E-Paper
Advertisement

Lok Sabha: 150 ఏళ్ల వందేమాతరం గేయం.. లోక్‌సభలో ప్రధాని మోదీ చర్చ, లైవ్‌లో చూద్దాం

Lok Sabha: 150 ఏళ్ల వందేమాతరం గేయం..  లోక్‌సభలో ప్రధాని మోదీ చర్చ, లైవ్‌లో చూద్దాం
Advertisement

Lok Sabha: జాతీయ గేయం వందేమాతరం 150 ఏళ్లు పూర్తి చేసుకుందని తెలిపారు ప్రధాని నరేంద్రమోదీ. ఏడాది పొడవునా వేడుకలు జరుపుకుంటున్నామని తెలిపారు. వందేమాతరం.. స్వాతంత్ర్య పోరాటంలో భారతీయుల గొంతుకని అన్నారు. ఈ చర్చలో పాల్గొనడం తనకు గర్వకారణమన్నారు.  

వందేమాతరం గేయానికి 150 ఏళ్లు

Advertisement

వందేమాతరం గేయంపై సోమవారం ఉదయం 12 గంటలకు లోక్‌సభలో చర్చను ప్రారంభించారు ప్రధాని నరేంద్రమోదీ. గీతంపై చర్చ చేపట్టినందుకు సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. స్వాతంత్య్ర  సంగ్రామం ఫలితంగానే మనమందరం ఇక్కడ ఉన్నామన్నారు. భారతదేశాన్ని బానిసత్వ సంకెళ్ల నుంచి విముక్తి కల్పించేందుకు నినదించిన గేయం, వందేమాతరం అని అన్నారు.

ఈ చర్చ.. చరిత్రతో ముడిపడిన అనేక ఘట్టాలను మన కళ్ల ముందుకు తీసుకొస్తుందన్నారు. దేశం మొత్తం వందేమాతర గీతం స్ఫూర్తితో ఏకమైందన్నారు. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా బంకించంద్ర ఛటర్జీ ఈ గీతాన్ని సంకల్పించారని గుర్తు చేశారు ప్రధాని. వందేమాతరం.. రాజకీయ అధికారం కోసం ఉద్దేశించిన గీతం కాదన్నారు.

Advertisement

లోక్‌సభలో చర్చ ప్రారంభించిన ప్రధాని నరేంద్రమోదీ

150 ఏళ్ల వందేమాతర గీతం ప్రయాణం ఎన్నో ఘట్టాలను దాటుకుంటూ వెళ్లిందన్నారు. ఎమర్జెన్సీ ఉక్కుపాదం కింద వందేమాతరాన్ని తొక్కిపట్టారని వివరించారు. గంగా , సింధూ, గోదావరి, కావేరి నదుల వెంట ఉన్న సాంస్కృతిక వైభవాన్ని వందేమాతరం చాటి చెప్పిందన్నారు. జననీ జన్మభూమశ్చ అన్న రాముడి మాటలకు మరో రూపం వందేమాతరం అని తెలిపారు.

స్వాతంత్య్ర ఉద్యమంలో కోట్ల మందికి స్ఫూర్తి నింపిన ఈ గేయంపై చర్చ జరపడం మనందరి అదృష్టమన్నారు. ఈ మధ్యే మన రాజ్యాంగ 75 ఏళ్ల సంబరాలు జరుపుకున్నామని తెలిపారు. 2047 నాటిని భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు సంకల్పించామన్నారు.

1857 తర్వాత స్వాతంత్య్ర సమరయోధులపై ఒత్తిడి పెంచారన్నారు ప్రధాని మోదీ. ఎంత ఒత్తిడి పెరిగినా.. ఏమాత్రం వెనక్కి తగ్గకుండా గేయాన్ని రచించారన్నారు. ఈ నినాదం బ్రిటీషర్లకు సింహ స్వప్నంగా మారిందన్నారు. భారత్ నలువైపులా వందేమాతర నినాదం మారుమోగిందన్నారు. ఈ గేయం ఆజాద్‌కు విజన్‌గా మారిందన్నారు.

ALSO READ: ఇండిగో సంక్షోభానికి కారణం వీళ్లే.. ఎంజాయ్ చేస్తున్నారంటూ పేర్లు బయటపెట్టిన ఆ సంస్థ ఉద్యోగి

పాలనలో భారతీయుల శక్తి సామర్థ్యాలపై సందేహం వెలిబుచ్చారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా కవితలు చదివి వినిపించారు. దేశ ఐక్యతకు చిహ్నంగా వందేమాతరం నిలిచిందన్నారు. దేశాన్ని అనేక ముక్కలు చేసేందుకు ఆంగ్లేయులు శతవిధాలా ప్రయత్నాలు చేశారన్నారు. దేశం ముక్కలు కాకుండా ఈ గేయం సాయం చేసిందన్నారు.

 బెంగాల్ ఐక్యతకు వందేమాతర గేయం పాత్ర ఎనలేదన్నారు. దీన్ని ఉచ్చరించకూడదని నిషేధం విధించారని ఆనాటి రోజులను గుర్తు చేశారు. దేశంలో అనేక చోట్ల ఉద్యమకారులను కఠినంగా అణిచి వేశారని వివరించారు. ఈ గేయంపై నినాదాలు చేస్తూ ఎందరో ప్రాణాలు అర్పించారన్నారు. ఉరిశిక్ష అమలు చేసే ముందు వందేమాతరం నినాదాలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

 

 

Related News

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

వైద్యులపై దాడికి దిగితే.. కనికరం చూపొద్దు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

ప్రాణం పోయే ఆఖరిక్షణం.. దేవదూతల్లా పెళ్లైన జంట ప్రత్యక్షం, యువ బైకర్ సేఫ్, వీడియో వైరల్

Big Stories

Advertisement
×