E-Paper
Advertisement

Actress Sreeleela: చేతులు జోడించి అడుగుతున్నా.. అలా చేయకండి, శ్రీలీలా ఎమోషనల్ పోస్ట్!

Actress Sreeleela: చేతులు జోడించి అడుగుతున్నా.. అలా చేయకండి, శ్రీలీలా ఎమోషనల్ పోస్ట్!
Advertisement

పెరుగుతున్న టెక్నాలజీ సమాజానికి మంచి చేయాలే తప్ప, చెడు చేయకూడదు. కానీ, చాలా మంది కొత్తగా అందుబాటులోకి వచ్చిన AI టెక్నాలజీని అత్యంత దారుణంగా మిస్ యూజ్ చేస్తున్నారు. సెలబ్రిటీల నుంచి సాధారణ వ్యక్తుల వరకు AI సాయంతో మార్ఫింగ్ ఫోటోలు క్రియేట్ చేసి, సోషల్ మీడియాలోకి వదులుతున్నారు. అమాయకులను నిజమే అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు హీరోయిన్లకు సంబంధించిన AI ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ కాగా, తాజాగా క్యూట్ బ్యూటీ శ్రీలీల ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే సదరు ముద్దుగుమ్మ రియాక్ట్ అయ్యింది. టెక్నాలజీని మిస్ యూజ్ చెయ్యొద్దని చేతులు జోడించి వేడుకుంది.

చేతులు జోడించి ప్రాధేయపడిన శ్రీలీల

రీసెంట్ గా తమన్నా, శ్రీలీకు సంబంధించి కొన్ని బాత్రూమ్ ఫోటోలు బయటకు వచ్చాయి. అయితే, తొలుత అవి నిజమైనవే అని నమ్మారు. కానీ, ఆ తర్వాత AIతో క్రియేట్ చేశారని తెలిసి షాకయ్యారు. ఈ వ్యవహారంపై శ్రీలీల రియాక్ట్ అయ్యింది. “సోషల్ మీడియా వినియోగదారులకు చేతులు జోడించి వేడుకుంటున్నాను. అర్థంపర్థం లేని AI-జనరేటెడ్ ఫోటోలు, వీడియోలను సమర్థించకండి. వైరల్ చేయకండి. టెక్నాలజీని ఉపయోగించడం, దుర్వినియోగం చేయడం మధ్య తేడా ఉంది. టెక్నాలజీ సమాజానికి మేలు చేసేలా ఉండాలి తప్ప, కీడు చేయకూడదు. ప్రతి వారికి ఒక కూతురు, మనవరాలు, సోదరి, స్నేహితురాలు, సహోద్యోగి ఉంటారు. ఆమె తనకు నచ్చిన రంగాన్నిఎంచుకున్నప్పటికీ.. సురక్షితంగా ఉంటుందని భావించాలి. బిజీ షెడ్యూల్ కారణంగా ఆన్‌ లైన్‌ లో జరుగుతున్న చాలా విషయాల గురించి నాకు తెలియలేదు. ఈ విషయాన్ని నా దృష్టికి తెచ్చినందుకు శ్రేయోభిలాషులకు థ్యాంక్స్. నేను ఎప్పుడూ నా సొంత ప్రపంచంలోనే జీవిస్తాను. కానీ, కొంత మంది ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నాతోటి నటులకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురవుతోంది. దయచేసి టెక్నాలజీ మిస్ యూజ్ ను అడ్డుకోవాలని వేడుకుంటున్నా. నెటిజన్లు మాకు అండగా నిలబడాలని కోరుకుంటున్నాను” అని శ్రీలీల ఇన్ స్టాలో పోస్టు పెట్టింది.

Advertisement

Read Also: ‘నీ B**bs ఒరిజినల్లా?’.. హీరోయిన్‌కు అసభ్యకరమైన క్వశ్చన్

అసలు ఏం జరిగిందంటే?

Advertisement

ఇటీవల టాలీవుడ్ హీరోయిన్లు శ్రీలీల, తమన్నా పేరుతో కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అవి చూసిన వారికి ఫస్ట్ నిజమైన ఫోటోలుగా అనిపించినప్పటికీ, ఆ తర్వాత AI క్రియేటెడ్ ఫోటోలుగా తేలాయి.  వైరల్ అయిన ఫోటోల్లో ఇద్దరు హీరోయిన్లు బాత్రూమ్ లో నిలబడి మిర్రర్ ముందు సెల్ఫీలు తీసుకున్నట్టుగా ఉంది. అయితే, ఈ ఫోటోల్లో ఇద్దరి బాడీ ఒకేలా ఉన్నా, ముఖాలు మాత్రమే మార్చినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపైనే తాజాగా శ్రీలీల ఎమోషనల్ పోస్టు పెట్టింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ రెండు సినిమాల్లో నటిస్తోంది. అందులో ఒకటి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కాగా, మరొకటి ‘పరాశక్తి’.

Read Also: ఎన్నో ట్విస్ట్ లతో శ్రీవాణి పెళ్లి.. ఆస్తులు కోసం ఇప్పటికీ గొడవలు..నరకం..

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×