E-Paper
Advertisement

Prince Yadav: విరాట్ కోహ్లీని డ‌కౌట్ చేసిన ప్రిన్స్ యాద‌వ్ పై 2 ఏళ్ల‌ బ్యాన్, వీడు ఇంత ఛీట‌ర్ అని తెలీదు ?

Prince Yadav: విరాట్ కోహ్లీని డ‌కౌట్ చేసిన ప్రిన్స్ యాద‌వ్ పై 2 ఏళ్ల‌ బ్యాన్, వీడు ఇంత ఛీట‌ర్ అని తెలీదు ?
Advertisement

Prince Yadav:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier League 2026 Tournament) భాగంగా నిన్న లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( Lucknow Super Giants vs Royal Challengers Bengaluru) మధ్య బిగ్ ఫైట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన లక్నో తొమ్మిది పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఇందులో లక్నో బౌలర్ ప్రిన్స్ యాదవ్ ( Prince Yadav ) అదిరిపోయే బౌలింగ్ చేశాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ డకౌట్ ( Virat Kohli For Duck) అయ్యాడు. 9 సంవత్సరాల తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో విరాట్ కోహ్లీ డ‌కౌట్ కావడం గమనార్హం. గతంలో దావాల్ కులకర్ణి ( Dawal Kulkarni) 2017 సంవత్సరంలో డకౌట్ చేయగా.. ఇప్పుడు విరాట్ కోహ్లీని ప్రిన్స్ యాదవ్ డకౌట్ చేయడం జరిగింది. దీంతో ప్రిన్స్ యాదవ్ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది.

Also Read: Hasin Jahan: షమీ కుటుంబంలో అంద‌రూ దొంగ‌లే..పెళ్లి చేసుకుంటాన‌ని మోసం, ప్రెగ్నెంట్ అయ్యాక !

విరాట్ కోహ్లీని డ‌కౌట్ చేసిన ప్రిన్స్ యాద‌వ్ పై 2 ఏళ్ల‌ బ్యాన్

Advertisement

నిన్న జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీని డకౌట్ చేసిన ప్రిన్స్ యాదవ్ పైన రెండు సంవత్సరాల బ్యాన్ విధించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. అయితే విరాట్ కోహ్లీని డకౌట్ చేసినందుకు ఈ బ్యాన్ విధించలేదు. వయస్సు విషయంలో ఫ్రాడ్ చేసినందుకుగాను 2019 సమయంలో ప్రిన్స్ యాదవ్ పైన రెండు సంవత్సరాల పాటు బ్యాన్ విధించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. 2020 నుంచి 2022 వరకు ఐపీఎల్ తో పాటు దేశవాళీ క్రికెట్ లో ఆడకుండా నిషేధం విధించింది. అయితే అదే సమయంలో కరోనా మహమ్మారి సంభవించిన నేపథ్యంలో ఈ వార్త పెద్దగా బయటకు రాలేదు. కానీ, నిషేధం విధించిన రెండు సంవత్సరాల కాలంలో ప్రిన్స్ యాదవ్ చాలా కష్టపడ్డాడు. ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేయడంతో పోలీస్ పరీక్షలకు హాజరయ్యాడు.

అక్కడ విఫలమై, మళ్లీ క్రికెట్ బాట పట్టాడు. పట్టుదలతో రెండు సంవత్సరాల పాటు శ్రమించి ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లోకి మళ్ళీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రమంలోనే గత సీజన్ నుంచి లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడుతున్నాడు. ఇక ఈ 2026 ఐపీఎల్ సందర్భంగా 10 మ్యాచ్ ల్లోనే 16 వికెట్లు పడగొట్టాడు. పర్పుల్ క్యాప్ రేసులో కూడా ప్రిన్స్ యాదవ్ ఉండడం గమనార్హం. ఇది ఇలా ఉండగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ సందర్భంగా ప్రిన్స్ యాదవ్ ను 30 లక్షలకు కొనుగోలు చేసింది లక్నో సూపర్ జెయింట్స్. ఇక ఈ సీజన్ కోసం అదే ధర పెట్టి రిటైన్ చేస్తుంది. అయితే ఇదే జట్టులో ఉన్న మాయాంక్ యాదవ్ కు 11 కోట్లు పెట్టారు. అతను వరుసగా గాయాల బారిన పడుతున్నాడు తప్ప.. ఒక్క మ్యాచ్ సరిగ్గా ఆడలేదు. అదే 30 లక్షలతో జట్టులోకి వచ్చిన ప్రిన్స్ యాదవ్ మాత్రం 100కు 200% కష్టపడుతున్నాడు.

Advertisement

Also Read: Alastair Cook: IPL ఓన‌ర్ల‌కు ప్లేయ‌ర్లు భ‌య‌ప‌డుతూ బ‌తుకుతున్నారు, టార్చ‌ర్ అనుభ‌విస్తున్నారు Alastair Cook !

 

Related News

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

Big Stories

Advertisement
×