E-Paper
Advertisement

Donald Trump: ఏలియన్స్ సీక్రెట్ ఫైల్స్.. గుట్టు విప్పేస్తా, డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం

Donald Trump: ఏలియన్స్ సీక్రెట్ ఫైల్స్.. గుట్టు విప్పేస్తా, డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం
Advertisement

అమెరికా రక్షణ విభాగం వద్ద దశాబ్దాలుగా దాగి ఉన్న గ్రహాంతరవాసులు, గుర్తుతెలియని ఎగిరే వస్తువుల రహస్యాలను బహిర్గతం చేసేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమయ్యారు. గ్రహాంతర జీవనం, అంతరిక్షంలో జీవాలు ఉన్నాయా..? వంటి అంశాలకు సంబంధించిన ఫైల్స్ ను విడుదల చేసే ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని ఉన్నతాధికారులను ట్రంప్ ఆదేశించారు. ఈ మేరకు ట్రూత్ సోషల్ వేదికగా స్పందించిన ట్రంప్.. సెక్రటరీ ఆఫ్ వార్ తో పాటు ఇతర కీలక విభాగాల అధికారులు ఈ ఫైళ్లను గుర్తించి విచారణ చేయాలని సూచించారు. దేశ ప్రజల్లో ఈ అంశంపై విపరీతమైన ఆసక్తి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

ఒబామా వ్యాఖ్యలతో మొదలు…..

Advertisement

అసలు ఈ పరిణామం మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా చేసిన వ్యాఖ్యలతో మొదలైంది. ఇటీవల ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఒబామా.. ఏలియన్స్ ఉన్న మాట నిజమేనని.. అయితే తన పదవీ కాలంలో వాటి ఉనికికి సంబంధించి ప్రత్యక్ష ఆధారాలేవీ చూడలేదని వివరించి చెప్పారు. ఏరియా 51 వంటి రహస్య ప్రాంతాల్లో గ్రహాంతరవాసులను దాచిపెట్టారనే ప్రచారంలో వాస్తవం లేదని ఆయన కొట్టిపారేశారు. అయితే ఒబామా ఇలాంటి విషయాలను బహిరంగంగా చర్చించడాన్ని డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా తప్పుబట్టారు. ఇలాంటి సమాచారాన్ని లీక్ చేయడం ద్వారా ఒబామా పెద్ద తప్పు చేశారని ఆయన విమర్శించారు. ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో రిపోర్టర్లతో మాట్లాడిన సమయంలో ట్రంప్ ఈ విషయాన్ని ప్రస్తావించారు.

ఉత్కంఠను రేపుతున్న ట్రంప్ నిర్ణయం.. 

Advertisement

నిజంగా గ్రహాంతరవాసులు ఉన్నాయా..? అనే ప్రశ్నకు ట్రంప్ నేరుగా సమాధానం చెప్పలేదు. వ్యక్తిగతంగా తనకు ఖచ్చితమైన అభిప్రాయం లేకపోయినా.. ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారాన్ని మాత్రం ప్రజలకు అందుబాటులోకి తెస్తానని హామీ ఇచ్చారు. గతేడాది పెంటగాన్ విడుదల చేసిన నివేదికలో గ్రహాంతర సాంకేతికతకు సంబంధించి ఎటువంటి ఆధారాలు దొరకలేదని పేర్కొన్నప్పటికీ.. ట్రంప్ తాజా ఆదేశాలు కొత్త ఉత్కంఠను రేపుతున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆకాశంలో కనిపించిన వింత వస్తువులు సహజమైనవేనని గతంలో అధికారులు స్పష్టం చేసినప్పటికీ.. ట్రంప్ మాత్రం ఆ లోతైన రహస్యాలను బయటకు తీయాలని పట్టుబడుతున్నారు.

శాస్త్రవేత్తలు సైతం..?

అత్యంత సంక్లిష్టమైన, ఆసక్తికరమైన విషయాలతో కూడిన ఈ ఫైల్స్ బయటకు వస్తే అంతరిక్షంపై ఉన్న అనేక అపోహలు తొలగిపోయే అవకాశం ఉంది. శాస్త్రవేత్తలు సైతం ఈ పరిణామంపై ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రభుత్వ అధికారిక వైఖరిలో మార్పు రావడం వల్ల ఖగోళ వింతల వెనుక ఉన్న అసలు కారణాలు తెలిసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్ ఆదేశాల మేరకు ఏజెన్సీలు ఎంత త్వరగా ఈ సమాచారాన్ని బహిర్గతం చేస్తాయో వేచి చూడాలి మరీ…

ALSO READ: డొనాల్డ్ ట్రంప్ కే షాకిచ్చిన ఇండో అమెరికరన్ లాయర్.. 

Related News

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

నేపాల్ ఖాకీలకు విచిత్ర సవాల్.. వరదల్లో కొట్టుకెళ్లిన మనుషులతో పాటు.. బ్యాంక్ లాకర్ల కోసం వేట!

బాంబులు, డ్రోన్ల మోత మధ్య జరిగిన పెళ్లి.. యుద్ధ సమయంలో పెరుగుతున్న వివాహాల సంఖ్య

Big Stories

Advertisement
×