E-Paper
Advertisement

Actress Poorna: మరోసారి తల్లి కాబోతున్న నటి పూర్ణ.. బేబీ బంప్‌ ఫోటోలు వైరల్‌

Actress Poorna: మరోసారి తల్లి కాబోతున్న నటి పూర్ణ.. బేబీ బంప్‌ ఫోటోలు వైరల్‌
Advertisement

Actress Poorna: నటి పూర్ణ అలియాస్‌ షమ్నా కాసిమ్‌ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌ చెప్పింది. తాను మరోసారి తల్లి కాబోతున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు సోషల్‌ మీడియాలో బేబీ బంప్‌ ఫోటోలు షేర్‌ చేసి సర్‌ప్రైజ్ చేసింది. నటి పూర్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మలయాళి అయిన పూర్ణ తెలుగులో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అవును, సీమ టపాకాయ్‌ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన ఆమె తీస్ మార్‌ ఖాన్‌, అఖండ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించింది. 

హీరోయిన్, డ్యాన్స్ షోలకు జడ్జీగా

Advertisement

ఆ తర్వాత పలు టీవీ షోలకు జడ్జీగా చేసిన పూర్ణ 2022లో దుబాయికి చెందిన షనిద్ ఆసిఫ్ అనే బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకుంది. కొడుకు పుట్టడంతో కొన్నాళ్ల పాటు గ్యాప్ తీసుకుంది. రీసెంట్‌గా ‘గుంటూరు కారం’లో కుర్చీ మడతపెట్టి పాటతో నటిగా రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆడపదడప సినిమాలు చేస్తున్న పూర్ణ తరచూ తన భర్త, కొడుకు సంబంధించిన ఫోటోలు షేర్‌ చేస్తుంటుంది. ముఖ్యంగా తన కుమారుడు వీడియోలు, అతడి ముచ్చట్లను షేర్‌ చేస్తూ మురిసిపోతుంది. 

అది జరగబోతుంది..

అయితే ఈ మధ్య కాస్తా సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటున్న పూర్ణ తాజాగా తన ఫ్యాన్స్‌ ఫాలోవర్స్‌కి గుడ్‌న్యూస్‌ చెప్పింది. తాను మళ్లీ ప్రెగ్నెంట్‌ అని, ఆగష్టులో తన రెండో బేబీకి స్వాగతం పలకబోతున్నమంటూ శుభవార్తను పంచుకుంది. ఈ మేరకు తన బేబీ బంప్‌ ఫోటోలు షేర్ చేస్తూ అందరిలో సస్పెన్స్‌ క్రియేట్ చేసింది. “అది జరగబోతోంది, ఎందుకంటే నేను దాన్ని జరిగేలా చేయబోతున్నాను కాబట్టి” అంటూ పరోక్షంగా తన ప్రెగ్నెన్సీని ప్రకటించింది. దీంతో ఆమెకు ఫ్యాన్స్, ఫాలోవర్స్‌ నుంచి శుభకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఇదిలా ఉంటే పూర్ణ క్లాసికల్ డ్యాన్సర్ కూడా అనే విషయం తెలిసిందే.

Advertisement

క్లాసికల్ డ్యాన్సర్ గా..

పూర్ణ అసలు పేరు షమ్నా కాసిం. చిన్నప్పుడే క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంది. అలా మలయాళంలో సూపర్ డ్యాన్సర్ అనే పోటీలో పాల్గొని గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత నటి అయిపోవడంతో మళ్లీ స్టేజీ ఫెర్ఫార్మెన్స్‌లు ఇచ్చే అవకాశం రాలేదు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత స్టేజీపై నృత్య ప్రదర్శన చేసిన తర్వాత భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయింది. భర్త గురించి చెబుతూ పూర్ణ ఎమోషనల్ అయిపోయింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

Also Read: Allu Arjun-Trivikram: ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ క్యాన్సిల్‌.. మళ్లీ అల్లు అర్జున్‌కి వెళ్లిన ‘గాడ్‌ ఆఫ్ వార్‌’!

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×