Vidya Balan: విద్యాబాలన్ పరిచయం అవసరం లేని పేరు. నటిగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించిన ఈమె ఇటీవల నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన జైలర్ 2(Jailer 2) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో విద్యాబాలన్(Viday Balan) కాంత అనే పవర్ఫుల్ నెగిటివ్ పాత్రలో కనిపించి సందడి చేశారు. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో విజయవంతంగా ప్రసారమవుతుంది. ఈ నేపథ్యంలోనే విద్యాబాలన్ పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా విద్యాబాలన్ ప్రముఖ లెజెండరీస్ సింగర్ ఎమ్మెస్ సుబ్బలక్ష్మి బయోపిక్(M.S.Subbalakshmi Biopic) సినిమా గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా విద్యాబాలన్ మాట్లాడుతూ.. 2014లో రాజీవ్ మేనన్ తో కలిసి ఎమ్మెస్ సుబ్బలక్ష్మిపై సినిమా చేయాలని అనుకున్నాము అందుకు అనుగుణంగా స్క్రిప్ట్ కూడా పూర్తి అయింది. అయితే ఆ సినిమా పై స్టే ఆర్డర్ ఉండటం వల్ల మేము ఈ సినిమా చేయలేకపోయామని విద్యాబాలన్ తెలిపారు. ఎమ్మెస్ సుబ్బలక్ష్మి పాత్రలో నటించడమే నా కల. ఇప్పటికీ నా ఈ కోరిక నెరవేరనందుకు చాలా బాధపడుతున్నానని తెలిపారు..
ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారు పాడిన సుప్రభాతంతోనే మారోజు ప్రారంభమవుతుందని తెలిపారు. ఎమ్మెస్ సుబ్బలక్ష్మి బయోపిక్ సినిమాలో నటించడం కోసం నేను ఆమెకు సంబంధించి ఎన్నో విషయాలను తెలుసుకున్నానని విద్యాబాలన్ తెలియజేశారు. ఇలా ఎమ్మెస్ సుబ్బలక్ష్మి బయోపిక్ సినిమాలో చేయాలనే కోరిక తీరకపోవడంతో ఫోటోషూట్ ద్వారా తన కలను నెరవేర్చుకున్నానని ఈమె తెలియజేశారు. రెండు సంవత్సరాల క్రితం ఎమ్మెస్ సుబ్బలక్ష్మికి నివాళులు అర్పిస్తూ ఫోటోషూట్ చేసామని గుర్తు చేసుకున్నారు. ఇలా ఎమ్మెస్ సుబ్బలక్ష్మి బయోపిక్ సినిమాలో తాను నటించాలనుకున్నప్పటికీ అది వీలుపడలేదు అంటూ ఈమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఇకపోతే ప్రస్తుతం ఎమ్మెస్ సుబ్బలక్ష్మి బయోపిక్ సినిమా ప్రస్తుతం తెరపైకి రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ప్రముఖ నటి రష్మిక మందన్న(Rashmika Mandanna) సుబ్బలక్ష్మి పాత్రలో కనిపించబోతున్నారు. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో గీత ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ఘనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇలా విద్యాబాలన్ చేయాలనుకున్న ఈ ప్రాజెక్టు కాస్త రష్మిక చేతులలోకి వెళ్ళింది.ఇటీవల ఎంతో మంది సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా ప్రారంభమైన ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులను జరుపుకోబోతోంది. సుబ్బలక్ష్మిగా రష్మిక మందన్న ఎలా ప్రేక్షకులను మెప్పిస్తారు అనేది తెలియాల్సి ఉంది.
Also Read: ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..