E-Paper

అసూయ అంటే తెలియని వ్యక్తి ఆమె.. రష్మిక పై ప్రభాస్ బ్యూటీ కామెంట్స్!

అసూయ అంటే తెలియని వ్యక్తి ఆమె.. రష్మిక పై ప్రభాస్ బ్యూటీ కామెంట్స్!
Advertisement

Rashmika Mandanna: రష్మిక మందన్న ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం తెలుగు సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇక త్వరలోనే రష్మిక నటించిన కాక్ టెయిల్ 2(Cock Tail 2) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా జూన్ 19వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా కృతి సనన్(Kriti Sanon) ‘ఫెమినా బ్యూటీ అవార్డ్స్’ కార్యక్రమంలో భాగంగా తన కోస్టార్ రష్మిక(Rashmika) గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

రష్మిక చుట్టూ పాజిటివ్ వైబ్స్..

నేషనల్ క్రష్ అయినటువంటి రష్మిక మందన్నతో కలిసి పనిచేయడం తనకు ఒక అద్భుతమైన అనుభూతి అని తెలియజేశారు. రష్మిక ఎంతో నిజాయితీ ఉన్న మనిషి. తన దగ్గర ప్రేమ ఆప్యాయత ఉంటుంది. ఎలాంటి కల్మషం లేని , అసూయ అంటే తెలియని వ్యక్తి అని తెలిపారు.తాను వైబ్స్ ను నమ్ముతాను రష్మిక ఎక్కడ ఉంటే తన చుట్టూ అంతా పాజిటివ్ వైభవ్ ఉంటుందని కృతిసనన్ తెలిపారు. తనతో కలిసి ఈ సినిమాలో భాగం కావడం చాలా సంతోషంగా అనిపించిందని రష్మిక గురించి ఈమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

కాక్ టెయిల్ సినిమాకు సీక్వెల్..

Advertisement

సైఫ్ అలీ ఖాన్, దీపికా పదుకోన్, డయానా పెంటీల కాంబినేషన్ లో వచ్చిన ‘కాక్ టెయిల్’ సినిమా 2012వ సంవత్సరంలో విడుదల అయ్యి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా కాక్ టెయిల్ 2 సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హోమి అడజానియా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో షాహిద్ కపూర్(Shahid Kapoor) హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఇలా షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మిక కీలక పాత్రలలో నటిస్తున్న నేపథ్యంలో ఈ సినిమా పట్ల మంచి అంచనాలే ఉన్నాయి.

నెగిటివ్ పాత్రలో రష్మిక..

Advertisement

ఇటీవల ఈ సినిమా నుంచి జబ్ తలక్ అనే సాంగ్ విడుదల చేయగా ఈ పాటకు మంచి ఆదరణ లభిస్తుంది. అలాగే సోషల్ మీడియాలో ఎంతోమంది ఈ పాటకు రీల్స్ చేస్తూ పోస్ట్ చేయడం విశేషం. రష్మిక మందన్న ఇటీవల వరుస బాలీవుడ్ సినిమాలకు కమిట్ అయిన సంగతి తెలిసిందే .ఈమె యానిమల్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా తరువాత ఛావా సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇక ప్రస్తుతం రష్మిక మందన్న తన భర్త విజయ్ దేవరకొండతో కలిసి రణబాలి అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు మైసా, కాంచన 4 సినిమాలతో పాటు అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న రాకా సినిమాలో ఈమె నెగిటివ్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇలా పెళ్లి తరువాత ఈమె కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు.

Also Read: అల్ట్రా స్టైలిష్ లుక్ లో తారక్.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఫోటో…

Related News

సుకుమార్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న స్టార్ డైరెక్టర్స్ ఎవరో తెలుసా..?

Movies in Theater : ఈ వారం బాక్సాఫీస్ వార్.. థియేటర్లలో సందడి చెయ్యబోతున్న చిత్రాలు..

Gv Prakash : మోసపోయిన జీవీ ఆ పని ఆపలేదు.. ఎంతైన హీరో గ్రేట్ అంతే..

రౌడీ హీరోతో ‘మమ్మీ’ విలన్ ఢీ..మైండ్ బ్లాక్ చేస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్..

ప్రధాని మోదీ ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లో అల్లు అర్జున్ ‘AA23’ థీమ్ మ్యూజిక్..

అజయ్ భూపతి ‘శ్రీనివాస మంగాపురం’ నుండి ‘గుండె పేలిపోతోందే’ లిరికల్ సాంగ్ వచ్చేసింది..

రామ్ చరణ్ ‘పెద్ది’ నుండి ‘హెల్లాల్లోల్లో’ ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది..

థియేటర్లలో మళ్లీ ‘గబ్బర్ సింగ్’ పూనకాలు.. రీ-రిలీజ్ హంగామా ఎప్పుడంటే?

×