Jailer 3 Movie: సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవల వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. తాజాగా రజనీకాంత్ (Rajinikanth) నటించిన జైలర్ 2(Jailer 2) సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సాధారణంగా రజనీకాంత్ సినీ కెరియర్లో సీక్వెల్ సినిమాలకు చాలా దూరంగా ఉంటారు ఈయన రోబో సినిమా సీక్వెల్ తరువాత ఇప్పుడు జైలర్ 2 ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నెల్సన్ దిలీప్ కుమార్(Nelson Dilip Kumar) డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా నేడు విడుదల అయ్యి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.
ఈ నేపథ్యంలోనే జైలర్ 3 సినిమాకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే జైలర్ 2 సినిమా క్లైమాక్స్ లో జైలర్ 3 కూడా రాబోతుందని వెల్లడించడంతో రజినీకాంత్ అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోసారి నెల్సన్ దిలీప్ కుమార్ రజనీకాంత్ వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. సీక్వెల్ సినిమాలు అంటేనే ఏమాత్రం ఇష్టపడని రజనీకాంత్ ఇప్పుడు ఏకంగా ఒక సినిమాకు మూడో భాగాన్ని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు అంటేనే జైలర్ 3 కథ ఏ రేంజ్ లో ఉండబోతుందో స్పష్టం అవుతుంది.
రజనీకాంత్ సీక్వెల్ సినిమాలు చేయడానికి ఇష్టపడనని అందుకు గల కారణాలను కూడా ఇటీవల వెల్లడించారు. మొదటి భాగం సక్సెస్ అయితే రెండో భాగంలో అదే కథకు కొన్ని హంగులు జోడించి సినిమాని చేస్తారు అందుకే నాకు సీక్వెల్ సినిమాలు చేయడం ఇష్టం ఉండదని, గతంలో ఈ కారణంతోనే భాషా సీక్వెల్ సినిమాని కూడా రిజెక్ట్ చేసుకున్నానని ఇటీవల ఓ సందర్భంలో రజనీకాంత్ తెలియజేశారు. కానీ జైలర్ 2 సినిమా కథ విభిన్నంగా ఉన్న నేపథ్యంలోనే ఈ సీక్వెల్ చేశానని రజనీకాంత్ తెలిపారు. ఇక ఇప్పుడు మూడో భాగం కూడా రాబోతుందని తెలియజేయడంతో ఈ సినిమా స్టోరీపై అంచనాలు పెరిగిపోతున్నాయి.
ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించగా, సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మించగా అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించారు. ఇక ప్రస్తుతం రజనీకాంత్ సినిమాల విషయానికి వస్తే ఈయన ధర్మన్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇందులో రాశిఖన్నా హీరోయిన్ గా నటించగా టాలీవుడ్ హీరో రామ్ పోతినేని కీలకపాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి అశ్వత్ మారి ముత్తు దర్శకత్వం వహించగా కమల్ హాసన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులలో చిత్ర బృందం ఎంతో బిజీగా గడుపుతున్నారు.