E-Paper
Advertisement

Actress Poorna: మళ్లీ తల్లి కాబోతున్న హీరోయిన్ పూర్ణ.. బేబీ బంప్ ఫోటోలు వైరల్!

Actress Poorna: మళ్లీ తల్లి కాబోతున్న హీరోయిన్ పూర్ణ.. బేబీ బంప్ ఫోటోలు వైరల్!
Advertisement

Actress Poorna:ఇటీవల కాలంలో సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆనందమైనా.. దుఃఖమైనా.. సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మళ్లీ తల్లి కాబోతున్నాను అంటూ ఒక స్టార్ హీరోయిన్ తన బేబీ బంప్ ఫోటోషూట్ ను ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. ఈ విషయం తెలిసి అటు సెలబ్రిటీలు, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ ఆమెకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఆమె ఎవరో కాదు తన అందంతో, నటనతో ఊహించని ఇమేజ్ సొంతం చేసుకున్న షామ్నా కాసిం అలియాస్ పూర్ణ (Poorna).

వైవాహిక జీవితంలో సంతోషంగా..

అందం, అభినయంతో పలువురు స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఈమె మలయాళం, తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో ఎన్నో సినిమాలు చేసింది. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు ఢీ వంటి షోలలో జడ్జ్ గా కూడా వ్యవహరించి.. ఇటు బుల్లితెర ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. టీవీ షోలు , స్టేజ్ ప్రోగ్రాములు, డాన్స్ షోల ద్వారా పాపులర్ అయిన పూర్ణ.. 2022లో అక్టోబర్లో షానిద్ ఆసిఫ్ అలీ అనే ఒక దుబాయ్ వ్యాపారవేత్తను పెద్దల సమక్షంలో దుబాయ్ లోనే వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తన వ్యక్తిగత జీవితాన్ని పెళ్లి తర్వాత ఫోటోల రూపంలో సోషల్ మీడియాలో పంచుకుంటూనే ఉంది. పైగా తన భర్త తనకు ఎంతో సపోర్ట్ చేస్తారని, కుటుంబ జీవితం చాలా సంతోషంగా సాగుతోంది అంటూ ఎన్నోసార్లు చెప్పుకొచ్చింది.

రెండవసారి తల్లి కాబోతున్న పూర్ణ..

Advertisement

అలాంటి ఈమె తమ సంతోషమైన దాంపత్య జీవితానికి గుర్తుగా 2023 ఏప్రిల్ లో ఒక బాబుకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కూడా సోషల్ మీడియా ద్వారానే పంచుకుంది. 2025లో మళ్లీ గర్భం దాల్చినట్లు ప్రకటించిన ఈమె.. తాజాగా బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఈ ఫోటోలో పూర్ణ ఎంతో అద్భుతంగా అందంగా కనిపిస్తోంది. తన భర్తతో రొమాంటిక్గా కలిసి దిగిన ఫోటోలను.. ఆప్యాయంగా తమ రెండవ బిడ్డ (బేబీ బంప్) ను తమ చేతులతో పట్టుకున్నట్టు ఆ ఫోటోలను షేర్ చేసింది. పైగా తాను వేసుకున్న ఈ పింక్ కలర్ గౌన్ ను తన భర్త బహుకరించినట్లు క్యాప్షన్ లో జోడించింది పూర్ణ. మొత్తానికైతే పూర్ణ మళ్ళీ తల్లి కాబోతోంది అని తెలిసి అభిమానులు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ALSO READ:Sankranti 2027: ఒకేసారి పోటీకి సిద్ధం అవుతున్న సీనియర్ స్టార్స్.. ఇది కదా అసలైన వార్!

కుటుంబ జీవితానికి మొదటి ప్రాముఖ్యత..

Advertisement

ఇకపోతే పూర్ణ సినిమా జీవితానికంటే కూడా కుటుంబ జీవితానికి ఎక్కువ విలువ ఇస్తుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. దుబాయ్ లోనే పూర్తిగా సెటిల్ అయ్యింది. కానీ అవకాశాలు వచ్చినప్పుడు మాత్రం ఇండియాకి వచ్చి వెళ్తూ ఉంటుంది. ఇక హైదరాబాద్ కి పదే పదే వచ్చి సినిమా షూటింగ్లలో పాల్గొంటున్న ఈమె తనతో పాటు తన కొడుకు హమ్జాద్ ను కూడా తీసుకొని వస్తుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ప్రస్తుతం గర్భం దాల్చడంతో ఇండస్ట్రీకి కాస్త బ్రేక్ ఇచ్చింది.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×