E-Paper
Advertisement

విశాఖలో కుప్పకూలిన రైల్వే బ్రిడ్జ్.. ఏడుగురికి గాయాలు!

విశాఖలో కుప్పకూలిన  రైల్వే బ్రిడ్జ్..  ఏడుగురికి గాయాలు!
Advertisement

Tungalam flyover accident: విశాఖపట్నం ఆటోనగర్ తుంగలం సమీపంలో నిర్మాణంలో ఉన్న రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ స్లాబ్ ఒక్కసారిగా కూలిపోవడంతో ఏడుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో స్లాబ్ పైన సుమారు 10 మంది కార్మికులు కాంక్రీట్ పనులు చేస్తుండగా, ఒక్కసారిగా బ్రిడ్జ్ కిందకు దిగిపోవడంతో ఈ ఘోరం చోటుచేసుకుంది. అదృష్టవశాత్తూ కార్మికులు అందరూ బ్రిడ్జ్ పైన ఉండి పని చేస్తుండటం వల్ల ప్రాణాపాయం తప్పింది. ఒకవేళ బ్రిడ్జ్ కింద ఎవరైనా ఉండి ఉంటే ప్రాణనష్టం భారీగా ఉండేదని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు.

ప్రమాదం జరిగిన వెంటనే సమీపంలోని గ్రౌండ్‌లో క్రికెట్ ఆడుతున్న సుమారు 20 నుండి 30 మంది యువకులు, రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులను బయటకు తీశారు. గాయపడిన వారందరినీ వెంటనే చికిత్స నిమిత్తం కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో ఏడుగురికి మల్టిపుల్ ఫ్రాక్చర్లు, స్పైన్ ఇంజరీస్ అయ్యాయని వైద్యులు వెల్లడించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన ఆరుగురిలో నలుగురు ఇప్పటికే డిస్చార్జ్ కాగా, మరో ముగ్గురు ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. బాధితులంతా బీహార్ ప్రాంతానికి చెందిన వలస కార్మికులుగా గుర్తించారు.

Advertisement

ఈ ప్రమాదానికి అధికారుల అలసత్వం, కాంట్రాక్టర్ల అజాగ్రత్తే ప్రధాన కారణమని స్థానికులు, రాజకీయ నాయకులు ఆరోపిస్తున్నారు. సుమారు 18 కోట్ల రూపాయల వ్యయంతో జీవీఎంసీ, ఏపీఐఐసీ ఆధ్వర్యంలో ఈ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతోంది. నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని, పాత ఐరన్ షీట్లు, నాణ్యత లేని సెంటరింగ్ మెటీరియల్ వాడటం వల్లే స్లాబ్ కుప్పకూలిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పనులు జరుగుతున్న సమయంలో అధికారుల పర్యవేక్షణ కానీ, క్వాలిటీ టెస్టింగ్ కానీ జరగలేదని స్థానిక నాయకులు విమర్శిస్తున్నారు.

ఘటనా స్థలాన్ని పరిశీలిస్తే, కాంక్రీట్ వేస్తున్న సమయంలో బేస్మెంట్ సపోర్ట్ సరిగ్గా లేకపోవడం వల్ల స్లాబ్ కుప్పకూలినట్లు ప్రాథమికంగా అర్థమవుతోంది. ప్రమాదం జరిగిన తర్వాత కూడా ఇప్పటివరకు ఏ ఒక్క జీవీఎంసీ అధికారి కానీ, కాంట్రాక్టర్ కానీ ఘటనా స్థలానికి రాకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి, బాధ్యులైన అధికారులపై మరియు కాంట్రాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు పూర్తయ్యాయి, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Read Also: సైబర్ నేరగాళ్లపై తెలంగాణ పోలీసుల ఉక్కుపాదం.. ఆపరేషన్ క్రాక్‌డౌన్ 2.0 ప్రారంభం!

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×