E-Paper
Advertisement

Poonam kaur: ‘మత మార్పిడిలకు బ్రాండ్ అంబాసిడర్ ‘ ..పవన్ పై పూనమ్ ఫైర్

Poonam kaur: ‘మత మార్పిడిలకు బ్రాండ్ అంబాసిడర్ ‘ ..పవన్ పై పూనమ్ ఫైర్

Poonam kaur: టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)సినిమాల పరంగా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం సినిమాలను కాస్త తగ్గించిన పవన్ కళ్యాణ్  ఇదివరకు కమిట్ అయిన సినిమాల షూటింగ్లను పూర్తి చేశారు. ఇక ప్రస్తుతం కొత్త సినిమాలకు కూడా కమిట్ అవుతూ షూటింగ్ పనులలో బిజీ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం కావటం వల్ల పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టి సారించారు. తనకు వీలైనప్పుడు మాత్రమే సినిమా షూటింగ్లలో పాల్గొంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు . ఇక పవన్ కళ్యాణ్ తన రాజకీయ కార్యకలాపాలలో భాగంగా ఇటీవలమహారాష్ట్రలో నాందేడ్‌లో నిర్వహించిన గురు తేగ్ బహదూర్ షాహిది సమాగమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.

పవన్ పై పూనమ్ విమర్శలు..

ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజినోవా(Anna Lezhneva)తో కలిసి వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వేడుకలో భాగంగా పవన్ కళ్యాణ్ తలపాగా కట్టుకొని అక్కడి సంస్కృతికి అనుగుణంగా ఆయన వెళ్లారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఈయన లుక్ పై స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో వివాదాస్పద నటిగా పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న నటి పూనమ్ కౌర్ ఈ విషయంపై స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ సంచలనగా మారింది.

క్యాథలిక్ క్రైస్తవంలోకి మార్చిన వ్యక్తి..

పవన్ కళ్యాణ్ అంటే మొదటి నుంచి కూడా తీవ్రస్థాయిలో విమర్శలు కురిపించే ఈమె తాజాగా పవన్ తన భార్యతో కలిసి గురు తేగ్ బహదూర్ సమాగంలో పాల్గొనడం పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన అధికారక ఎక్స్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ తీవ్రస్థాయిలో పవన్ పై విమర్శలు కురిపించారు. పవన్ కళ్యాణ్ ను మతమార్పిడులకు బ్రాండ్ అంబాసిడర్ గా ఈమె పేర్కొన్నారు.పవన్ కళ్యాణ్ తన వారసత్వాన్ని క్యాథలిక్ క్రైస్తవంలోకి మార్చిన వ్యక్తి, గురుతేగ్ బహుదూర్ జినీ ప్రార్థించవలసిన చివరి వ్యక్తి అంటూ పవన్ కళ్యాణ్ తీరుపై విమర్శలు కురిపిస్తూ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఇలా పవన్ కళ్యాణ్ పై ఈమె చేసిన పోస్ట్ పట్ల విభిన్న రీతిలో కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.

పూనమ్ కౌర్ పవన్ కళ్యాణ్ , త్రివిక్రమ్ శ్రీనివాస్ పై నిత్యం ఇలాంటి వివాదాస్పద పోస్టులు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. పూనమ్ సినిమాలు చేసి మంచి సక్సెస్ అందుకోవడం కంటే కూడా వివాదాస్పద పోస్టులతో వార్తల్లో నిలుస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికి వస్తే ఇటీవల ఓజి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ త్వరలోనే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ద్వారా రాబోతున్నారు.

Also Read: Jr.NTR -Sri Bharat: ఎన్టీఆర్ పై శ్రీ భరత్ కామెంట్స్.. నేను చాలా స్ఫూర్తి పొందానంటూ!

Related News

అభిమానిపై ‘రాకింగ్ స్టార్’ రియల్ ప్రేమా.. క్యాన్సర్ బాధితుడికి వీడియో కాల్ చేసిన యష్!

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ స్టార్ట్.. సమంత, వరుణ్ తేజ్ రివ్యూస్ వైరల్.. ‘మెగా 158’ టీమ్ స్పెషల్ విష్

పెద్ది’ రిలీజ్ వేళ రచ్చ.. రామ్ చరణ్ విగ్రహంపై దారుణంగా ట్రోల్స్, క్షమాపణలు చెప్పిన ఫ్యాన్స్!

ఇది కదా క్యారెక్టర్ డెడికేషన్ అంటే! ‘పెద్ది’ గెటప్‌లో రోడ్లపై తిరిగిన జగ్గూభాయ్..

Big Stories

×