E-Paper
Advertisement

Viveka Murder Case: వివేకా హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. రీ ఇన్వెస్టిగేషన్‌ కు సీబీఐ కోర్టు ఆదేశాలు

Viveka Murder Case: వివేకా హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. రీ ఇన్వెస్టిగేషన్‌ కు సీబీఐ కోర్టు ఆదేశాలు
Advertisement

Viveka Murder Case: మాజీ మంత్రి వివేకానందరెడ్డి మర్డర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వివేకా హత్య కేసును మళ్లీ పూర్తి దర్యాప్తు చేయాలని కోరుతూ ఆయన కుమార్తె సునీత నాంపల్లి సీబీఐ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై కోర్టు బుధవారం తీర్పును వెల్లడించింది. ఈ కేసులో సమగ్ర దర్యాప్తు జరపకపోతే అసలు నిందితులు తప్పించుకునే ప్రమాదం ఉందని సునీత తరఫున న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు.

కీలక ఫోన్ సంభాషణపై దర్యాప్తునకు ఆదేశం

వివేక హత్య కేసులో దర్యాప్తు కొనసాగితే మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయని సునీత కోర్టుకు తెలిపారు. అలాగే సీబీఐని సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్‌ వేసేలా ఆదేశించాలని కోరారు. వివేకా హత్య కేసులో ఏ2గా ఉన్న సునీల్‌ యాదవ్‌ సోదరుడు కిరణ్‌, వైఎస్‌ భాస్కర్‌రెడ్డి సోదరుడు కుమారుడైన అర్జున్‌రెడ్డి మధ్య కీలక ఫోన్‌ సంభాషణ జరిగిందని సునీత తరఫు లాయర్లు కోర్టుకు తెలిపారు. అర్జున్‌రెడ్డి, కిరణ్‌ యాదవ్‌ ఫోన్‌ సంభాషణలపై దర్యాప్తు చేస్తే కీలక విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు. దర్యాప్తు కొనసాగించే అవకాశం లేదని నిందితుల తరఫు న్యాయవాదులు వాదించారు. ఈ పిటిషన్ పై ఇరుపక్షాల వాదనలు విన్న సీబీఐ కోర్టు వివేకా హత్య కేసులో పాక్షిక దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అర్జున్‌రెడ్డి, కిరణ్‌ యాదవ్‌ ఫోన్‌ సంభాషణలపై దర్యాప్తునకు ఆదేశించింది.

Advertisement

Also Read: Pawan Kalyan: పంచాయతీ రాజ్ శాఖలో నూతన సంస్కరణలు.. ఒకేసారి 10 వేల మందికి పైగా పదోన్నతులు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 

లోతైన దర్యాప్తు అవసరం

వివేకా హత్య కేసులో సమగ్ర దర్యాప్తు జరగలేదని, పలు అంశాలపై దర్యాప్తు అసమగ్రంగా ఉందని నిందితుల చెబుతున్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని సీబీఐ కోర్టుకు వివేకా కుమార్తె సునీతారెడ్డి నివేదించారు. వివేకా హత్య కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగించాలని సునీత నాంపల్లి సీబీఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై డిసెంబర్ 6న వాదనలు ముగిశాయి. ఈ పిటిషన్ పై ఇవాళ సీబీఐ కోర్టు తీర్పు వెల్లడించింది. సునీత తరఫున న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, ఎస్ గౌతం వాదనలు వినిపించారు. సునీత తరఫు న్యాయవాదుల వాదనలు పరిగణలోకి తీసుకున్న కోర్టు వివేకా హత్య కేసులో లోతైన దర్యాప్తు జరగాలని స్పష్టం చేస్తూ ఆదేశాలు ఇచ్చింది.

Related News

కాంగ్రెస్ అభ్యర్థులపై దాడులు.. చంద్రబాబు సర్కారుపై షర్మిల సంచలన ఆరోపణలు

టైం మీది కొడుతున్నారు.. రేపు మా టైం వస్తుంది: జగన్ సంచలన వ్యాఖ్యలు!

వైసీపీకి బిగ్ షాక్.. నామినేషన్ల గడువు పెంపు పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు!

ఇచ్చాపురం మున్సిపాలిటీలో తోటికోడళ్ల కుర్చీ పోరు.. వైసీపీ పార్టీకి బిగ్ షాక్..?

దర్శిలో హైటెన్షన్.. వైసీపీ దాడిలో SI కి తీవ్ర గాయాలు

మా ప్రభుత్వం వస్తే నేనే హోంమంత్రిని: అంబటి రాంబాబు

సీఈసీ నియామకానికి మద్దతిచ్చి తప్పు చేశాం.. విజయవాడలో జగన్ సంచలన వ్యాఖ్యలు!

సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్రమైన ఆరోపణలు.. గొడ్డళ్లు సప్లై చేశారంటూ మండిపాటు

Big Stories

Advertisement
×