E-Paper
Advertisement

Nabha Natesh: సమ్మర్ టార్గెట్.. రెండు ప్రెస్టేజియస్ మూవీస్ తో నభానటేష్.. ఇవైనా గట్టెక్కిస్తాయా?

Nabha Natesh: సమ్మర్ టార్గెట్.. రెండు ప్రెస్టేజియస్ మూవీస్ తో నభానటేష్.. ఇవైనా గట్టెక్కిస్తాయా?
Advertisement

Nabha Natesh:ప్రముఖ యంగ్ బ్యూటీ నభా నటేష్ (Nabha Natesh) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. మోడల్ గా కెరియర్ మొదలుపెట్టిన ఈమె.. కన్నడ , తెలుగు చిత్రాలలో నటిస్తూ తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకుంది. 2015లో శివరాజు కుమార్ తో కలిసి కన్నడ మూవీ ‘వజ్రకాయ’ లో నటించి ఇండస్ట్రీకి పరిచయమైన నభా నటేష్ ‘నన్ను దోచుకుందువటే’ అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. మొదటి సినిమాతోనే పర్వాలేదనిపించుకున్న ఈమె.. ఆ తర్వాత ‘అదుగో’ అనే చిత్రంలో కూడా నటించింది ఇక పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా , నిధి అగర్వాల్ హీరోయిన్గా వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో మరో హీరోయిన్గా నటించి ఊహించని పాపులారిటీ సంపాదించుకుంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.

సమ్మర్ టార్గెట్ అంటున్న నభా నటేష్..

చివరిగా ‘డార్లింగ్’ అనే సినిమాలో హీరోయిన్గా నటించిన ఈమె.. ఆ తర్వాత యాక్సిడెంట్ కావడంతో దాదాపు సంవత్సరం పాటు ఇండస్ట్రీకి దూరమయింది. అలాంటి ఈమెకు ఈ సమ్మర్ ఎంతో స్పెషల్ గా ఉండబోతోంది. అందులో భాగంగానే ఈమె నటించిన రెండు భారీ పాన్ ఇండియా చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అందులో ఒకటి నిఖిల్ స్వయంభూ కాగా, మరొకటి నాగబంధం. భిన్నమైన కథ నేపథ్యాలతో వస్తున్న ఈ రెండు చిత్రాలలో రెండు విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించబోతోంది. నాగబంధం సినిమాలో పార్వతీ పాత్రతో ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమైన ఈమె.. స్వయంభూ సినిమాలో సుందరవల్లి అనే యువరాణి పాత్రలో నటిస్తోంది.

రెండు విభిన్నమైన పాత్రలతో..

Advertisement

ఈ రెండు సినిమాలతో సాలిడ్ లైనప్ చేస్తోందని చెప్పుకోవచ్చు. స్వయంభు, నాగబంధం చిత్రాల్లోని కంటెంట్ ఆడియన్స్ కి గనుక రీచ్ అయితే హీరోయిన్ గా మరో స్థాయికి వెళ్లడం ఖాయమని చెప్పవచ్చు. ఒకవేళ ఈ రెండు సినిమాలు గనుక మంచి విజయం అందుకున్నాయి అంటే ఈమెకు కచ్చితంగా ఇండస్ట్రీలో వరుస అవకాశాలు లభిస్తాయి. ఇకపోతే ఇప్పటికే ఈ రెండు చిత్రాల విజయాల పట్ల , తన పాత్రలకు రాబోయే రెస్పాన్స్ పట్ల ఈమె చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. పైగా స్వయంభు , నాగబంధం చిత్రాల టీజర్స్ కి కూడా మంచి రెస్పాన్స్ లభిస్తోంది.. ఇలా ఒక యంగ్ హీరోయిన్ నటించిన రెండు పాన్ ఇండియా చిత్రాలు సమ్మర్ టార్గెట్ గా రిలీజ్ కి వస్తూ ఉండడం విశేషంగా చెప్పుకోవచ్చు.

ALSO READ:Natural Star Nani : నానితో రొమాన్స్ కి సిద్ధమవుతున్న ప్రభాస్ బ్యూటీ.. త్వరలో అఫీషియల్!

సోషల్ మీడియా ద్వారా ప్రమోషన్ మొదలుపెట్టిన నభా..

Advertisement

ఇదిలా ఉండగా మరొకవైపు సోషల్ మీడియాలో అప్పుడే ఈ రెండు చిత్రాల ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టేసింది నభా నటేష్. ఒకవైపు తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే.. మరొకవైపు తన సినిమా పాత్రల గెటప్లలో రెడీ అవుతూ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. ముఖ్యంగా ఈ రెండు సినిమాలతో ఎలాగైనా సరే సక్సెస్ అందుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. మరి సమ్మర్ స్పెషల్ గా వస్తున్న ఈ రెండు చిత్రాలు ఈమెను ఏ విధంగా గట్టేక్కిస్తాయో చూడాలి.

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×