E-Paper
Advertisement

ఓటీటీ విడుదల తేదీలో మార్పులు..ముందుగానే వస్తున్న ది కేరళ స్టోరీ 2..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఓటీటీ విడుదల తేదీలో మార్పులు..ముందుగానే వస్తున్న ది కేరళ స్టోరీ 2..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Advertisement

The Kerala Story 2 OTT: బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఇటీవల సంచలనంగా మారిన సినిమాలలో ది కేరళ స్టోరీ 2(The Kerala Story 2) ఒకటి. గతంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న ది కేరళ స్టోరీ సినిమాకు సీక్వెల్ చిత్రంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డైరెక్టర్ కామాఖ్య నారాయణ సింగ్ ది కేరళ స్టోరీ 2 సినిమాని సరికొత్త కోణంలో తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ది కేరళ స్టోరీ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లను రాబట్టడంతో ఈ సినిమాపై కూడా మంచి అంచనాలే ఏర్పడ్డాయి కానీ ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది.

జీ 5 లో ది కేరళ స్టోరీ 2..

ఇలా థియేటర్లలో విడుదలై మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలోకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5(Zee 5) కైవసం చేసుకున్నారు. ఇటీవల ఈ సినిమా ఓటీటీ విడుదలకు సంబంధించి జీ 5 అధికారక ప్రకటన వెల్లడించిన సంగతి తెలిసిందే. మే 8వ తేదీ నుంచి ఈ సినిమా ఓటీటీలో ప్రసారం కానుందని తెలియజేశారు అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదల విషయంలో మార్పులు చేశారని తెలుస్తోంది. అనుకున్న తేదీ కంటే ఈ సినిమాని ముందుగానే డిజిటల్ స్ట్రీమింగ్ కు అందుబాటులోకి తీసుకురాబోతున్నారు.

ఓటీటీలోకి ముందుగా వస్తున్న ది కేరళ స్టోరీ 2

Advertisement

తాజాగా జీ 5 ఈ సినిమా కొత్త ఓటీటీ విడుదల తేదీని ప్రకటించారు ఈ సినిమా మే 8వ తేదీ కాకుండా మే ఒకటవ తేదీ నుంచి ప్రేక్షకులకు అందుబాటులోకి రాబోతున్నట్లు తెలియజేశారు. ఇలా థియేటర్లలో ఈ సినిమాని చూడటం మిస్ అయినవారు మే ఒకటవ తేదీ నుంచి జీ 5 లో చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఇక ఈ సినిమాలో అదితి భార్య, ఉల్కా గుప్తా, ఐశ్వర్య ఓజా ప్రధాన పాత్రలలో నటించారు. సన్ షైన్ పిక్చర్స్ బ్యానర్ పై విపుల్ షా ఈ సినిమాను నిర్మించారు. 2026 ఫిబ్రవరి27 వ తేదీ ఈ సినిమా థియేటర్లలో విడుదల అయింది.

మత మార్పిడిల నేపథ్యంలో..

Advertisement

ఇలా ఎన్నో అంచనాల నడుమ థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది మరి ఓటీటీలో అయినా ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో గ్లామర్ కంటే కూడా నటీనటుల పాత్రలు ఎంతో భావోద్వేగంగా కొనసాగుతాయని చెప్పాలి. ఈ సినిమా మొదటి భాగం మతమార్పిడుల చుట్టూ తిరిగితే సీక్వెల్ సినిమాలో మాత్రం కేరళతో పాటు రాజస్థాన్ మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో జరిగిన బలవంతపు మతమార్పిడిలా గురించి ఈ సినిమాలో చూపించారు. ముగ్గురు హిందు అమ్మాయిలు కుటుంబ సభ్యులను ఎదిరించి ముస్లిం అబ్బాయిలను పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత వారు ఎదుర్కొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Also Read: జీవితంలో అలాంటి రోజు రాకూడదు.. బిగ్గెస్ట్ రీగ్రేట్ అర్జున్ కళ్యాణ్ ఎమోషనల్!

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×