E-Paper
Advertisement

రూ .1000 కోట్ల కల.. జైలర్ 2తో కోలీవుడ్ చరిత్ర సృష్టిస్తుందా?

రూ .1000 కోట్ల కల.. జైలర్ 2తో కోలీవుడ్ చరిత్ర సృష్టిస్తుందా?
Advertisement

Jailer 2:వెయ్యి కోట్లు …ఈ బెంచ్ మార్క్ కోలీవుడ్ కి ఇప్పటి వరకి ఒక తీరని కలగానే మిగిలిపోయింది.తెలుగు,హిందీ సినిమాలు అలవోకగా ఈ రికార్డ్ ని బీట్ చేస్తుంటే తమిళ ఇండస్ట్రీ మాత్రం ఆ టార్గెట్ ని అందుకోవడానికి ఆపసోపాలు పడుతుంది.ఇక అసలు వంద కోట్లనైనా చూస్తుందా అని అనుకున్న సాండల్ వుడ్ కూడా kgf 2 తో ఏకంగా వెయ్యి కోట్ల మార్కుని టచ్ చేయడంతో ఇక కోలీవుడ్ ఎప్పుడు ఆ మార్క్ ని మీట్ అవుతుందా అంటూ కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు తమిళ తంబిలు.

తమిళ సినిమాలైన ‘కంగువా’, రజనీకాంత్ నటించిన ‘కూలీ’, ‘పొన్నియిన్ సెల్వన్’ వంటి సినిమాలు ఏమైనా వెయ్యి కోట్ల మార్కుని టచ్ చేస్తాయా అని ఆశపడ్డారు కాని అది అత్యాశే అయ్యింది.దీంతో ఇపుడు అందరి కళ్ళు తలైవా హీరోగా వస్తున్న నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో వచ్చిన ’జైలర్ 2 పైనే పెట్టుకున్నారు.కారణం మొదటి భాగంగా వచ్చిన జైలర్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా 600 కోట్లు వసూలు చేయడం ,పైగా సీక్వెల్ భారీ అంచనాలతో వస్తుండటంతో ఈ జైలర్ గారు ఏమైనా మా ఆశలు నెరవేరుస్తారా అని ఆశ పడ్డారంతా .

Advertisement

ఇక ఈ సినిమా ఎట్టకేలకి ఈరోజు థియేటర్ లలో రిలీజ్ కావడంతో కోలీవుడ్ వెయ్యి కోట్లని చూస్తుందా అనే చర్చ మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఇక రిలీజ్ అయిన సినిమా బాగుంది అన్న మౌత్ టాక్ స్ప్రెడ్ అవడంతో మరోసారి ఆశలు చిగురించాయి .సినిమాలో తలైవా ఆడియన్స్ ని ఆకట్టుకునేలా మాస్ యాక్షన్, కామెడీ పండించడం,మొదటి భాగంలో రజనీకాంత్ తనదైన స్టైల్, యాక్షన్‌తో ప్రేక్షకులను ఏ రేంజ్‌లో అలరించారో, రెండో భాగంలోనూ అదే మ్యాజిక్‌ను రిపీట్ చేయడం, ముఖ్యంగా ఆయన స్టైల్‌లో వచ్చే ఎలివేషన్ సీన్లు ప్రేక్షకుల్లో జోష్ నింపడంతో సినిమా బాక్సాఫీస్ వద్ద భారీగానే వసూల్లని కొల్లగొట్టే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తుంది.

ముఖ్యంగా అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ,నెల్సన్ మార్క్ డార్క్ కామెడీ, ఊహించని ట్విస్ట్ లు, పవర్‌ఫుల్ యాక్షన్ ఎపిసోడ్లు సినిమాకు మెయిన్ ఎసెట్ గా నిలిచాయన్న టాక్ వినిపిస్తుంది. దీంతో ఎన్నేళ్ళ గానో కలలాగా ఉండిపోయిన వెయ్యి కోట్ల క్లబ్ లోకి కోలీవుడ్ చేరడం పెద్ద కష్టమేమి కాదన్న టాక్ సోషల్ మీడియాలో కాస్త గట్టిగానే వినిపిస్తుంది.

Advertisement

అయితే మొదటి రోజే టాక్ బాగున్నంత మాత్రాన వెయ్యి కోట్ల వసూళ్లు వచ్చేస్తాయా అంటే అనుమానమే.యునానిమస్ గా అందరికి నచ్చి సినిమా బాగుందన్న టాక్ మరింత స్ప్రెడ్ అయితే ఏమైనా ఆ దరిదాపుల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది.అలా కాకుండా రెండు గడిస్తే పాజిటివ్ టాక్ కాస్తా మిక్స్డ్ టాక్ మారితే ఈ సినిమా కూడా 6, 7 వందల కోట్ల దగ్గరే ఆగిపోవడం పక్కా ,చూడాలి మరి వచ్చే రోజుల్లో జైలర్ 2 తమిళ తంబీల ఆశలు ఏమైనా నేరవేరుస్తుందేమో !

ALSO READ :ఫోక్ సింగర్ మధుప్రియ ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

Tags

Related News

నాట్స్ న్యూజెర్సీ చాప్టర్ లీడర్‌గా సాయి గంగుల నియామకం..

మళ్లీ ఆ స్థానానికి వెళ్లలేవు.. త్రివిక్రమ్ పై పూనమ్ కౌర్ పోస్ట్!

రజినీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. జైలర్ 3 పై అఫీషియల్ అప్డేట్!

భార్య అంటే ఉచితంగా వచ్చే పనిమనిషా?- అనుపమ కామెంట్స్ వైరల్!

తన జీవిత గాథ అలానే ముగియాలి..తన బయోపిక్ మూవీ పై సల్మాన్ ఖాన్ కామెంట్స్!

సాయి దుర్గ తేజ్ బర్తడే స్పెషల్.. అమ్మవారి మొక్క నాటిన నాగబాబు!

బోల్డ్ ఫోటోషూట్ తో రచ్చ చేస్తున్న అక్కినేని కోడలు.. టార్గెట్ చేసిన సమంత ఫ్యాన్స్!

Big Stories

Advertisement
×