E-Paper
Advertisement

Big TV Kissik Talks: ఎన్నో ట్విస్ట్ లతో శ్రీవాణి పెళ్లి.. ఆస్తులు కోసం ఇప్పటికీ గొడవలు..నరకం..

Big TV Kissik Talks: ఎన్నో ట్విస్ట్ లతో శ్రీవాణి పెళ్లి.. ఆస్తులు కోసం ఇప్పటికీ గొడవలు..నరకం..
Advertisement

Kissik Talks Promo : తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న టాప్ న్యూస్ ఛానల్ బిగ్ టీవీ.. నిరంతరం వార్తలను అందించడంతో పాటుగా జనాలను ఎంటర్టైన్ చేయడంలో కూడా ఈ ఛానల్ ముందు వరుసలో ఉంటుంది. ఇప్పటికే ఎన్నో ప్రోగ్రామ్ లను అందిస్తుంది. రీసెంట్ గా ఈ ఛానెల్ కిస్సిక్ టాక్ షోను స్టార్ట్ చేశారు.. ఈ షో ని స్టార్ట్ చేసిన అతి కొద్ది రోజుల్లోనే మంచి రెస్పాన్స్ ను అందుకోవడం మాములు విషయం కాదు. జబర్దస్త్ వర్ష దీనికి హోస్ట్ గా వ్యవరిస్తున్నారు. ఇప్పటికే ఈ షోలో ఎంతోమంది సెలబ్రిటీలు సందడి చేశారు. ఈ షోలో పాల్గొన్న సెలబ్రిటీలు తమ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ షో కి గెస్ట్ గా సీరియల్ యాక్టర్ శ్రీవాణి వచ్చారు. ఇందులో ఆమె పెళ్లి గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.. అంతేకాదు ఆస్తుల గురించి జరుగుతున్న గొడవల గురించి సంచలన విషయాలను బయటపెట్టారు. ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో వైరల్ అవుతుంది.. అసలు శ్రీవాణి తన పర్సనల్ లైఫ్ గురించి ఏం చెప్పిందో ఒకసారి తెలుసుకుందాం..

సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న యాక్టర్ శ్రీవాణి..

సీరియల్ యాక్టర్ శ్రీవాణి గురించి ఎంత చెప్పినా తక్కువే. బుల్లితెర యాంకర్ గా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ అమ్మడు ఆ తర్వాత వరుసగా సీరియల్లలో నటిస్తూ బిజీగా మారింది.. చంద్రముఖి’, ‘కలవారి కోడళ్లు’, ‘కాంచనగంగ’, ‘మావిచిగురు’, ‘మనసు మమత’ వంటి సూపర్ హిట్ సీరియల్స్‌లో నటించారు.. ఈ మధ్య సీరియల్స్ అలాగే సొంత యూట్యూబ్ ఛానెల్స్ లో వీడియోలు పెడుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తాజాగా శ్రీవాణి బిగ్ టీవీ కిస్సిక్ టాక్ షోకు గెస్ట్ గా వచ్చింది. ఈమె ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో వర్ష శ్రీవాణిని సీరియల్ అని చెప్పి పెళ్లి చేసుకొని వచ్చారట.. నిజమేనా అని అడుగుతుంది. దానికి శ్రీవాణి సమాధానం చెప్పారు. కుటుంబ సమస్యలు ముఖ్య కారణం. అందుకే అలా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అని చెప్పింది. ప్రస్తుతం వీడియో వైరల్ అవ్వడంతో దీనిపై సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Also Read : భానుమతికి కమల్ ఝలక్.. ఆస్తి కోసం శ్రీయ గొడవ..రాజేంద్ర ప్రసాద్ కీలక నిర్ణయం..

సొంతవాళ్ళే ఆస్తుల కోసం దారుణాలు.. 

ఈ షోలో తన భర్త గురించి ఎన్నో ఆసక్తి కర విషయాలను పంచుకుంది శ్రీవాణి.. ఆమె భర్త విక్రమాదిత్య కూడా ఒక నటుడు అన్న విషయం తెలిసిందే. వీరిద్దరి పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి ప్రేమకు గుర్తుగా ఒక పాప ఉంది. ప్రస్తుతం ఆ అమ్మాయి ఢీ షోలో డాన్సర్ గా చేస్తుంది. ఇదిలా ఉండగా వర్ష ఇప్పటివరకు మీరు ఎంత ఆస్తిని సంపాదించారు అని అడుగుతుంది. మా పాప పేరు మీద రెండు ఎకరాలు వాళ్ళ తాతయ్య గారు రాశారు. ఇందులో మాది మాత్రం కేవలం 300 గజాలు మాత్రమే. మరి ఇప్పటికీ ఈ ఆస్తుల గురించి ఏవో గొడవలు జరుగుతున్నాయని విన్నాము అని వర్ష అడుగుతుంది. వాటి గురించి ఏం చెప్పాలిలెండి అప్పటినుంచి ఇప్పటికీ పెద్ద తగాదాలే జరుగుతున్నాయి అని శ్రీవాణి చెప్పింది. మా ఆయన వాళ్ళ సొంత వాళ్లే గొడవలకు దిగడం బాధాకరం. ఇప్పటికీ ఆ ఆస్తులు గురించి గొడవలు జరుగుతున్నాయి మేము నరకం చూస్తున్నాము అని శ్రీవాణి తమ బాధని బయటపెట్టింది.. ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శ్రీవాణి ఇంకా ఎటువంటి విషయాల గురించి పంచుకున్నారో ఒకసారి చూసేయండి..

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×