారు.. ఈమధ్య పోలీస్ స్టేషన్లలో కళ్యాణి పేరు ఎక్కువగా వినిపిస్తుంది. అన్యాయాన్ని ఎదిరిస్తున్న ఆమెపై ఎన్నో కేసులు కూడా నమోదైన విషయాన్ని ఇంటర్వ్యూలో బయటపెట్టింది.. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.