E-Paper
Advertisement

Sankranti 2026: ఉద్యోగం కోసం నగరానికి.. ఉత్సాహం కోసం ఊరికి.. సంక్రాంతికి ప్రజలు తమ సొంత గ్రామాలకే ఎందుకొస్తారు?

Sankranti 2026: ఉద్యోగం కోసం నగరానికి.. ఉత్సాహం కోసం ఊరికి.. సంక్రాంతికి ప్రజలు తమ సొంత గ్రామాలకే ఎందుకొస్తారు?
Advertisement

Sankranti 2026: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగకు ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా గ్రామాల్లో సంక్రాంతికి ప్రత్యేకమైన స్థానం ఉంది. సంక్రాంతి అనేది కేవలం పండగ మాత్రమే కాదు.. ఇదొక ఎమోషన్. అలాగే రైతు జీవనానికి, ప్రకృతికి, కుటుంబ అనుబంధాలకు ప్రతీకగా నిలిచిన సంబరం. సంక్రాంతి పండగ వస్తుందంటే.. ముందుగానే నగరాల్లో ఉద్యోగాలు చేసే యవత పల్లెబాట పడతారు. దీనికోసం ముందస్తు బస్సు, రైలు రిజర్వేషన్లు కూడా చేసుకుంటారు. పండగ సందడి అంతా అయిపోయాక మళ్లీ పట్నం బాటపడతారు. ఈ నేపథ్యంలో ప్రజలు తమ సొంత గ్రామాల్లోనే సంక్రాంతిని జరుపుకోవడానికి గల కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

రైతుల పండగ సంక్రాంతి:

పల్లె జీవితం పూర్తిగా పచ్చని పంట పొలాలు, ఆహ్లాదకరమైన వాతావరణం, వ్యవసాయంపై ఆధారపడి ఉంటుంది. జనవరి నెలలో ఖరీఫ్ పంట చేతికి వచ్చిన తర్వాత రైతులు ఆనందంగా జరుపుకునే పండుగే సంక్రాంతి. నెలల తరబడి కష్టపడి పండించిన పంట ఇంట్లోకి రావడంతో రైతన్నలు ఎంతో సంబరపడిపోతుంటారు. ఈ పండగ మాత్రమే రైతులకు సంతృప్తిని ఇవ్వగలదు. ఆ ఆనందాన్ని ప్రకృతితో, కుటుంబ సభ్యులతో పంచుకోవడమే సంక్రాంతి పండుగ అసలైన ఉద్దేశ్యం.

Advertisement

Also Read: మకర సంక్రాంతికి గాలిపటాలకు ఉన్న అనుబంధం ఏమిటి? దీని వెనుకున్న అసలు కథ ఇదే!

గ్రామాల్లోనే ఎందుకు?

సంక్రాంతి సమయంలో సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు. తెలుగు పురాణాల ప్రకారం.. ఈ మార్పును శుభారంభంగా భావిస్తారు. సూర్యుడు, భూమి, వర్షాలు, పశువులు.. ఇవన్నీ కలిసి పంట పండేందుకు సహకరిస్తాయి. అందుకే గ్రామాల్లో సూర్యుడికి, పశువులకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఇక కనుమ రోజు అయితే పశువులను అలంకరించి పూజించడం కూడా ఈ కృతజ్ఞత భావానికి ప్రతీక.

పండగ ఉద్దేశం అదే:

Advertisement

గ్రామాల్లో సంక్రాంతి పండగ అంటే.. కేవలం పూజలు మాత్రమే కాదు.. బంధువులు అందరూ ఒకచోట చేరడం, ఆనందంతో కలిసికట్టుగా పండగ జరుపుకోవడం. అందుకే పట్టణాలకు వెళ్లిన వారు ఏ పండగకు రాకపోయినా.. సంక్రాంతికి మాత్రం స్వగ్రామాలకు తిరిగివస్తారు. ఈ క్రమంలో అందరూ కలిసి భోజనాలు చేయడం, ఆటలు ఆడటం, గాలిపటాలు ఎగరేయడం వంటి ఆనందాలు గ్రామాల్లో మాత్రమే దొరికే అదృష్టం.

సంస్కృతిని నిలబెట్టే పండగ:

ఇకపోతే సంక్రాంతి గ్రామీణ సంస్కృతిని నిలబెట్టే పండుగ కూడా. హరిదాసుల పాటలు, ముగ్గుల పోటీలు, సంప్రదాయ వంటలు, జానపద ఆటలు.. ఇలా అన్నిరకాల సంప్రదాయాలను పాటించే ఓ ముఖ్యమైన పండగ ఇది. ఈ సందడంతా గ్రామాల్లోనే పూర్తిగా కనిపిస్తాయి. అందుకే గ్రామాల్లో సంక్రాంతి ఒకరోజు పండుగ కాదు.. రైతు శ్రమకు ఫలితం, ప్రకృతికి కృతజ్ఞత, కుటుంబానికి దగ్గర చేసే ఒక మహోత్సవం అని అంటారు.

Also Read: హైదరాబాద్‌లో ఫ్యాన్సీ గాలిపటాలకు ఎందుకంత క్రేజ్? దీని వెనుకున్న వందల ఏళ్ల చరిత్ర తెలుసా?

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×