Sankranti 2027:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్స్ గా గుర్తింపు తెచ్చుకున్న నాగార్జున (Nagarjuna ), చిరంజీవి (Chiranjeevi), బాలకృష్ణ (Balakrishna), వెంకటేష్(Venkatesh ) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా ఎవరికివారు సత్తా చాటుతూ ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అటు నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ సినీ బ్యాక్ గ్రౌండ్ నుండి అడుగుపెడితే.. చిరంజీవి మాత్రం ఎవరి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో మెగాస్టార్ గా నిలిచారు.
ఏడుపదుల వయసులో కూడా ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. అటు బాలకృష్ణ మాస్ లైనప్ తో అదరగొడుతుంటే..ఇటు వెంకటేష్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలతో ఆకట్టుకుంటున్నారు. ఇక నాగార్జున కొంతకాలం హీరోగా ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చి మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలతో సరిపెట్టుకుంటున్న విషయం తెలిసిందే .అలాంటి ఈయన ఇప్పుడు మళ్ళీ తన 100వ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడడానికి సిద్ధం అయిపోయారు.
సాధారణంగా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఒకే జనరేషన్ కి సంబంధించిన హీరోలు ఇద్దరూ లేదా ముగ్గురు ఒకేసారి పోటీ పడడం చూస్తూ ఉంటాం. కానీ ఒక జనరేషన్ కి చెందిన మొత్తం హీరోలంతా ఓకే పండుగను టార్గెట్గా చేసుకొని పోటీకి సిద్ధం అవుతుండడంతో ఆ హీరోలందరి అభిమానులు ఈ సినిమాల కోసం తెగ ఆసక్తి చూపిస్తున్నారు. నిజానికి ఇప్పటివరకు మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని కోల్డ్ వార్ జరిపిన అభిమానులు కూడా లేకపోలేదు. అలాంటిది ఇప్పుడు ఒకేసారి ఈ నలుగురు హీరోలు పోటీకి సిద్ధమవుతుండడంతో ఇది కదా అసలైన వార్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇకపోతే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ఇలా ఈ నలుగురు కూడా మొదటిసారి.. అందులోనూ పొంగల్ బాక్సాఫీస్ వద్ద తమ సినిమాలతో పోటీ పడడానికి సిద్ధమవుతున్నారు. ఇక విషయంలోకి వెళ్తే.. వాల్తేరు వీరయ్య తర్వాత చిరంజీవి మరోసారి బాబీ డైరెక్షన్లో సినిమా చేస్తున్నారు. బెంగాల్ మాఫియా డాన్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాకముందే 2027 జనవరి 12వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.
మరోవైపు వీరసింహారెడ్డి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న బాలకృష్ణ మరోసారి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK 111 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేయబోతున్నారు. అయితే ఈ సినిమా కూడా ఇంకా ప్రారంభం కాకపోయినా ఈ సినిమా 2027 సంక్రాంతి బాక్స్ ఆఫీస్ వద్ద జనవరి 13వ తేదీన విడుదలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఇక మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా తర్వాత అనిల్ రావిపూడి తన కొత్త ప్రాజెక్టును ప్రకటించకపోయినా అటు ఫహద్ ఫాజిల్ , వెంకటేష్ తో కలిసి 2027 సంక్రాంతి టార్గెట్గా ఒక సినిమా చేయబోతున్నారని.. ఈ సినిమాను జనవరి 14వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు అంటూ ఒక వార్త వినిపిస్తోంది. అయితే ఇందులో ఇంత నిజం ఉందో తెలియదు కానీ అనిల్ తో ఎవరు సినిమా చేసినా సరే ఆ సినిమా సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద పోటీ పడడం ఖాయమని చెప్పవచ్చు.
మరొకవైపు తన 100వ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు నాగార్జున. సోగ్గాడే చిన్నినాయన ఫ్రాంచైజీలో భాగంగా వస్తున్న ఈ మూడవ సినిమా ఖచ్చితంగా 2027 సంక్రాంతికి వస్తుందని నాగార్జున ఖచ్చితంగా చెప్పిన విషయం తెలిసిందే. జనవరి 15 2027న సంక్రాంతి సోగ్గాళ్లు వస్తున్నారు వాసి వాడి తస్సాదియ్య డేట్ మార్కు చేసుకోండి అంటూ ఏకంగా అన్నపూర్ణ స్టూడియో అధికారిక ప్రకటన చేసింది.
ఇకపోతే ఈ నలుగురు హీరోలు కచ్చితంగా బాక్సాఫీస్ వద్ద పోటీ పడతారనే వార్తలు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్నాయి . అయితే ఎవరు ఈ బాక్స్ ఆఫీస్ వద్ద సంక్రాంతి బరిలో పోటీ పడబోతున్నారో తెలియాలి అంటే ఈ ఏడాది ఆఖరి వరకు ఎదురు చూడాల్సిందే.
ALSO READ:Jana Nayagan: జననాయగన్ విడుదలకు లైన్ క్లియర్.. కొత్త డేట్ ఎప్పుడంటే?