E-Paper
Advertisement

Actress nupur sanon: ప్రియుడిని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. వీడియో వైరల్!

Actress nupur sanon: ప్రియుడిని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. వీడియో వైరల్!
Advertisement

Actress nupur sanon: ఇటీవల కాలంలో ఎంతోమంది సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. గదా ఏడాది పలువురు హీరో హీరోయిన్లు పెళ్లి చేసుకున్నారు. అలాగే కొంతమంది గతేడాది నిశ్చితార్థం జరుపుకొని, ఈ ఏడాది పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమయ్యారు. ఇకపోతే తాజాగా టాలీవుడ్ హీరోయిన్ తన ప్రియుడిని పెళ్లి చేసుకున్నటువంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొత్త సంవత్సరంలో పెళ్లి పీటలు ఎక్కిన ఆ ముద్దుగుమ్మ ఎవరు అనే విషయాన్నికి వస్తే..

ఉదయపూర్ లో వివాహం..

పలు ఆల్బమ్స్ ద్వారా యూత్ లో ఎంతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న నటి నుపుర్ సనన్ (nupur sanon)గత కొద్ది రోజుల క్రితం తన ప్రియుడుతో నిశ్చితార్థం జరుపుకున్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన సంగతి తెలిసిందే .అయితే పెళ్లి చేసుకొని పెళ్లికి సంబంధించిన వీడియోని షేర్ చేశారు. గత కొంతకాలంగా సింగర్ స్టెబిన్ బెన్(stebin Ben) తో రిలేషన్ లో ఉన్న నుపుర్ ఈ విషయాన్ని రహస్యంగా ఉంచుతూ తన ప్రియుడుతో నిశ్చితార్థం జరుపుకున్న అనంతరం తనని అందరికీ పరిచయం చేశారు. నిశ్చితార్థం తర్వాత పెద్దగా గ్యాప్ తీసుకోకుండా వీరిద్దరూ రాజస్థాన్లోని ఉదయపూర్ లో సాంప్రదాయ బద్ధంగా వివాహం జరుపుకున్నారని తెలుస్తోంది.

సాంప్రదాయబద్ధంగా నుపుర్ స్టెబిన్ బెన్ వివాహం..

Advertisement

తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పెళ్లి వేడుకలో వీరిద్దరూ సాంప్రదాయం దుస్తులను ధరించి అతిథులు కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం జరుపుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేయడమే కాకుండా, ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ఈమె ప్రముఖ బాలీవుడ్ నటి కృతి సనన్ కు సోదరి అనే విషయం అందరికీ తెలిసిందే.

?utm_source=ig_web_button_share_sheet

Advertisement

ఈమె పలు మ్యూజిక్ ఆల్బమ్స్ తో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్న అనంతరం హీరోయిన్ గా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నాలు చేశారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించిన ఈమె తెలుగులో కూడా రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమా తెలుగులో అనుకున్న స్థాయిలో ప్రేక్షకాదరణ పొందలేకపోయింది. ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోయినప్పటికీ ఈమె నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇలా చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా ఎంతో బిజీగా గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ వ్యక్తిగత జీవితంలో కూడా కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిందని తెలుస్తోంది. ఇలా కొత్త ఏడాది కొత్త జీవితంలోకి నుపుర్ అడుగుపెట్టడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Kalyan Padala: కొత్త ప్రయాణం ప్రారంభం..గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల..

Related News

కన్నీటి పర్యంతమవుతున్న మహారాజా హీరోయిన్.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

Big Stories

Advertisement
×