E-Paper
Advertisement

Laya: ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’లో మంగపతిని డామినేట్ చేశా!

Laya: ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’లో మంగపతిని డామినేట్ చేశా!
Advertisement

Laya: లయ.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమే. ఒకప్పుడు హీరోయిన్‌గా తన ప్రతిభను కనబరిచిన లయ (Actress Laya).. పెళ్లి, పిల్లల తర్వాత మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి మంచి మంచి పాత్రలను ఎన్నుకుంటున్నారు. ఈ క్రమంలో ‘మిస్సమ్మ’, ‘అదిరందయ్యా చంద్రం’, ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ వంటి క్లాసిక్ ఎంటర్‌టైనర్స్ తర్వాత శివాజీతో కలిసి ఆమె నటించిన సినిమా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ (Sampraadayini Suppini Suddhapusani). ‘లిటిల్ హార్ట్స్’, ‘రాజు వెడ్స్ రాంబాయి’ వంటి విజయాల తర్వాత ఈటీవీ విన్‌తో కలిసి నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తున్నారు. క్రైమ్-కామెడీ ఫ్యామిలీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని ఈటీవీ విన్‌ అసోసియేషన్‌తో శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రిక్కి సమర్పణలో హీరో శివాజీ (Sivaji) స్వయంగా నిర్మించగా.. సుధీర్ శ్రీరామ్ తెరకెక్కించారు. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేసిన విషయం తెలిసిందే. మార్చి 6న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైన ఈ చిత్ర విశేషాల గురించి హీరోయిన్ లయ మాట్లాడుతూ..

Also Read- Janhvi Kapoor:మా పేర్లు వాడుకొని బ్రతుకుతున్నారు.. ఫైర్ అయిన జాన్వీ కపూర్!

మంగపతిని డామినేట్ చేసే పాత్ర చేశా

Advertisement

‘‘శివాజీ, నేను కలిసి నటించి సుమారు 20 ఏళ్లు అవుతుంది. ముందుగా ఈ చిత్రంలో నటించాలని అనగానే ఫ్యామిలీ డ్రామా అనుకున్నాను. కానీ ఇది అవుట్‌ అండ్‌ అవుట్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ అనగానే నాకు ఇష్టమైన జోనర్‌ అని తెలిసి చాలా హ్యాపీగా అనిపించింది. నాకు కామెడీ సినిమాలంటే చాలా ఇష్టం. అందరికీ కనెక్ట్‌ అయ్యే సినిమా ఇది. కామెడీ జోనర్‌‌ను అన్ని ఏజ్‌ల వారు ఇష్టపడతారు. ఈ కామెడీ సినిమాలో ఓ ఇంట్రెస్టింగ్‌ ట్విస్ట్‌తో పాటు థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ ఉన్నాయి. ఇది డార్క్‌ కామెడీ జోనర్‌లోఉండే క్రైమ్‌ థ్రిల్లర్‌. కథ వినగానే నాకు కూడా యూనిక్‌ ఫీలింగ్‌ వచ్చింది. ఇందులో నేను ఉత్తర అనే పాత్రలో నటించాను. నిజం చెప్పాలంటే ఇప్పటి వరకు నన్ను నేను ఇలాంటి పాత్రలో చూసుకోలేదు. నన్ను కూడా ఎక్జయిట్ చేసిన పాత్ర ఇది. మంగపతి వంటి పవర్‌ఫుల్‌ పాత్ర చేసిన హీరోను డామినేట్‌ చేసే పాత్ర చేశానని గర్వంగా చెప్పగలను. అందుకు శివాజీ ఎంతగానో ఎంకరైజ్‌ చేశారు. ఆయనకు సినిమాపై ప్రేమ అప్పటికంటే ఇప్పుడు ఇంకా పెరిగింది. నేను, శివాజీ కలిసి నటించిన సన్నివేశాలు హిలేరియస్‌‌గా ఉంటాయి.

Also Read- Manoj and Mounika: మూడేళ్ల వివాహా బంధం.. నెక్ట్స్ స్టెప్ ఇదేనా?

ముందు థియేటర్స్‌లోనే అన్నారు

Advertisement

అసలైతే ఈ సినిమా అనుకున్నప్పుడు ముందు థియేటర్‌కే అనుకున్నాం. అనుకోకుండా మధ్యలో ఓటీటీలో స్ట్రీమింగ్‌ అన్నారు. నన్ను నేను పెద్ద స్క్రీన్‌లో చూసుకోవడం అలవాటు కాబట్టి, ఓటీటీ అనగానే నేను కూడా కొంచెం డిజప్పాయింట్‌ అయ్యాను. అదే టైమ్‌లో ఈ సినిమా చూసిన ప్రముఖులందరూ.. ఇది థియేటర్‌లో విడుదల చేసే సినిమా అని అనడంతో మళ్లీ థియేటర్‌కి మారింది. మా అమ్మాయి కూడా ఓటీటీలో సినిమా అనగానే ఎంతో బాధపడింది. నా సినిమాలను వెండితెరపై చూడాలనే తను ఎప్పుడు కోరుకుంటుంది. ఇప్పుడు థియేటర్‌ అనగానే ఎంతో ఆనందంగా ఉంది. సినిమా ట్రైలర్‌ అందరికి నచ్చింది. సినిమా కూడా చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులని సంతృప్తిపరిచే సినిమా ఇది.

Also Read- Actor Sivaji: కోకాపేట‌లో 18 ఎక‌రాలు… రియల్ ఎస్టేట్ లో భారీగా ఆస్తులు పోగు చేసిన శివాజీ!

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×