E-Paper
Advertisement

Natural Star Nani : నానితో రొమాన్స్ కి సిద్ధమవుతున్న ప్రభాస్ బ్యూటీ.. త్వరలో అఫీషియల్!

Natural Star Nani : నానితో రొమాన్స్ కి సిద్ధమవుతున్న ప్రభాస్ బ్యూటీ.. త్వరలో అఫీషియల్!
Advertisement

Natural Star Nani : చిత్ర సీమలోకి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి స్వతంత్ర శ్రమతో నేడు స్టార్ హీరోగా పేరు దక్కించుకున్నారు నాచురల్ స్టార్ హీరో నాని(Nani ). ఒకవైపు నటుడిగా కొనసాగుతూనే.. మరొకవైపు నిర్మాతగా కంటెంట్ బేస్డ్ చిత్రాలను నిర్మిస్తూ సక్సెస్ అయ్యారు. ఇదిలా ఉండగా తాజాగా నాని నటిస్తున్న చిత్రం ది ప్యారడైజ్.. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల ( Srikanth Odala)దర్శకత్వం వహిస్తున్నారు.

భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా ఆగస్టు 21 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది. నిజానికి మార్చిలోనే విడుదల కావాల్సిన ఈ చిత్రం కొన్ని కారణాలవల్ల వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈ చిత్రానికి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఎస్ఎల్వీ సినిమాస్ పతాకం పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో మోహన్ బాబు కీలకపాత్ర పోషిస్తుండగా.. కయాదు లోహర్ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే రాఘవ్ జుయల్ మోహన్ బాబుతో కలిసి విలనిజాన్ని పండించడానికి సిద్ధం అయ్యారు.

హిట్ 3: ది థర్డ్ కేస్ నుంచీ క్రేజీ అప్డేట్..

Advertisement

ఇకపోతే ఒకవైపు ఈ సినిమా షూటింగ్లో బిజీగా ఉండగానే.. మరొకవైపు నాని హిట్ డైరెక్టర్ శైలేష్ కొలను (Sailesh kolanu) తో ఒక సినిమా చేయబోతున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. హిట్ సినిమాకి నిర్మాతగా నాని వ్యవహరించగా.. ఈ చిత్రం ద్వారానే శైలేష్ కొలను దర్శకుడుగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈ నేపథ్యంలోనే నానితో సినిమా చేస్తానని గతంలోనే చెప్పిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ది ప్యారడైజ్ చిత్రం తర్వాత శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ ఫ్రాంచైజీ లో భాగంగా హిట్ 2 క్లైమాక్స్ లో కనిపించిన నాని.. ఇప్పుడు హిట్ 3లో నటిస్తున్నారు.

ప్రభాస్ హీరోయిన్ తో సంప్రదింపులు..

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో నాని సరసన ప్రభాస్ (Prabhas) బ్యూటీ నటించబోతోంది అని తెలుస్తోంది. విషయంలోకి వెళ్తే.. సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy vanga) దర్శకత్వంలో వచ్చిన ‘యానిమల్’ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ హోదా దక్కించుకున్న యంగ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి(Tripti dimri).. ఇప్పుడు మళ్లీ సందీప్ దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న ‘స్పిరిట్’ సినిమాలో కూడా అవకాశం అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు శైలేష్ కొలను దర్శకత్వంలో వస్తున్న హిట్ :ది థర్డ్ కేసు చిత్రంలో నానితో రొమాన్స్ చేయడానికి ఈమెను తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారట.

Advertisement

ALSO READ:Vishnu Vinyasam: విడుదలకు ముందే లాభాల దిశగా విష్ణు విన్యాసం.. బడ్జెట్ ఎంత? లాభం ఎన్ని కోట్లు?

త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్..

అందులో భాగంగానే కథా చర్చలు కూడా జరుపుతున్నట్లు సమాచారం. ఇక మరొకవైపు ఈ సినిమాలో త్రిప్తితో పాటు ప్రముఖ నటి మాధురీ దీక్షిత్ ని కూడా కీలక పాత్ర కోసం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇక త్వరలోనే ఈ రెండు పాత్రలకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇవ్వనున్నట్లు సమాచారం.. ఒకవేళ ఇదే గనుక నిజమైతే ఒక ఫ్రెష్ జోడి ఐకానిక్ ప్రెజెన్స్ తెరపై కనిపించనుంది అని చెప్పడంలో సందేహం లేదు.

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×