E-Paper
Advertisement

Top 20 News Today: కారు ఢీ కొని కానిస్టేబుల్ మృతి.., సికింద్రాబాద్‌లో నేపాలీ గ్యాంగ్ హల్‌చల్

Top 20 News Today: కారు ఢీ కొని కానిస్టేబుల్ మృతి.., సికింద్రాబాద్‌లో నేపాలీ గ్యాంగ్ హల్‌చల్

1. అటవీ అధికారులతో డిప్యూటీ సీఎం సమీక్ష

ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధంపై.. అటవీ అధికారులతో సమీక్ష నిర్వహించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎర్ర చందనం అమూల్య సంపదన్నారు. దాన్ని భావి తరాలకు అందించాలన్నారు. ఎర్ర చందనం చెట్లకు రక్షణ కల్పించేందుకు.. పోలీసు-అటవీ శాఖల సమన్వయం చేయాలని చెప్పారు.

2. కల్తీ నెయ్యి కేసు.. విచారణలో టీటీడీ మాజీ ఛైర్మన్

కల్తీ నెయ్యి కేసులో ఈనెల 20న టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విచారణ ఎదుర్కోనున్నారు. ఈనెల 13న విచారణకు హాజరుకావాలని సీఐడీ నోటీసులు పంపగా… తన ఆరోగ్యం సహకరించనందున హైదరాబాద్‌లో విచారణ చేయాలని సుబ్బారెడ్డి కోరారు. దీంతో సీఐడీ ఈనెల 20న విచారణ చేస్తామని తెలిపింది.

3. భక్తులను మమేకం చేసిన అద్భుత దృశ్యం

ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం పాలకొండ కోట దుర్గమ్మ ఆలయ చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా సూర్యకిరణాలు అమ్మవారిని పూర్తిగా తాకాయి. ఈ అద్భుత దృశ్యం శుభ పరిణామమని అర్చకులు పేర్కొనగా, భక్తులు పరవశించిపోయారు.

4. యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి దర్శనానికి భక్తుల సముద్రం

యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉచిత దర్శనానికి 5 గంటల సమయం.. ప్రత్యేక దర్శనానికి 2గంటల సమయం పడుతోంది. కార్తీక మాసం చివరి వారం కావడంతో భక్తులు రద్దీ ఎక్కువగా ఉంది. ఆలయ మాడ వీధులు కిక్కిరిసిపోయాయి.

5. సీఎం సహకారంతో ములుగును అభివృద్ధి చేస్తామన్న మంత్రి

ములుగు జిల్లాలో 45 లక్షల నిధులతో గట్టమ్మగుడి వద్ద ఫుట్‌ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మంత్రి సీతక్క. మేడారం భక్తుల సౌకర్యార్థం ఈ బ్రిడ్జిని నిర్మిస్తున్నామని సీతక్క తెలిపారు. సీఎం రేవంత్ సహకారంతో ములుగును అభివృద్ధి చేస్తున్నామని ఆమె వివరించారు.

6. కారు ఢీ కొని కానిస్టేబుల్ మృతి..

కారు ఢీకొట్టిన ఘటనలో కానిస్టేబుల్ దుర్మరణం చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన నాగారంలోని సూర్యాపేట-జనగామ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. అతివేగంతో వచ్చిన గుర్తుతెలియని కారు ముందుగా వెళ్తున్న లారీ, ఆటోను తప్పించబోయి ఈ ముగ్గురినీ ఢీ కొట్టింది.

7. సీఎం రేవంత్, డీజీపీలకు ట్వీట్ చేసిన బాధితుడు

నిజామాబాద్‌లో పాత నేరస్తుడు వినయ్ గౌడ్ రెచ్చిపోయాడు. శ్రీరామ్ అనే వ్యక్తిపై దాడి చేశాడు. పోలీస్ కమిషనరేట్‌కు ఈడ్చుకెళ్లి మరోసారి దాడికి పాల్పడ్డాడు. దీనిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం జరగడం లేదని సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీలకు Xలో ట్వీట్ చేశారు.

8. కాణిపాకంలో పోటెత్తిన భక్తులు

కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. క్యూలైన్లు నిండిపోయాయి. 150 టికెట్ల లైన్లలోనూ రద్దీ ఉంది. భక్తులకు ఇబ్బంది లేకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.

9. వేములపల్లి రోడ్డు ప్రమాదం.. వెనుక నుండి ఢీకున్న బైక్.. స్పాట్లోనే ఒకరు

నల్గొండ జిల్లా వేములపల్లి పోలీస్ స్టేషన్ ముందు రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బైక్‌ను వెనుక నుంచి మరో బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మృతుడిని ప్రకాశం జిల్లా వేటపాలెంకు చెందిన బొడ్డు శ్రీనివాసరావుగా గుర్తించారు పోలీసులు.

