Raviteja: టాలీవుడ్ మాస్ హీరో రవితేజ వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు ఇప్పటివరకు 77 సినిమాలలో నటించి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు. ఇక త్వరలోనే రవితేజ తన 78వ సినిమా షూటింగ్ పనులలో బిజీ కాబోతున్నారు. ఇటీవల తన 78వ సినిమాకి సంబంధించిన పూజ కార్యక్రమాలు కూడా ఎంతో ఘనంగా పూర్తి అయ్యాయి. ఈ సినిమాకు తులాభారం (Thulabharam) అనే టైటిల్ కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్నాయి.
ఇక ఈ సినిమా త్వరలోనే షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకు రవితేజ రెమ్యూనరేషన్(Raviteja Remunerations) కి సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. రవితేజ నటించి సినిమాలన్నీ వరుసగా డిజాస్టర్ గా మిగలడంతో అభిమానులు కూడా నిరాశ చెందారు ఈ నేపథ్యంలోనే రవితేజ సైతం తన రెమ్యూనరేషన్ భారీగా తగ్గించుకున్నారని తెలుస్తోంది. అయితే ఇటీవల ఈయన శివ నిర్వాణ దర్శకత్వంలో నటించిన డివోషనల్ మూవీ ఇరుముడి సినిమా (Irumudi)ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుని. సుమారు 250 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది.
ఈ విధంగా రవితేజ నటించిన ఇరుముడి సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఈయన తదుపరి సినిమాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే వివేక్ ఆత్రేయ(Vivek Athereya) దర్శకత్వంలో రవితేజ మరో సినిమాకు కమిట్ అయ్యారు ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకోవడమే కాకుండా ఈ సినిమాకు తులాభారం (Thulabharam) అనే టైటిల్ కూడా ప్రకటించారు. ఇక ఈ సినిమా కోసం రవితేజ ఏకంగా 40 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బ్రిడ్జ్ ప్రొడక్షన్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో భాగంగా రవితేజ ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో కచ్చితంగా ఈ సినిమా బడ్జెట్ అలాగే మార్కెట్ పై తీవ్రమైన ప్రభావం చూపుతోందని నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు.
ఇరుముడి సినిమా మంచి సక్సెస్ కావడంతోనే రవితేజ రెమ్యూనరేషన్ కూడా పెంచారని తెలుస్తుంది. ఇక ఈ సినిమా హర్రర్ కామెడీ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. ఇందులో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా అనస్వరరాజన్ కీలకపాత్రలో కనిపించబోతున్నారు. ఇక రవితేజ విలన్ గా నటుడు జేడీ చక్రవర్తి ఈ సినిమాలో విలన్ పాత్రలో సందడి చేయబోతున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్నాయి. ఇక ఈ సినిమా కోసం రవితేజ రెమ్యూనరేషన్ మాత్రం సంచలనంగా మారింది.
Also Read: 4 నెలల నుంచి దుష్ప్రచారం.. మొదటిసారి స్కామ్ ఆరోపణలపై స్పందించిన నందన!