E-Paper
Advertisement

Akhanda 2 Tickets : అఖండ 2 టికెట్లపై మళ్లీ ధర పెంపు… ఈ సారి ఏం మారిందంటే?

Akhanda 2 Tickets : అఖండ 2 టికెట్లపై మళ్లీ ధర పెంపు… ఈ సారి ఏం మారిందంటే?
Advertisement

Akhanda 2 Tckets : టాలీవుడ్ హీరో నందమూరి బాలయ్య నటించిన అఖండ 2కి సంబంధించిన రిలీజ్ డ్రామా చివరకు కీలక మలుపు తీసుకుంది. మద్రాస్ హైకోర్టు రిలీజ్ కి గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలిసింది.. దాంతో ఈ మూవీ ఈ నెల 12 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతుంది.. ఈ న్యూస్ వినగానే నందమూరి అభిమానులు మళ్లీ హంగామా మొదలెట్టేశారు.. రేపు ప్రీమియర్ షోలు పడబోతున్నాయి. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం అఖండ 2 టీమ్ కు గుడ్ న్యూస్ చెప్పింది. సినిమా విడుదలకు సంబంధించిన అన్నీ అనుమతులు ఇప్పటికే లభించాయి.. భారీ బడ్జెట్ సినిమాలు వచ్చినప్పుడు టికెట్ రేట్లు పెంచుకోవడం ఈ మధ్య ఇండస్ట్రీలో కామన్ అయిపోయింది. నిర్మాతలకు నష్టం రాకుండా ప్రభుత్వాలు కూడా రేట్ల పెంపుకు ఆమోదం తెలుపుతున్నారు.. ప్రస్తుతం అఖండ 2 టికెట్ ధర పెరిగినట్లు వార్తలు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అఖండ 2 టికెట్ ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూసేద్దాం..

అఖండ 2 టికెట్ ధర పెంపు..

బాలయ్య ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన సమయం వచ్చేసింది. అఖండ 2 మూవీ మరి కొన్ని గంటల్లో థియేటర్లలోకి రాబోతుంది. ఈ నేపథ్యంలో నందమూరి బాలయ్య అభిమానులు థియేటర్ల వద్ద హంగామా మొదలెట్టేస్తున్నారు. ఈ క్రమంలో అఖండ 2 టీమ్ కు ఏపీ సర్కార్ ఊరటనిచ్చే న్యూస్ చెప్పింది. రేట్ల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు రిలీజ్ డేట్ మారినా, ఆ పర్మిషన్స్ విషయంలో ప్రభుత్వం అదే తరహాలో స్పందించింది. తాజాగా రిలీజ్ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. ఏపీలో టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించారు.. ఆ రేట్ల వివరాలను చూస్తే.. సింగిల్ స్క్రీన్స్ లో రెగ్యులర్ రేట్లపై అదనంగా 75 రూపాయలు, మల్టీప్లెక్స్ లలో 100 రూపాయలు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు.. పెంచిన ధరలు సినిమా రిలీజ్ అయిన 10 రోజుల వరకు కొనసాగుతాయని ఏపీ ప్రభుత్వం తెలిపింది. దీనివల్ల ఓపెనింగ్ కలెక్షన్స్ స్ట్రాంగ్ గా ఉండే అవకాశం ఉంది.. ప్రస్తుతం టికెట్ ధర 600 రూపాయలుగా నిర్ణయించారు. అలాగే రోజుకు 5 ఆటలు ప్రదర్శించుకునే అవకాశం కూడా కల్పించారు.. మొదటి రోజు ఓపెనింగ్స్ ఎక్కువగా జరిగే అవకాశాలు ఉండంతో కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది..

Advertisement

Also Read : బిగ్ బాస్ హౌస్ లో మూడో యుద్ధం.. ఇదేం టాస్క్ రా అయ్యా.. డిమాన్ పై భరణి సీరియస్..

మూవీ బడ్జెట్ & బ్రేక్ ఈవెన్ టార్గెట్..?

సింహా, లెజెండ్, అఖండ వంటి హాట్రిక్ కాంబినేషన్స్ తో తెలుగు తెరపై ప్రత్యేక ముద్ర వేసిన బాలయ్య, బోయపాటి కాంబోలో రాబోతున్న నాల్గొవ చిత్రం అఖండ 2.. గతంలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన అఖండ మూవీకి సీక్వెల్ గా ఈ మూవీ రాబోతుంది. మొదటి నుంచి ఈ సినిమా పై భారీ అంచనాలే క్రియేట్ అయ్యాయి. బాలయ్య కెరీర్ లోనే రూ. 100 కోట్ల పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.. రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాను బాలయ్య కూతురు తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్రా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.. మొదటి రోజు దాదాపుగా వంద కోట్ల గ్రాస్ వసూళ్లను రాబడితేనే ఈ రేంజ్ గ్రాస్ వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. 40 కోట్ల కలెక్షన్స్ ఫస్ట్ డే వస్తే మూవీకి కలెక్షన్స్ పెరుగుతాయని తెలుస్తుంది. భారీ అంచనాలతో రాబోతున్న ఈ మూవీ ఎన్ని వందల కోట్లు రాబడుతుందో చూడాలి..

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×