10. కాలనీవాసుల ఆందోళన, బీఆర్ఎస్ నేత మద్దతు

రంగారెడ్డి జిల్లా మీర్ పేట ప్రధాన రోడ్డుపై వైన్ షాపు ఏర్పాటును వ్యతిరేకిస్తూ కాలనీవాసులు ఆందోళన చేపట్టారు. వారికి బీఆర్ఎస్ నేత రాజ్‌కుమార్ మద్దతిచ్చారు. పాఠశాలలు, ఆలయాల సమీపంలో షాపు వద్దని.. ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయని వారు తెలిపారు.

11. ఎన్టీఆర్ జిల్లా కీసర వద్ద కారుప్రమాదం

ఎన్టీఆర్ జిల్లా కీసర వద్ద కారులో మంటలు చెలరేగాయి. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి టిప్పర్‌ను ఢీ కొట్టింది. దీంతో కారులో మంటలు చెలరేగాయి. వెంటనే కారులోని ప్రయాణికులు కిందకు దిగారు. సమీపంలో ఉన్న టోల్ ఫ్లాజా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపుచేశారు.

12. వైసీపీ ఇంఛార్జ్ దీపిక స్థానిక టీడీపీకి స్ట్రాంగ్ వార్నింగ్

హిందూపూర్ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. వైసీపీ ఇంఛార్జ్ దీపిక స్థానిక టీడీపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తాము ఇక్కడే ఉంటామని.. వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని ఎవరు కాపాడుతారో చూస్తామని అన్నారామె. తమ పార్టీ ఆఫీస్‌పై దాడి చేసిన వారిపై న్యాయపరంగా ముందుకెళ్తామని అన్నారు.

13. సికింద్రాబాద్‌లో నేపాలీ గ్యాంగ్ దోపిడి

సికింద్రాబాద్ కార్ఖానాలోని గన్‌రాక్ ఎన్‌క్లేవ్‌లో నేపాలీ గ్యాంగ్‌ భారీ చోరీ చేసి పరారైంది. ఇంట్లో పనిచేసే నేపాలీ గ్యాంగ్ యజమాని కెప్టెన్‌ గిరిని బంధించి దాడి చేసింది. వారు 25 తులాల బంగారం, 23 లక్షల నగదు దోచుకుని పరారయ్యారు. యజమాని ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

14. బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే మధుకు సీబీఐ నోటీసులు

హైకోర్ట్ అడ్వకేట్స్ నాగమణి, వామన్ రావు దంపతుల జంట హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకు హాజరుకావాలని తెలిపింది.

15. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి

పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరులో స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహాన్ని మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మార్టేరులో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు మంత్రి.

16. ఎర్రకోట సమీపలో 9 ఎం ఎం సైనిక బుల్లెట్లు

ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటన దర్యాప్తులో ఢిల్లీ పోలీసులకు 9 ఎంఎం సైనిక బుల్లెట్లు లభించాయి. ఇవి భద్రతా సిబ్బందివి కాదని తేలడంతో, ఆయుధాలు ఎలా వచ్చాయనే కోణంలో దర్యాప్తు వేగవంతం చేశారు. పేలుడుకు అమ్మోనియం నైట్రేట్ ఉపయోగించినట్లు నిర్ధారించారు.

17. ఆయుధాల పంపిణీ ఆరోపణలపై గవర్నర్ సీవీ

టీఎంసీ ఎంపీ కల్యాణ్‌ బెనర్జీ చేసిన ఆరోపణలను పశ్చిమ బెంగాల్ గవర్నర్‌ సీవీ ఆనంద బోస్‌ తోసిపుచ్చారు. రాజ్‌ భవన్‌లో ఆయుధాలు ఇస్తున్నారని చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. ఆరోపణలు నిరాధారమని.. క్షమాపణలు చెప్పకపోతే చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరించారు.

18. ఆహార సుంకాలను తొలగిస్తూ.. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్

వివిధ దేశాలపై అధ్యక్షుడు ట్రంప్‌ సుంకాల కారణంగా అమెరికాలో వస్తువుల ధరలు పెరిగిపోయాయి. దీంతో వినియోగదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఒత్తిడికి తలొగ్గిన ట్రంప్.. ఆహార ఉత్పత్తులపై సుంకాలను తొలగిస్తూ.. ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై సంతకం చేశారు. ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగలడం కూడా కారణం కావొచ్చు.

19. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో అసభ్య తాకుబాటుపై ఆవేదన

మంచు లక్ష్మి తన 15 ఏళ్ల వయసులో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ప్రయాణిస్తున్నప్పుడు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు. ఒక వ్యక్తి తనను అసభ్యంగా తాకాడని, అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదని చెప్పారు. సెలబ్రిటీ కుటుంబం నుంచి వచ్చిన తనకే ఇలా జరిగితే.. సామాన్య మహిళల పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు.

20. టీమిండియా ఓటమి

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఓడిపోయింది. 124 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్.. కేవలం 93 రన్స్‌కే ఆలౌటైంది. సుందర్ 31, అక్షర్ పటేల్ 26, జడేజా 18, జురెల్ 13 రన్స్ చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో హార్మర్ నాలుగు, మార్కో రెండు, కేశవ్ రెండు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించారు.

 

 

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×