E-Paper
Advertisement

Duvvada : దువ్వాడకు జగన్ క్లాస్..!

Duvvada : దువ్వాడకు జగన్ క్లాస్..!
Advertisement

రాజకీయాలతో సంబంధం లేకుండా పేరు తెచ్చుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన మరెవరో కాదు వైసీపీ సస్పెండెడ్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. చాలా మంది రాజకీయాల్లో కష్టపడి పేరు సంపాదించుకుంటారు.కానీ ఆయన మాత్రం మరో మహిళతో ప్రేమాయణం సాగించి ఒక్కసారిగా ఫేమస్ అయిపోయారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆయన సుపరిచితుడు. దివ్వెల మాధురి-దువ్వాడ శ్రీనివాస్ అంటే సోషల్ మీడియాలో ఒక బ్రాండ్.. వారిద్దరూ సినిమాలో హీరోహీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఇంటర్వ్యూల ద్వారా చాలా పేరు సంపాదించుకున్నారు. దువ్వాడకు పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కట్టుకున్న భార్యను కాదని దివ్వెల మాధురితో ఆయన ప్రేమాయణం సాగించడం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది.

పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన.. సస్పెన్షన్!

దువ్వాడ శ్రీనివాస్ శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం నుంచి రెండు సార్లు 2014,2019లో వైసీపీ నుంచి ఒకసారి ఎమ్మెల్యే, మరోసారి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. దీంతో 2021లో మార్చిలో ఆయన్ను అప్పటి సీఎం జగన్.. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీని చేశారు. అయితే, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సిన్సియర్‌గా ఉన్న ఆయన.. పార్టీ అధికారం కోల్పోయే సమయానికి దివ్వెల మాధురితో ప్రేమాయణం సాగిస్తూ పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చారని ఆయనపై రీమార్క్ ఉండింది. ఆయన భార్య, పిల్లలు రోడ్డెక్కి తమను మోసం చేశాడని ఆరోపించడంతో పార్టీకి చెడ్డ పేరు వస్తుందని వైసీపీ క్రమశిక్షణా కమిటీ సిఫార్సు మేరకు ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించిన విషయం తెలిసిందే.

తీరు మార్చుకోని దువ్వాడ..

Advertisement

పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాక సైతం దువ్వాడ తీరులో ఎటువంటి మార్పు కనిపించలేదు.దివ్వెల మాధురితో కలిసి తిరుమలకు వెళ్లి అక్కడ ఫోటో షూట్ చేసి మరోసారి విమర్శల పాలై వైరల్ అయ్యారు.అంతేకాకుండా పలు టీవీ షోస్‌లో దివ్వెల మాధురితో కలిసి ఇంటర్వ్యూలు ఇవ్వడం ద్వారా వైసీపీకి చెడ్డ పేరును తీసుకొచ్చారని టాక్ ఉంది.గతంలో మాజీ సీఎం జగన్ ఒకసారి హెచ్చరించినా ఆయన తీరులో ఎటువంటి మార్పు రాలేదని పార్టీలోనే జోరుగా ప్రచారం జరిగింది. ఇటీవల వైసీపీ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీలోనూ ఆయన పాల్గొనలేదు. దీనికితోడు బుల్లెట్ బైకు మీద దివ్వెల మాధురితో కలిసి చక్కర్లు కొడుతున్న మరో వీడియా ఒక్కసారిగా వైరల్ అయ్యింది. దీంతో ఆయన్ను పార్టీ నుంచి పూర్తిగా బహిష్కరించాలని డిమాండ్ వినిపించాయి.

KTR : కేటీఆర్ కు దెబ్బ మీద దెబ్బ.. సో సారీ అన్న గులాబీ కేడర్!

Advertisement

ఈక్రమంలోనే మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్.. దువ్వాడ శ్రీనివాస్ ప్రవర్తనపై దృష్టిసారించినట్టు తెలుస్తున్నది. ఆయన తీరు వలన పార్టీకి ఎనలేని చెడ్డపేరు వస్తుండటంతో తీరుమార్చుకోవాలని లేదంటే ఈసారి పార్టీ నుంచి పూర్తి బయటకు పంపించేస్తానని వార్నింగ్ ఇచ్చినట్టు వైసీపీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది.జగన్ ఇంతలా క్లాస్ పీకాక కూడా దువ్వాడ తీరులో మార్పు వస్తుందా? ఇకమీదట పార్టీ క్రమశిక్షణకు లోబడి నడుచుకుంటారా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే భార్య పిల్లల నుంచి ఆయన మీద ఫిర్యాదులు ఉన్నాయి. 2027 మార్చి లేదా ఏప్రిల్‌లో ఆయన ఎమ్మెల్సీ పదవీ కాలం పూర్తి కానుంది. ఆయన గనుక పద్దతి మార్చుకోకపోతే ఈసారి జగన్ ఆగ్రహానికి గురవ్వాల్సి వస్తుందని ప్రచారం జరుగుతోంది.

Related News

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

మహిళను రోడ్డుపై వివస్త్రను చేస్తారా! గుంటూరు ఘటనపై చంద్రబాబు సీరియస్

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

Big Stories

Advertisement
×