E-Paper
Advertisement

Khammam town: సారీ అమ్మా.. నీ కంటే ముందే వెళ్తున్నా, కన్నీళ్లు పెట్టిస్తున్న యువతి ఆఖరి లేఖ!

Khammam town: సారీ అమ్మా.. నీ కంటే ముందే వెళ్తున్నా, కన్నీళ్లు పెట్టిస్తున్న యువతి ఆఖరి లేఖ!
Advertisement

Khammam town: ఖమ్మం పట్టణంలోని కవిరాజునగర్ ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. జీవితంలో ఎదురైన కష్టాలను తట్టుకోలేక, ఒంటరితనాన్ని భరించలేక బట్ల సృజన అనే డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. నిండు నూరేళ్ల భవిష్యత్తు ఉన్న యువతి ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది.

అయితే సృజన కుటుంబం గత కొన్నేళ్లుగా వరుస కష్టాలను ఎదుర్కొంటోంది. సుమారు ఏడేళ్ల క్రితం సృజన తండ్రి కనకరాజు మరణించడంతో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. అప్పటి నుండి తల్లి మేరీ పద్మ తన కుమార్తెను ఎంతో అల్లారుముద్దుగా పెంచుతూ వస్తోంది. అయితే, ఇటీవల మేరీ పద్మ అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటంతో సృజన తీవ్ర మానసిక ఆందోళనకు గురైంది.

Advertisement

తల్లి ఆరోగ్యం క్షీణించడం, ఇంట్లో తోడు లేకపోవడంతో సృజన తీవ్ర మనస్తాపానికి లోనైంది. “తల్లి లేని జీవితం తాను ఊహించుకోలేను” అనే భయం ఆమెను కుంగదీసింది. ఈ క్రమంలోనే ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె బలవన్మరణానికి పాల్పడింది. చనిపోయే ముందు ఆమె రాసిన మాటలు ప్రతి ఒక్కరినీ కన్నీరు పెట్టిస్తున్నాయి.

సృజన మరణానికి ముందు తన భావాలను ఎంతో ఉద్వేగభరితంగా వ్యక్తం చేసింది. చిన్నప్పుడు తన తల్లితో కలిసి దిగిన ఒక ఫోటోపై “ఐ యామ్ సారీ అమ్మా.. నీకంటే ముందే వెళ్తున్నా” అని రాసి తన ఆవేదనను చాటుకుంది. తనను ప్రాణంగా ప్రేమించిన తల్లిని వదిలి వెళ్తున్నందుకు క్షమాపణలు కోరుతూ ఆమె తీసుకున్న ఈ నిర్ణయం ఆ ఫోటోను చూసిన వారందరినీ కలిచివేస్తోంది.

Advertisement

Also Read: తేడాలొస్తే.. తాట తీస్తార్రోయ్.! ఏపీలో యూపీ మోడల్ పోలీస్ ట్రీట్‌మెంట్

కేవలం తల్లికే కాకుండా, కష్టకాలంలో తనకు అండగా నిలిచిన స్నేహితురాలికి కూడా సృజన చివరి సందేశం పంపింది. “నాకు తోడుగా ఉన్నావు.. థాంక్యూ” అంటూ తన ఫ్రెండ్‌కు మెసేజ్ పంపి తన కృతజ్ఞతను చాటుకుంది. తండ్రి లేని లోటు, తల్లి అనారోగ్యం వెరసి ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు సృజన మనస్తాపానికి లోనై ఆత్మహత్య చేసుకుందా? లేదా మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×