E-Paper
Advertisement

పాస్టర్ ముసుగులో కామాంధుడు.. మైనర్ బాలికపై దారుణం.. ప్రాణాపాయ స్థితిలో చిన్నారి!

పాస్టర్ ముసుగులో కామాంధుడు.. మైనర్ బాలికపై దారుణం.. ప్రాణాపాయ స్థితిలో చిన్నారి!
Advertisement

Eluru Crime News: ఏలూరు జిల్లా కామవరపుకోట మండలంలో వెలుగుచూసిన ఈ హృదయవిదారక ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆధ్యాత్మిక ముసుగులో ఉన్న ఒక వ్యక్తి ఏ రకంగా బరితెగించాడో ఈ ఉదంతం కళ్లకు కడుతోంది. చౌటపల్లి రాంబాబు (42) అనే వ్యక్తి పాస్టర్‌గా చర్చిని నడుపుతూ ప్రార్థనల పేరుతో నమ్మించిన ఓ నిరుపేద కుటుంబానికి చెందిన 14 ఏళ్ల బాలికపై కన్నేసి ఆమె జీవితాన్ని నాశనం చేశాడు. కూలి పనులు చేసుకునే ఆ కుటుంబం నిత్యం చర్చికి వస్తుండటంతో వారి అమాయకత్వాన్ని అలుసుగా తీసుకున్న నిందితుడు తరచూ ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడుతూ వస్తున్నాడు. తన పైశాచికత్వాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో ఆ బాలిక భయంతో ఈ విషయాన్ని ఎవరికీ వెల్లడించలేక లోలోన కుమిలిపోయింది.

అయితే ఈ క్రమంలో బాలికకు నెలసరి రాకపోవడంతో తాను చేసిన పాపం ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో ఆ పాస్టర్ మరింత క్రూరంగా వ్యవహరించాడు. గర్భం దాల్చకుండా చేసేందుకు గర్భనిరోధక మాత్రలను ఆ చిన్నారికి అధిక మోతాదులో వాడించాడు. దీనివల్ల ఆ బాలిక శరీరంలో తీవ్రమైన మార్పులు సంభవించి అధిక రక్తస్రావం కావడం మొదలైంది. తీవ్ర అనారోగ్యానికి గురైన బాలిక పరిస్థితి విషమించడంతో చేసేదేమీ లేక తన తల్లికి జరిగిన దారుణాన్ని వివరించింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆ బాలికను హుటాహుటిన ఏలూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ బాలిక ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Advertisement

ఈ ఘటనపై బాధితురాలి తల్లిదండ్రులు శుక్రవారం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. నిందితుడు పాస్టర్ రాంబాబు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని.. అతని కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు తడికలపూడి ఎస్సై వల్లీపద్మ వెల్లడించారు. పోక్సో (POCSO) చట్టం కింద మరియు ఇతర సంబంధిత సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పవిత్రమైన ప్రార్థనా స్థలంలోనే ఇలాంటి దారుణాలు జరగడం పట్ల మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిందితుడిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Read Also: జూబ్లీహిల్స్ మర్డర్ మిస్టరీ.. 25 నిమిషాల్లో చంపేశారు, ఇదిగో నిందితుల ఫోటోలు..!

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×