E-Paper
Advertisement

తమిళనాడు కాబోయే ముఖ్యమంత్రి విజయ్ పై లైలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్…

తమిళనాడు కాబోయే ముఖ్యమంత్రి విజయ్ పై లైలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్…
Advertisement

Actress Laila: సౌత్ సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సీనియర్ నటి లైలా ఒకరు. ఒకానొక సమయంలో తెలుగు తమిళ భాషలలో ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నటించిన లైలా ఇటీవల సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు. అయితే ఈమె ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. లైలా తాజాగా గోదారి గట్టుపై అనే సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. జగపతిబాబు సుమంత్ ప్రభాస్ కీలక పాత్రలలో నటించిన ఈ సినిమాలో లైలా కూడా భాగస్వామ్యం అయ్యారు. ఇటీవల ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి పరవాలేదు అనిపించుకుంది.

టీవీకే పార్టీ అధినేత విజయ్..

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నటి లైలా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తమిళనాడుకు కాబోయే ముఖ్యమంత్రి(Tamilanadu Cheif Minister) విజయ్ గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. విజయ్ హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్న ఈయన రాజకీయాలలోకి వచ్చి టీవీకే పార్టీని(TVK Party) స్థాపించిన సంగతి తెలిసిందే. ఇలా టీవీకే పార్టీ స్థాపించిన కేవలం రెండు సంవత్సరాలకే ఈయన ఎన్నికలలో పోటీ చేశారు.

తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్..

Advertisement

ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా విజయ్ భారీ మెజారిటీని సొంతం చేసుకున్నారు. ఈయన ఏకంగా 108 స్థానాలలో విజయం సాధించారు. ఇక తమిళనాడులో విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అంటే మరొక పది స్థానాలు అవసరమయ్యాయి . ఈ నేపథ్యంలోనే ఈయన ప్రమాణ స్వీకారం కాస్త ఆలస్యమవుతుంది. ఇక త్వరలోనే విజయ్(Vijay) తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు ఇలాంటి తరుణంలోనే సీనియర్ నటి లైలా విజయ్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

సహాయం చేయటంలో ముందుంటారు..

Advertisement

ఈ సందర్భంగా లైలా మాట్లాడుతూ.. విజయ్ చాలా మంచి వ్యక్తి, ఆపదలో ఉన్నవారికి సహాయం చేయటంలో ముందు వరుసలో ఉంటారు. ఇలాంటి గొప్ప వ్యక్తి తమిళనాడు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఈయన సినిమాలపరంగా ఎంత అంకితభావంతో పనిచేశారో రాజకీయాలలో ముఖ్యమంత్రిగా కూడా అంతే అంకిత భావంతో పనిచేస్తారని లైలా తెలియజేశారు. ఇలా హీరో విజయ్ గురించి ఈమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక విజయ్ మంచితనం గురించి ఆయనతో కలిసి పనిచేసిన సెలబ్రిటీలు అందరూ కూడా ఎంతో గొప్పగా మాట్లాడారు.. ఇక విజయ్ ఎన్నికలలో మంచి సక్సెస్ అందుకోవడం కోసం ఎంతో మంది సెలెబ్రెటీలు ఈయనకు మద్దతు తెలియజేసిన సంగతి తెలిసిందే. ఇక ఈయన ప్రమాణస్వీకారం కూడా ఆలస్యమవుతున్న తరుణంలో గవర్నర్ తీరుపట్ల సెలబ్రిటీలు అసహనం వ్యక్తం చేస్తూ విజయ్ కు మద్దతు తెలుపుతున్నారు.

Also Read: కొండల్లో ఇరుక్కుపోయిన స్వయంభు టీమ్.. రెండు రోజుల పాటు అడవిలోనే?

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×